AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యబాబోయ్‌.. మహిళ మెదడులో 3సెంటీమీటర్ల సూది.. 80 ఏళ్లుగా అలాగే జీవిస్తుంది..?

ఆ వృద్ధురాలి మెదడులో 3 సెంటీమీటర్ల పొడవున్న సూది కనబడింది..దీంతో వైద్యులే షాక్‌ అయ్యారు. దాదాపు 75 నుంచి 80 ఏళ్ల పాటు ఆమె మెదడులో సూది అలాగే ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. 80 ఏళ్ల మహిళ మెదడులోని ప్యారిటల్ లోబ్‌లో సూది గుచ్చుకుంది. ఇన్నేళ్లుగా ఆమె మెదడులో సూది ఉన్నా ఎలాంటి సమస్య రాకపోవడంపై వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సఖాలిన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ అరుదైన సంఘటనను టెలిగ్రామ్ పోస్ట్‌లో ఈ వార్త షేర్ చేసింది.

అయ్యబాబోయ్‌.. మహిళ మెదడులో 3సెంటీమీటర్ల సూది.. 80 ఏళ్లుగా అలాగే జీవిస్తుంది..?
Needle In Brain
Jyothi Gadda
|

Updated on: Oct 07, 2023 | 2:33 PM

Share

ఆయుష్షు బలంగా ఉంటే.. మన అదృష్టం బాగుంటే ఏ సమస్య మనల్ని ఏం చేయదు. ఇంకా భూమ్మీద నూకలుంటే.. చనిపోయే వ్యక్తి కూడా బతికి వస్తాడు. ఆయుష్షు మూడినా, అదే అదృష్టం మన చేతుల్లోంచి జారిపోతే.. తాడే పామై కాటు వేస్తుంది అన్నట్టుగా చిన్న ఇబ్బంది కూడా మన జీవితానికి ప్రాణాంతకం అవుతుంది. ఇందుకు ఉదాహరణలు మన చుట్టూ జరుగుతుంటాయి. ఒక్కోసారి వైద్య ప్రపంచాన్ని సైతం దిగ్భ్రాంతికి గురిచేసే ఆశ్చర్యకరమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక వ్యక్తి చనిపోయినట్లు డాక్టర్ ప్రకటించిన తర్వాత లేచి నిలబడిన ఉదాహరణలు కూడా అనేకం చూస్తున్నాం. రోజురోజుకు కొత్త రోగాలు, కొత్త వాస్తవాలు వైద్యులను మరింత చురుగ్గా మారుస్తున్నాయి. అలాంటి ఒక ఆశ్చర్యకరమైన వాస్తవం మరోకటి వెలుగులోకి వచ్చింది.

ఒక 80 ఏళ్ల వృద్ధురాలు తరచూ తలనొప్పితో బాధపడుతోంది. ఆమెకు తలనొప్పి తప్ప మరే ఇతర ఆరోగ్య సమస్యలు లేవు. విపరీతమైన తలనొప్పి రావడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లింది. వృద్ధురాలి తలను స్కాన్ చేసిన వైద్యుడికి ఆశ్చర్యకర సీన్‌ ఎదురైంది. ఆ వృద్ధురాలి మెదడులో 3 సెంటీమీటర్ల పొడవున్న సూది కనబడింది..దీంతో వైద్యులే షాక్‌ అయ్యారు. దాదాపు 75 నుంచి 80 ఏళ్ల పాటు ఆమె మెదడులో సూది అలాగే ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. 80 ఏళ్ల మహిళ మెదడులోని ప్యారిటల్ లోబ్‌లో సూది గుచ్చుకుంది. ఇన్నేళ్లుగా ఆమె మెదడులో సూది ఉన్నా ఎలాంటి సమస్య రాకపోవడంపై వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సఖాలిన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ అరుదైన సంఘటనను టెలిగ్రామ్ పోస్ట్‌లో ఈ వార్త షేర్ చేసింది.

1930లలో సోవియట్ యూనియన్ కాలంలో అనేక కరువులు వచ్చాయి. మెజారిటీ ప్రజలు పేదరికం సమస్యను ఎదుర్కొన్నారు. పేదరికం సమస్య కారణంగా పిల్లలను చంపే ప్రయత్నం జరిగింది. పిల్లలను చంపడానికి, మెదడులోని మృదువైన భాగంలోకి సూదిని చొప్పించారు. అనగా ఫాంటనెల్. దీంతో ఫాంటనెల్ భాగం మూసుకుపోయి చిన్నారి మృతికి గల కారణాలు తెలియరాలేదు. కరువు కాలంలో తమ పిల్లల ప్రాణాలను తీయడానికి చాలా మంది తల్లిదండ్రులు ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ వృద్ధురాలి తల్లిదండ్రులు కూడా అదే విధంగా హత్య చేసేందుకు ప్రయత్నించి ఉండొచ్చు. అయితే అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాలతో బయటపడిందని వైద్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఆ వృద్ధురాలికి చిన్నప్పటి నుంచి మెదడులో సూది గుచ్చుకున్నా.. ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకపోవడం వైద్యులనే ఆశ్చర్యానికి గురి చేసింది. స్కానింగ్ ద్వారా సూది ఉన్నట్లు గుర్తించిన డాక్టర్ వృద్ధురాలికి ఆపరేషన్ చేసి విజయవంతంగా సూదిని బయటకు తీశారు. సూదిని తొలగించిన తర్వాత వృద్ధురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..