Air India: ఎయిర్‌ ఇండియా ఫ్లైట్స్‌ కొత్త డిజైన్‌ చూశారా..? సోషల్ మీడియాలో ఫస్ట్‌ లుక్ అదుర్స్‌..!

టాటా గ్రూప్ కొనుగోలు చేసిన ఎయిర్ ఇండియా కొత్త డిజైన్, లోగో తో కొత్త ఎంట్రీకి సిద్ధమవుతోంది. ఎయిర్ ఇండియా తన కొత్త A350 విమానం ఫస్ట్‌ లుక్‌ని సోషల్‌ మీడియా X ద్వారా విడుదల చేసింది ఎయిర్ ఇండియా. కొత్త విమానాలకు పెయింట్ వర్క్ కూడా పూర్తయిందని, కొత్తగా పెయింట్ చేసిన విమానాలు అతి త్వరలోనే భారత్‌కు వస్తాయని ఎయిర్‌లైన్స్ తెలిపింది. ప్రస్తుతం ఇవి వైరల్‌ అవుతున్నాయి.

Jyothi Gadda

|

Updated on: Oct 07, 2023 | 12:48 PM

ఫ్రాన్స్‌ లోని టౌలోసీ వర్క్‌షాప్‌లో కొత్త లోగో, సరికొత్త డిజైన్‌తో రూపుదిద్దుకుంటున్న ఏ350 విమానం ఫొటోలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి.  ఎయిర్‌లైన్ ఈ సంవత్సరం ప్రారంభంలో కొత్త ఎరుపు - వంకాయ - బంగారు రంగులతో కొత్త లోగో 'ది విస్టా'తో రీబ్రాండ్ చేయబడింది.

1 / 5
ఎయిర్‌ ఇండియాలో పాత విమానాలన్నింటినీ రీఫర్బిష్ చేసేందుకు భారీగా ఖర్చు పెడుతోంది కంపెనీ. దాదాపు 400 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది.  గ్రౌండ్ లెవెల్ నుంచి పైస్థాయి వరకూ అన్ని డిపార్ట్‌మెంట్‌లలోనూ సంస్కరణలు చేపట్టాలన్నదే సంస్థ లక్ష్యంగా పేర్కొంది.  దాని కొత్త లోగో, ది విస్టా, గోల్డెన్ విండో ఫ్రేమ్ పీక్‌తో పూర్తిగా కొత్త లుక్‌తో ప్రయాణికులను ఆకట్టుకోనుంది.

2 / 5
ఈ మార్పు కొత్త బ్రాండ్ ఎయిర్ ఇండియాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిథులకు సేవలందించే ప్రపంచ స్థాయి ఎయిర్‌లైన్‌గా మార్చాలన్నదే తమ లక్ష్యంగా ఎయిర్‌ ఇండియా ప్రకటించింది.  ప్రపంచ వేదికపై కొత్త ఎయిర్‌ ఇండియా భారతదేశానికి గర్వంగా నిలబెట్టాలన్నదే తమ ఆశయం అని ఎయిర్ ఇండియా గతంలోనే ప్రకటించింది.

3 / 5
 
2025 నాటికి అన్ని ఎయిర్ ఇండియా విమానాలు కొత్త లోగోతో ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఎయిర్‌ ఇండియా స్పష్టం చేసింది.  ఎయిర్ ఇండియా ఎయిర్‌బస్, బోయింగ్‌లతో బహుళ-బిలియన్ డాలర్ల విమాన ఒప్పందాలపై సంతకం చేసిన కొన్ని నెలల తర్వాత ఆగస్టులో కొత్త లోగోను ప్రకటించింది ఎయిర్‌ ఇండియా.

4 / 5
హెరిటేజ్‌తో పూర్తిగా రూపాంతరం చెందేందుకు ఎయిర్‌లైన్స్ ప్రయత్నిస్తోందని ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులు తెలిపారు. కొత్త లైవరీ, డిజైన్‌లో ముదురు ఎరుపు, వంకాయ, బంగారు రంగుల హైలైట్‌లు,  వీల్-ప్రేరేపిత నమూనాతో కూడిన ప్యాలెట్ ఉన్నాయి.

5 / 5
Follow us