Earthquake : అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం..30 నిమిషాల్లోనే మూడు సార్లు..! తీవ్రత 6.2గా నమోదు

అస్గాబట్‌ నగరానికి ఆగ్నేయంగా 428 కిలో మీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 34 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ పేర్కొంది.. ఒక్కసారిగా భూమి కంపించటంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని వణికిపోయారు. భయంతో ఇంట్లోంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే ప్రాణనష్టం, ఆస్తి నష్టంపై ..

Earthquake : అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం..30 నిమిషాల్లోనే మూడు సార్లు..!  తీవ్రత 6.2గా నమోదు
Earthquake
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 07, 2023 | 1:46 PM

Earthquake : అఫ్టానిస్థాన్‌లో వరుస భూ కంపాలు బెంబేలెత్తిస్తున్నాయి. 30 నిమిషాల వ్యవధిలోనే మూడు సార్లు భూమి కంపించింది. వరుస భూ ప్రకంపనలతో ప్రజలు వణికిపోయారు. అఫ్ఘానిస్థాన్‌లో శనివారం మధ్యాహ్నం భారీ భూకంపం చోటుచేసుకుంది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.2 గా నమోదైంది. ఈ మేరకు అక్కడి మీడియా వర్గాలు తెలిపిన వివరాల మేరకు.. ఇవాళ మధ్యాహ్నం 12:42 గంటల సమయంలో తుర్క్‌మెనిస్థాన్‌లోని అస్గాబట్‌ నగరానికి సమీపంలో ఈ భూకంపం సభవించింది. అస్గాబట్‌ నగరానికి ఆగ్నేయంగా 428 కిలో మీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 34 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ పేర్కొంది.. ఒక్కసారిగా భూమి కంపించటంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని వణికిపోయారు. భయంతో ఇంట్లోంచి బయటకు పరుగులు పెట్టారు. భూకంపం సంభవించినప్పుడు అక్కడి నివాసితులు, దుకాణదారులు భవనాల నుండి పారిపోయారు. అయితే ప్రాణనష్టం గానీ, ఎలాంటి ఆస్తి నష్టం గానీ జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

గత సంవత్సరం జూన్‌లో, 5.9 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 1,000 మందికి పైగా మరణించారు. పదివేల మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు పావు శతాబ్దంలో ఆఫ్ఘనిస్తాన్‌లో అత్యంత ఘోరమైన భూకంపం విధ్వంసం సృష్టించింది.

ఆఫ్ఘనిస్తాన్ తరచుగా భూకంపాలకు గురవుతుంది, ముఖ్యంగా హిందూ కుష్ పర్వత శ్రేణులలో, ఇది యురేషియన్, భారతీయ టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ సమీపంలో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..