- Telugu News Photo Gallery Business photos These are the top motorcycles to launch in India in October 2023, check list
Upcoming Two Wheelers: ఈ నెలలో లాంచ్ కానున్న ద్విచక్ర వాహనాలు ఇవే.. జాబితాలో టాప్ బ్రాండ్లు..
సెప్టెంబర్, అక్టోబర్ అనగానే పండుగలు మనకు గుర్తొస్తాయి. దాంతో పాటు కంపెనీలు ప్రకటించే ఆఫర్లు, కొత్త ఉత్పత్తుల లాంచింగ్ లతో సందడిగా ఉంటుంది. ప్రజలు కూడా కొనుగోళ్లు చేయడానికి ఆసక్తి చూపుతారు. అందుకనుగుణంగానే కంపెనీలు తమ ప్రణాళికలు సిద్దం చేసుకుంటాయి. ఈ నెలలో పలు కొత్త బైక్లు, స్కూటర్లు లాంచింగ్ కు రెడీ అయ్యాయి. వాటిల్లో రాయల్ ఎన్ ఫీల్డ్ కు చెందిన రెండు బైక్ లతో పాటు ఏథర్ ఎలక్ట్రిక్ నుంచి స్కూటర్ వంటివి మార్కెట్లోకి రానున్నాయి. వాటి గురించి తెలుసుకుందా రండి..
Madhu | Edited By: Ravi Kiran
Updated on: Oct 06, 2023 | 9:45 PM

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450.. ఈ బైక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే పలు రకాలుగా పరీక్షలు జరిపినప్పుడు దీనికి సంబంధించిన చిత్రాలు ఔత్సాహికులు తీసి ఆన్ లైన్లో పెట్టారు. అలాగే పలు రకాల గ్లింప్స్ లను కూడా కంపెనీ విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ. 2.80 లక్షల (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేటీఎం 390, హీరో ఎక్స్ పల్స్ 400పోటీగా ఇది మార్కెట్లోకి రానుంది. దీనిలో 40బీహెచ్పీ/37ఎన్ఎం రేటింగ్ తో ఇంజిన్ ఉంటుంది.

అప్రిలియా ఆర్ఎస్ 457.. ఇది కూడా మోటోజీపీ ఈవెంట్ కు ముందే ఈ వీకెండ్ లోపు మార్కెట్లోకి రానుంది. దీనిలో ప్యారలల్-ట్విన్ మోటార్, ప్రీమియం హార్డ్‌వేర్ ఉంటుంది. 47బీహెచ్పీ సామర్థ్యంతో ఉంటుంది. దీని ధర రూ. 4.25లక్షల వరకూ ఉంటుందని అంచనా.

ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400ఎక్స్..ట్రయంఫ్ ఈ సంవత్సరం ప్రారంభంలో స్పీడ్ 400ని విడుదల చేసింది. ఇప్పుడు మరో బైక్ స్క్రాంబ్లర్ 400ఎక్స్ ఈ నెలలో విడుదల చేయడానికి కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. ఇది స్పీడ్ 400 కన్నా మెరుగైన పనితీరుతో పాటు అదనపు ఫీచర్లను యాడ్ చేసినట్లు కంపెనీ చెబుతోంది. దీని ధరకూ స్పీడ్ 400 కన్నా రూ. 30,000 అదనంగా ఉండే అవకాశం ఉంది. దీని ధర రూ. రూ. 2.70 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకూ ఉంటుందని చెబుతున్నారు.

కొత్త ఏథర్ 450ఎస్.. ఏథర్ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచింగ్ కు రెడీ గా ఉంది. ఏథర్ 450ఎస్ పేరిట ఈ స్కూటర్ ను తీసుకొచ్చేందుకు ప్రణాళిక చేస్తోంది. దీని రేంజ్ 156 కిలోమీటర్లు ఉంటుందని చెబుతున్నారు. ఈ నెలలోనే ఈ స్కూటర్ అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు చెబుతున్నారు. దీని ధర రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్ బెంగళూరు) ఉంటుంది.

కైనెటిక్ ఇ-లూనా.. ఘనమైన రికార్డు ఉన్న కైనెటిక్ ఈ-లూనా ఈ నెలాఖరుకు మార్కెట్లోకి వస్తుందని చెబుతున్నారు. ఇది గరిష్టంగా గంటకు 50కిమీ వేగంతో ప్రయాణించగలుగుతుంది. రేంజ్ 100కిలోమీటర్లుగా కంపెనీ చెబుతోంది. దీని ధర రూ. 80,000 నుంచి రూ. 90,000 వరకు ఉంటుందని మీరు ఆశించవచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650.. రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ ప్లాట్‌ఫారమ్‌లో ఈ షాట్‌గన్ 650 బైక్ కొత్తగా ఈ నెలలోనే రానుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో ప్రస్తుతం ఇంటర్‌సెప్టర్ 650 , కాంటినెంటల్ జీటీ 650 మరియు సూపర్ మెటోర్ 650 ఉన్నాయి , ఇవన్నీ రెట్రో, లేడ్‌బ్యాక్ మెషీన్‌లు. కానీ షాట్‌గన్ 650 దాని రెట్రో తోబుట్టువుల మధ్య ఒక బ్రాటీ బాబర్‌గా నిలుస్తోంది. దీని ధర రూ. 3.25 లక్షల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.





























