Israel-Palestine conflict: ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడులు.. వీధుల్లో పౌరులపై కాల్పులు
పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ గ్రూప్ మెరుపు దాడుల వల్ల ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికీ అక్కడ యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై మెరుపు దాడికి దిగినటువంటి హమాస్ మిలిటెంట్లు.. సరిహద్దును దాటి దేశంలోకి చొరబడ్డారు. అంతేకాదు ఇజ్రాయెల్ వీధుల్లో తిరుగుతూ పౌరులపై కాల్పులు జరుపుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దక్షిణ ఇజ్రాయెల్‌లోని సెరాట్ ప్రాంతంలో కొందరు హమాస్ ఉగ్రవాదులు వాహనంలో వెళ్తూ రోడ్డుపై వెళ్తున్న ఓ ఎస్‌యూవీ వాహనంపై కాల్పులు జరిపారు.
పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ గ్రూప్ మెరుపు దాడుల వల్ల ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికీ అక్కడ యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై మెరుపు దాడికి దిగినటువంటి హమాస్ మిలిటెంట్లు.. సరిహద్దును దాటి దేశంలోకి చొరబడ్డారు. అంతేకాదు ఇజ్రాయెల్ వీధుల్లో తిరుగుతూ పౌరులపై కాల్పులు జరుపుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దక్షిణ ఇజ్రాయెల్‌లోని సెరాట్ ప్రాంతంలో కొందరు హమాస్ ఉగ్రవాదులు వాహనంలో వెళ్తూ రోడ్డుపై వెళ్తున్న ఓ ఎస్‌యూవీ వాహనంపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఓ స్థానికుడు తన టెర్రస్‌పై నిల్చుని ఈ వీడియోను రికార్డ్ చేసినట్లు కనిపిస్తోంది. అలాగే మిలిటెంట్లు అతడిని గమనించి కాల్పులు జరిపడానికి ప్రయత్నించగా.. అతడు వెంటనే కిందకు వంగి గోడ వెనుక తలదాచుకున్నట్లుగా ఆ వీడియోలో కనిపిస్తోంది.
Just surreal! Footage of Palestinian Hamas terrorists who infiltrated into Israel from Gaza, firing at residents in Sderot from an SUV. pic.twitter.com/ffUO5XwG1I
ఇవి కూడా చదవండి— Arsen Ostrovsky (@Ostrov_A) October 7, 2023
అయితే అంతర్జాతీయ మానవహక్కుల న్యాయవాది ఆర్సెన్ ఒస్త్రోవ్‌స్కీ ఈ వీడియోను షేర్ చేశారు. ఇక సరిహద్దు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైనికులను మిలిటెంట్లు బందీగా చేసుకుని వారిని నేలపై లాక్కుంటూ తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అలాగే హసన్ మిలిటెంట్లు జరిపినటువంటి కాల్పుల్లో షార్ హనెగెవ్ రీజినల్ కౌన్సిల్ మేయర్ ఓఫిర్ లిబెస్టీన్ మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్-గాజా సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గాజా స్ట్రిప్‌లో స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ ఆర్మీ వాహనాలు, పారాచ్యూట్లతో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడ్డారు. అలాగే సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఓ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి దాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఓవైపు ఇజ్రాయెల్ సైన్యం, మరోవైపు హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నా. అయితే ఈ దాడుల్లో పలువురు సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడుల్లో 50 మంది ఇజ్రాయెల్ పౌరుల మృతిచెందగా..100 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది . అంతేకాదు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా..1967వ సంవత్సరంలో అరబ్-ఇజ్రాయెల్ దేశాల మధ్య జరిగిన యుద్ధంలో తూర్పు జెరూసలెం, గాజా ప్రాంతాలను ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకుంది. అయితే స్వతంత్ర పాలస్తీనాలో ఆ రెండు ప్రాంతాలూ కూడా అంతర్భాగాలు కావాలనే డిమాండ్‌తో పాలస్తీనా తిరుగుబాటు చేస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..