AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swaminarayan Akshardham: మహంత్ స్వామి మహారాజ్ జీవితం మార్గదర్శకం.. అమెరికాలో అంగరంగ వైభవంగా అక్షర్‌ధామ్‌ ప్రతిష్టాపన ఉత్సవాలు..

అమెరికాలోని న్యూజెర్సీ రాబిన్స్‌విల్లె పట్టణంలో నిర్మించిన బీఏపీఎస్‌ స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌ ప్రతిష్టాపన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భారత్‌ వెలుపల నిర్మితమైన అతిపెద్ద హిందూ దేవాలయం స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌ ప్రారంభోత్సవం అక్టోబర్ 8న జరగనుంది. దీనిలో భాగంగా ప్రతిష్టాపన ఉత్సవాలను సెప్టెంబర్ 30 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలు నిన్నటితో 7 రోజులు పూర్తయ్యాయి.

Swaminarayan Akshardham: మహంత్ స్వామి మహారాజ్ జీవితం మార్గదర్శకం.. అమెరికాలో అంగరంగ వైభవంగా అక్షర్‌ధామ్‌ ప్రతిష్టాపన ఉత్సవాలు..
Mahant Swami Maharaj
Shaik Madar Saheb
|

Updated on: Oct 07, 2023 | 5:12 PM

Share

అమెరికాలోని న్యూజెర్సీ రాబిన్స్‌విల్లె పట్టణంలో నిర్మించిన బీఏపీఎస్‌ స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌ ప్రతిష్టాపన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భారత్‌ వెలుపల నిర్మితమైన అతిపెద్ద హిందూ దేవాలయం స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌ ప్రారంభోత్సవం అక్టోబర్ 8న జరగనుంది. దీనిలో భాగంగా ప్రతిష్టాపన ఉత్సవాలను సెప్టెంబర్ 30 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలు నిన్నటితో 7 రోజులు పూర్తయ్యాయి. 9వరోజు ఆలయాన్ని ప్రారంభించనున్నారు. స్వామినారాయణ్ అక్షరధామ్‌‌ దేవాలయాన్ని మహంత్ స్వామి మహారాజ్ మార్గదర్శకత్వంలో అత్యంత సుందరంగా అద్భుతంగా నిర్మించగా.. దేశ నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తున్నాయి. BAPS స్వామినారాయణ్ అక్షరధామ్ ఆశ, విశ్వాసం, ఐక్యతకు వెలుగుగా నిలువనుంది.. ఇది భక్తి.. ధర్మ మార్గం వైపు ప్రజలను ఆకర్షించనుంది. USAలో అక్షరధామ్ కోసం శ్రమించిన ప్రముఖ్ స్వామి మహారాజ్ లోతైన ఆధ్యాత్మిక దూరదృష్టి, అంకితభావానికి నిదర్శనంగా నిలువనుంది. అంతర్గత కోరిక నుంచి అద్భుతమైన వాస్తవికత వరకు, ప్రముఖ్ స్వామి మహారాజ్ జీవితకాల నినాదం “సెలబ్రేటింగ్ ఇన్ ది జాయ్ ఆఫ్ అదర్స్” పేరుతో శుక్రవారం సాయంత్రం కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లేలో BAPS స్వామినారాయణ్ అక్షరధామ్ వ్యవస్థాపించిన హహారాజ్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం అక్షరధామ్ ప్రారంభోత్సవానికి నాందిగా ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మికవేత్త పవిత్ర మహంత్ స్వామి మహారాజ్.. జీవితం అందరికీ మార్గదర్శకంగా నిలిచిపోనుంది.

ప్రముఖ్ స్వామి మహారాజ్ జీవితం నిస్వార్థ సేవ, భక్తి యొక్క పరివర్తన శక్తికి నిదర్శనమని.. చాలా మంది స్వాములు ప్రముఖ స్వామి మహరాజ్‌తో తమ అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అతను వారి జీవితాలపై, ఆధ్యాత్మిక ప్రయాణాలపై తీవ్ర ప్రభావం చూపారంటూ కొనియాడారు.

వీడియో చూడండి..

పూజ్య జ్ఞానవత్సలదాస్ స్వామి మాట్లాడుతూ.. ప్రముఖ్ స్వామి మహారాజ్ అనేక మందిరాలను నిర్మించారంటూ కొనియాడారు. ప్రారంభం నుంచి చివరి వరకు అహర్నిశలు పాటుపడి.. ఎంతో మందికి జీవితాలను ప్రభావితం చేశారని.. సమాజ అవసరాలకు అనుగుణంగా ఆలయాలను నిర్మించారన్నారు. హృదయపూర్వక స్మృతులు.. ప్రముఖ్ స్వామి మహారాజ్ అపరిమితమైన ఆప్యాయత, వినయం, నిస్వార్థతతో సహా దైవిక లక్షణాలను నొక్కిచెబుతాయని గుర్తుచేశారు. ఈ లక్షణాలు దైవంతో అతని ఆధ్యాత్మిక సంబంధంలో లోతుగా పాతుకుపోయాయి.. అవి నేటికీ స్ఫూర్తికి మూలంగా పనిచేస్తూనే ఉన్నాయన్నారు.

పూజ్య గురుదేవశ్రీ రాకేష్‌జీ, శ్రీమద్ రాజ్‌చంద్ర మిషన్ ఆధ్యాత్మిక అధిపతి మహారజ్ తో అనేక క్షణాలను గుర్తు చేసుకున్నారు. ప్రముఖ్ స్వామి మహరాజ్ జీవిత గమనం.. మందిరాలను ఏర్పాటు చేయడం.. సాధువులకు చేయూతనివ్వడం తదితర విషయాలను పంచుకున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..