Telangana Elections: 6 గ్యారంటీలు సరిపోవు.. హామీల డోస్ పెంచే పనిలో తెలంగాణ కాంగ్రెస్..!

Telangana Elections: తెలంగాణ కాంగ్రెస్ తన ఆస్త్రాలుగా చెప్పుకుంటున్న ఆరు గ్యారంటీ స్కీమ్స్ పై జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ ప్రజలు 6 కి ఫిక్స్ అయితే.. అధికారం ఫిక్స్ అయినట్టేనా? ఆరు పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం ఎంటి? కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల స్కీమ్స్ తెలంగాణ ప్రజలు నమ్ముతారా? ఆరు గ్యారంటీ స్కీమ్స్ అమలు చేయడం తెలంగాణలో సాధ్యం అవుతుందా?

Telangana Elections: 6 గ్యారంటీలు సరిపోవు.. హామీల డోస్ పెంచే పనిలో తెలంగాణ కాంగ్రెస్..!
Congress Party
Follow us
TV9 Telugu

| Edited By: Shiva Prajapati

Updated on: Oct 07, 2023 | 1:53 PM

Telangana Elections: తెలంగాణ కాంగ్రెస్ తన ఆస్త్రాలుగా చెప్పుకుంటున్న ఆరు గ్యారంటీ స్కీమ్స్ పై జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ ప్రజలు 6 కి ఫిక్స్ అయితే.. అధికారం ఫిక్స్ అయినట్టేనా? ఆరు పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం ఎంటి? కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల స్కీమ్స్ తెలంగాణ ప్రజలు నమ్ముతారా? ఆరు గ్యారంటీ స్కీమ్స్ అమలు చేయడం తెలంగాణలో సాధ్యం అవుతుందా?

తెలంగాణ కాంగ్రెస్‌లో తుక్కుగూడ సభతో కొత్త జోష్ వచ్చింది.. సభలో సోనియా, రాహుల్ గాంధీలు ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్స్‌తో జనాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇక రాబోయే ఎన్నికల్లో అధికారం తమదేనని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్స్ ఎంత వరకు వర్కౌట్ అవుతాయని చర్చ జరుగుతుంది. దీనిపై ఇటు బీజేపీ, బీఆరెస్ లు సైతం కాంగ్రెస్ సాధ్యం కాని హామీలు ఇచ్చిందని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శిస్తున్నారు. కాని కాంగ్రెస్ మాత్రం తాము అధికారంలోకి రాగానే మొదటి క్యాబినెట్‌లోనే గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్స్‌లో మహలక్ష్మి ద్వారా మహిళలకు ప్రతినెలా రూ. 2,500 పంపిణి, రూ. 500 కే వంట గ్యాస్ సిలిండర్.. అర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నారు. రైతు భరోసా ద్వారా ప్రతిఏటా రైతులు, కౌలు రైతులకు రూ. 15,000 బ్యాంక్ అకౌంట్‌లోకి, వ్యవసాయ కూలీలకు రూ. 12,000 పంపీణి.. వరిపంటకు రూ. 500 బోనస్ ఇవ్వాలని ప్రకటించింది. గృహజ్యోతి స్కీమ్ ద్వార ప్రతి కటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలని.. ఇల్లులేని వారికి ఇంటి స్థంలంతో కలిపి రూ. 5 లక్షలతో ఇంటి నిర్మాణం. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. యువ వికాసం స్కీమ్ ద్వార విద్యార్ధులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు. చేయూత స్కీమ్ పథకం ద్వారా వృద్ధులకు, వికాలంగులకు, ఒంటరి మహిళలకు, రూ. 4,000 నెలవారీ పింఛను. రూ. 10 లక్షల రాజీవ్ అరోగ్యభీమా అందించాలని కాంగ్రెస్ పార్టీ తన ఆరు ఆస్త్రాలుగా చెప్పుకుంటుంది.

అయితే వీటిని ఎక్కడి నుండి అమలు చేస్తారని బీఆరెస్ చెబుతున్న వాటికి.. కర్ణాటక, రాజస్థాన్, ఛత్తిస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలు ఉదాహరణగా.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్స్‌లో 200 యూనిట్లలో ఉచిత విద్యుత్, రూ. 500 లకే గ్యాస్‌ని కర్ణాటక, రాజస్థాన్‌లో అమలు చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, మహాలక్ష్మి ద్వారా రూ. 2,500, కర్ణాటకలో, వరికి క్వింటాల్‌కి రూ. 500 బోనస్ ఛత్తిస్‌ఘడ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అందిస్తున్నాయి. అక్కడ తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే అన్ని గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తున్నామని, తెలంగాణలో కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక ఇప్పటికే ఇక్కడ రైతుబంధు కొనసాగుతుంది దానిని మరో 5 వేలు పెంచాల్సి ఉంటుంది. తెలంగాణలో పెన్షన్ రూ. 3 వేలు ఇస్తున్నారు. దానిని మరో వెయ్యి రూపాయలు అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇవి ఇష్టారితిన ఇచ్చిన హామీలు కాదని దీనిపైన ఆర్థిక నిపుణులు అధ్యయనం చేసిన తరువాతనే వీటిని ప్రకటించిందని తెలంగాణ నేతలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే ఇప్పడున్న పథకాలకు తోడు కాంగ్రెస్ తీసుకొచ్చే కొత్త పథకాలకు పెద్ద బడ్జెట్ ప్రభావం ఉండదని..ఇప్పటికే కాళేశ్వరం ,పాలమూరు లాంటి పథకాలు పూర్తావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం లో పెద్ద ప్రాజెక్టులు ఏమి ఉండకపోవడం కలిసి వచ్చే అంశం. రాష్ట్రంలో పెరుగుతున్న ఆదాయంతొ కొత్త పథకాలకు ఇబ్బందలు ఉండవని భావిస్తున్నారు. అయితే ఈ ఆరు గ్యారంటీ స్కీమ్స్ ని జనాల దగ్గరకు తీసుకుపోవడానికి కాంగ్రెస్ వ్యూహత్మకంగా డోర్ టూ డోర్ ప్రచారాన్ని చేస్తుండడం.. తాము అధికారంలో ఉన్నా రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేస్తున్నామని జనాలను కాంగ్రెస్ మెప్పించే ప్రయత్నం చేస్తుంది. కాని కాంగ్రెస్ తమ ఆస్త్రాలుగా భావిస్తున్న ఆరు గ్యారంటీ స్కీమ్స్ ఎంత వరకు విజయతిరాలకు చెరుస్తుందో చూడాలి మరి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..