మాకొద్దు బాబోయ్ ఈ పోలీస్ స్టేషన్ ..! పోస్టింగ్‌ అంటే ఇష్టమే గానీ,.. అక్కడికి వెళ్లాలంటేనే..?!

Hyderabad: అదనంగా ఆ ఏరియాలో వ్యాపారాలు కూడా ఎక్కువగానే ఉండటంతో మామూళ్లు కూడా ఎక్కువగానే దన్నుకోవచ్చు అనే ధోరణిలో ఉన్న ఇన్ స్పెక్టర్లు మాత్రం బంజారాహిల్స్ పోస్టింగ్ కోసం ఎన్నో పైరవీలు చేసుకుంటున్నారు.. ఇక మరి కొంతమంది పోలీస్ ఇన్‌ స్పెక్టర్లు మాత్రం బంజారాహిల్స్ తప్ప ఎక్కడ ఇచ్చినా తమకు ఓకే అంటూ లెటర్ లతో కాక పడుతున్నారు. మాకు లూప్ లైన్ పోస్టింగ్ అయిన ఇవ్వండి.. కానీ బంజారాహిల్స్ మాకొద్దు బాబోయ్‌, ఆ తలనొప్పి మాకెందుకంటూ మరికొంత మంది వాపోతున్నారు..

మాకొద్దు బాబోయ్ ఈ పోలీస్ స్టేషన్ ..! పోస్టింగ్‌ అంటే ఇష్టమే గానీ,.. అక్కడికి వెళ్లాలంటేనే..?!
Banjara Hills Police Statio
Follow us
Vijay Saatha

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 07, 2023 | 2:21 PM

హైదరాబాద్, అక్టోబర్07; హైదరాబాద్ సిటీలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు ఉన్న క్రేజే వేరు. ఒకప్పుడు బంజారాహిల్స్ పోస్టింగ్ అంటేనే సిటీలోనే కాదు రాష్ట్రంలోనే నంబర్ వన్ పోలీస్ స్టేషన్ గా ఉండేది. అలాంటి పోలీస్ స్టేషన్ లో ఇన్ స్పెక్టర్ గా పోస్టింగ్ అంటేనే రాష్ట్రస్థాయిలో ఆ అధికారులకు ఉండే డిమాండ్ వేరు.. అలాంటి హాట్ కేక్ లాంటి పోలీస్ స్టేషన్ కు గత కొన్ని సంవత్సరాల నుండి నిత్య వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి.. అసలే వెస్ట్ జోన్ ఆపై వీఐపీ ఏరియా వందల కొద్ది పబ్బులు మసాజ్ సెంటర్ లు … అన్ని ఉండేది ఇక్కడే. ఒకానొక సందర్భంలో ఇక్కడి ఇన్ స్పెక్టర్ నెలసరి ఆదాయం రూ. 10 లక్షలు పైబడే ఉండేది .. అలాంటి పోలీస్ స్టేషన్ కు ఇప్పుడు ఇన్ స్పెక్టర్ గా వెళ్లాలంటేనే పోలీసులు జంకుతున్నారు .. కారణం ఏదైనా కానీ, ఇక్కడ తప్ప ఎక్కడైనా ఇవ్వండి..అని కొందరు అంటుంటే , వివాదాలు ఉన్నా సరే ఇక్కడే కావాలి.. అని మరికొందరు పైరవీ చేసుకుంటున్నారు…

నిత్య వివాదాల్లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్..

బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ అంటేనే రాష్ట్రంలో ఉన్న ఉన్నతాధికారులు అందరి చూపు ఇక్కడే ఉంటుంది. దీంతో సాధారణంగానే ఈ పోలీస్ స్టేషన్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్లకు అంతగా అచ్చు రావడం లేదు..పబ్బులు, స్పా, మసాజ్ సెంటర్ ల నుండి మామూళ్లు వసూలు చేస్తూ పట్టుబడుతున్నారు పలువురు పోలీసులు…ఇక్కడ గతంలో పని చేసిన పలువురు పోలీసుల పైనా చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి..కొంత మంది అడ్డంగా ఏసీబీ కి దొరుకుతుంటే, మరి కొంత మంది మాత్రం మాముళ్లు తీసుకుంటూ కూడా వేధింపులకు గురి చేస్తున్నారు..ఇంకొందరు రియల్ ఎస్టేట్ వివాదాల్లో తలదూర్చి సెటిల్ చేస్తున్నారు..గతం లో వ్యాపారవేత్త జయరాం హత్య కేసు సందర్భంలో అప్పటి ఇన్ స్పెక్టర్ పైన ఆరోపణలు రావటంతో విఐపి జోన్ లో ఉన్న ఇద్దరు  ఇన్ స్పెక్టర్లను   అప్పటి ఉన్నతాధికారులు అటాచ్ చేశారు. ఇదే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇన్ స్పెక్టర్ పే సిపి కార్యాలయానికి అటాచ్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత వచ్చిన మరో ఇన్ స్పెక్టర్ పబ్బుల వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాలని ఆరోపణలతో అప్పటి ఇన్ స్పెక్టర్ శివ చంద్ర ను విధుల నుండి తొలగించారు. ఆ తర్వాత వచ్చిన ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావు బంజారాహిల్స్ నుండి బదిలీ కాగానే ఏకంగా సర్వీస్ నుండి రిమూవ్ అయిపోయాడు. ఇక తాజాగా సిఐ నరేందర్ వ్యవహారం అనేక వివాదాలకు తావిస్తుంది. ఒక పబ్బు ఓనర్ ను మామూళ్లు అడగడం తో పాటు వేధింపులకు గురి చేసిన ఆరోపణలపై సీఐ నరేందర్ తో పాటు ముగ్గురు బంజారాహిల్స్ పోలీస్ సిబ్బందిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.

ఇక్కడ పోస్టింగ్ అంటే మామూలు కాదండోయ్..

ఎంత సిన్సియర్ గా ఉన్న అధికారి అయినా బంజారాహిల్స్ కు వచ్చాడంటే చాలు ఎదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంటుంది. ఒకవైపు రాజకీయ ఒత్తిడి, మరోవైపు వీ ఐ పి జోన్ క్రైమ్ ఇలా తలకు మించిన భారంగా బంజారాహిల్స్ మరి పోయింది… అదనంగా ఆ ఏరియాలో వ్యాపారాలు కూడా ఎక్కువగానే ఉండటంతో మామూళ్లు కూడా ఎక్కువగానే దన్నుకోవచ్చు అనే ధోరణిలో ఉన్న ఇన్ స్పెక్టర్లు మాత్రం బంజారాహిల్స్ పోస్టింగ్ కోసం ఎన్నో పైరవీలు చేసుకుంటున్నారు.. ఇక మరి కొంతమంది పోలీస్ ఇన్‌ స్పెక్టర్లు మాత్రం బంజారాహిల్స్ తప్ప ఎక్కడ ఇచ్చినా తమకు ఓకే అంటూ లెటర్ లతో కాక పడుతున్నారు. మాకు లూప్ లైన్ పోస్టింగ్ అయిన ఇవ్వండి.. కానీ బంజారాహిల్స్ మాకొద్దు బాబోయ్‌, ఆ తలనొప్పి మాకెందుకంటూ మరికొంత మంది వాపోతున్నారు..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..