ప్లేయింగ్ కార్డ్స్ తో వరల్డ్ రికార్డ్ సృష్టించిన 15 ఏళ్ల ఇండియా కుర్రాడు!

గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాలని చాలా మంది ప్రయత్నిస్తూంటారు. వారిలో గెలిచిన వారు కొంత మంది అయితే.. విఫలం అయిన వాళ్లు చాలా మంది ఉంటారు. అలా భారత దేశానికి చెందిన ఎంతో మంది గిన్నీస్ వరల్డ్ రికార్డును సృష్టించారు. చిన్న వయసు నుంచి పెద్ద వాళ్ల దాకా ఏంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఇండియాకి చెందిన 15 ఏళ్ల కుర్రాడు కూడా గిన్నీస్ రికార్డు సాధించాడు. అది కూడా ప్లేయింగ్ కార్డ్స్ తో. చాలా మందికి ప్లేయింగ్ కార్డ్స్ గురించి తెలుసు. ప్రత్యేకంగా పరిచయాలు..

ప్లేయింగ్ కార్డ్స్ తో వరల్డ్ రికార్డ్ సృష్టించిన 15 ఏళ్ల ఇండియా కుర్రాడు!
kolkata boy 2
Follow us
Chinni Enni

|

Updated on: Oct 07, 2023 | 2:19 PM

గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాలని చాలా మంది ప్రయత్నిస్తూంటారు. వారిలో గెలిచిన వారు కొంత మంది అయితే.. విఫలం అయిన వాళ్లు చాలా మంది ఉంటారు. అలా భారత దేశానికి చెందిన ఎంతో మంది గిన్నీస్ వరల్డ్ రికార్డును సృష్టించారు. చిన్న వయసు నుంచి పెద్ద వాళ్ల దాకా ఏంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఇండియాకి చెందిన 15 ఏళ్ల కుర్రాడు కూడా గిన్నీస్ రికార్డు సాధించాడు. అది కూడా ప్లేయింగ్ కార్డ్స్ తో. చాలా మందికి ప్లేయింగ్ కార్డ్స్ గురించి తెలుసు. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఖాళీగా ఉన్నప్పుడు కొంత మంది సరదాగా ఆడుతూంటారు. కానీ కొంత మంది మాత్రం జూదంగా ఆడుతూంటారు.

అయితే మనం చిన్నప్పుడు ప్లేయింగ్ కార్డ్స్ తో చిన్నగా బిల్డింగ్స్ కడుతూ ఉంటాం. ఇలా ఎంతో మంది ఆడే ఉంటారు. ఇంట్లో ప్లేయింగ్ కార్డ్స్ ఉంటే వాటితో సరదాగా బిల్డింగులు కడుతూ ఆనందించే వారు. జస్ట్ కొంచెం గాలి వేసినా, ఒక వేలు ఆనించినా మొత్తం పడిపోయేది. ఎందుకంటే అవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఇప్పుడు అలాంటి వాటిని ఉపయోగించి ఈ కుర్రాడు గిన్నీస్ రికార్డు సాధించాడు. ఇంతకీ ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.

వరల్డ్ రికార్డ్ సాధించిన కోల్ కతాకు చెందిన అర్నవ్:

భారత దేశంలోని కోల్ కతాకు చెందిన అర్నవ్ అనే 15 ఏళ్ల కుర్రాడు గిన్నీస్ వరల్డ్ రికార్డును సాధించాడు. కోల్ కతాకు చెందిన నాలుగు రకాల భవన నిర్మాణాలను ప్లేయింగ్ కార్డ్స్ తో తయారు చేశాడు. 41 రోజుల పాటు ఈ భవన నిర్మాణాలను తయారు చేసి.. మొత్తాన్ని వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు. అర్నవ్ రూపొందించి భవనాలు 11 అడుగుల పొడవు, నాలుగు అంగుళా ఎత్తు, 16 అడుగులు, 8 అంగుళాల వెడల్పుతో అతి పెద్ద ప్లేయింగ్ కార్డ్ స్ట్రక్చర్ గా రూపొందించి ప్రపంచ రికార్డును సాధించాడు. బైగాన్ బెర్గ్ సృష్టించిన రికార్డ్ ను బద్దలు కొట్టాడు. రైటర్స్ బిల్డింగ్, షహీద్ మినార్, సాల్ట్ లేక్ స్టేడియం, సెయింట్ పాల్స్ కేథడ్రల్ వంటి ప్రతి రూపాలను నిర్మించడానికి అర్నవ్ 1,43,000 కార్డులను ఉపయోగించాడు.

చాలా ఆనందంగా అనిపించింది: అర్నవ్

అనంతరం బాలుడు అర్నవ్ మాట్లాడుతూ.. వరల్డ్ రికార్డ్ సాధించినందుకు చాలా ఆనందంగా అనిపించింది. నా తల్లిదండ్రులు కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు. కోల్ కతాకు చెందిన నాలుగు ప్రతిరూపాలను ఎంచుకుని చేశాను. మధ్యలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కానీ నేను నిరాశ పడకుండా మళ్లీ చేశానని అర్నవ్ చెప్పాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఆ బాలుడిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.