- Telugu News Photo Gallery How to Prepare Banana Hair Masks to Add Volume And Long Lasting Shine to Your Tresses Telugu News
Banana for Hair : బనానా హెయిర్ మాస్క్‌తో అద్భుతం..! అరటిపండులో వీటిని కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుందట..
ప్రస్తుతం ప్రతి పది మందిలో ఏడుగురు జుట్టు సమస్యలతోనే సతమతమవుతున్నారు. జుట్టు రాలడం, జుట్టు నెరిసిపోవటం వంటి సమస్యలతో సతమవుతున్నారు. జీవనశైలి, కాలుష్యం, ఆహారం అలవాట్ల కారణంగా జుట్టు సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. జుట్టు సమస్యలను నయం చేయడానికి అరటిపండు అద్భతంగా పనిచేస్తుందని మీకు తెలుసా..? పట్టులాంటి జుట్టు కోసం అరటిపండుతో హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలి, ఎలా అప్లై చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Oct 07, 2023 | 1:16 PM

అరటిపండులో విటమిన్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రొత్సహిస్తాయి. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టును బలోపేతం చేయడానికి, పొడి బారిన జుట్టు సరి చేయడానికి అరటి పండు హెయిర్ మాస్క్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ బనానా మాస్క్‌ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అరటిపండుతో పాటు కొన్ని పదార్థాలను కలుపుకుని ఈ మాస్క్‌ను తయారుచేస్తారు. దీన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు పొడిబారడం తగ్గించి జుట్టు మూలాలను బలపరుస్తుంది.

గుడ్లు- అరటిపండు: ఒక గిన్నెలో 1 పండిన అరటిపండు, 2 గుడ్లు, 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్ 1 టీస్పూన్ తేనె కలపండి. బ్లెండర్ ఉపయోగించి వాటిని బాగా కలపండి. చక్కటి పేస్ట్ సిద్ధమవుతుంది. ఈ మిశ్రమాన్ని మీ జుట్టును శుభ్రం చేసి ఆరబెట్టిన తర్వాత ఈ హెయిర్ మాస్క్‌ను సమానంగా అప్లై చేయండి. షవర్ క్యాప్ తప్పక ధరించాలి. ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూతో కడిగేయాలి. దీంతో మీ జుట్టు స్ట్రాంగ్ గా, సాఫ్ట్ గా మారుతుంది.

ఆలివ్ నూనె- అరటిపండు: ఈ హెయిర్ మాస్క్‌ను సిద్ధం చేయడానికి మీరు ఒక గిన్నెలో 1 పండిన అరటిపండు 1/2 పండిన అవకాడోను కలిపి మెత్తగా చేయాలి. తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేయాలి. చక్కగా కలపండి. ముందుగా తలను శుభ్రంగా కడిగి ఆరబెట్టిన జుట్టుకు ఈ హెయిర్ ప్యాక్‌ని అప్లై చేయాలి. షవర్ క్యాప్‌తో కప్పి, మాస్క్‌ను 30 నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత, తేలికపాటి షాంపూ, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇది మీ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. సరైన పోషకాలను అందించి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.

అరటి, కొబ్బరి నూనె హెయిర్ మాస్క్: దీన్ని సిద్ధం చేయడానికి, ఒక గిన్నెలో 1 పండిన అరటిపండును మెత్తగా చేసి, ఆపై 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు కలపండి. ఈ మాస్క్‌ను అప్లై చేసి తలకు హెయిర్ షవర్ క్యాప్ తప్పక ధరించాలి. ప్యాక్ పూర్తిగా ఆరిన తర్వాత సుమారు 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. ఈ హెయిర్ మాస్క్ అన్ని రకాల జుట్టుకు ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్‌లు మీ హెయిర్ షాఫ్ట్‌లలోకి లోతుగా చొచ్చుకుపోతాయి. వాటికి పోషణను అందిస్తాయి. ఫలితంగా అదనపు వాల్యూమ్‌లో ఉంటుంది. ఈ మాస్క్ మీ జుట్టుకు తేమను, దీర్ఘకాలిక మెరుపును కూడా అందిస్తుంది.

పెరుగు- అరటిపండు: ఈ హెయిర్ మాస్క్ తయారు చేయటానికి కావాల్సినవి..అరటిపండు, పెరుగు.. ఈ రెండూ ఇంట్లోనే ఈజీగా దొరుకుతాయి. దీని కోసం ముందుగా అరటిపండు పేస్ట్‌లో పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. చక్కటి హెయిర్ మాస్క్ మిశ్రమం తయారవుతుంది. సిద్ధం చేసుకున్న పేస్ట్‌ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేయండి. సుమారు 30నిమిషాల పాటు అలాగే వదిలేసి, ఆ తర్వాత తేలిక పాటి షాంపూతో శుభ్రంగా కడిగేయాలి. దీంతో మీ జుట్టు బలంగా, ఒత్తుగా మారుతుంది.




























