రెస్టారెంట్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ పార్టీ.. లక్షల బిల్లు కట్టకుండా పారిపోయిన వధూవరులు.. బోరుమన్న యజమాని

బిల్లు కట్టకుండా భార్యాభర్తలు పారిపోయారని రెస్టారెంట్‌ యజమాని ఆరోపించారు. దంపతులు 2800 పౌండ్లు డిపాజిట్ చేశారని, అయితే వారు పార్టీ ప్రారంభానికి ముందే ఈ మొత్తాన్ని డిపాజిట్ చేశారని ఆయన చెప్పారు. అయితే బిల్లు కాస్త ఎక్కువగానే ఉంది. అతిథులంతా తిని, తాగిన తర్వాత, బిల్లు తీసుకునేందుకు అక్కడికి వెళ్లినట్లు ఫాబ్రిజీ తెలిపారు. అయితే భార్యాభర్తలతోపాటు అతిథులంతా బిల్లు కట్టకుండా పారిపోవడం చూసి అవాక్కయ్యారు.

రెస్టారెంట్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ పార్టీ.. లక్షల బిల్లు కట్టకుండా పారిపోయిన వధూవరులు.. బోరుమన్న యజమాని
Bride Groom
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 07, 2023 | 3:07 PM

ప్రతి జంట తమ పెళ్లి, రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించుకోవాలని కలలు కంటారు. ఎంతో అందంగా, వైభవంగా, చక్కగా అలంకరించిన కళ్యాణ మండపంలో అంగరంగా వైభవంగా వారి వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటారు. పెళ్లికి వచ్చిన వారంతా తమను వివాహ ఏర్పాట్లను మెచ్చుకోవాలని, ఆశ్చర్యపోయేలా ఉండాలని భావిస్తారు..అయితే, కళ్యాణమండపం ఎంత పె ద్దదిగా, విలాసవంతంగా ఉంటే అంత ఖర్చు అవుతుంది. అయితే ఖర్చు ఏమైనప్పటికీ పూర్తిగా చెల్లించటమే ముఖ్యం. కానీ, ఇటలీ లో జరిగిన ఓ పెళ్లికి సంబంధించిన ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక జంట తమ అతిథుల కోసం గ్రాండ్ రెస్టారెంట్‌లో రిసెప్షన్ పార్టీని ఏర్పాటు చేశారు.. కానీ, రెస్టారెంట్‌ బిల్లు విషయంలోనే యజమానికి చుక్కలు చూపించారు ఆ నూతన వధూవరులు.

వైభవంగా పెళ్లి చేసుకున్న ఆ కొత్త జంట.. రెస్టారెంట్‌ బిల్లు కట్టకుండానే దంపతులు పారిపోయారని రెస్టారెంట్ యజమాని ఆరోపించాడు. ఈ నష్టం చాలా పెద్దదని, దీంతో తాను దివాలా తీయాల్సి వచ్చిందని చెప్పాడు.. నిజానికి, ఫ్రోసినోన్ ప్రావిన్స్‌లోని లా రోటోండా సీఫుడ్ రెస్టారెంట్‌లో 40 ఏళ్ల మోరెనో ప్రియాటి, అతని భార్య ఆండ్రీ స్వెంజా తమ పెళ్లికి వచ్చిన అతిథులకు రిసెప్షన్ పార్టీ ఇచ్చారు. తమ 80 మంది అతిథుల భోజన ఖర్చులకు సంబంధించిన మొత్తం బిల్లును తామే చెల్లించామని దంపతులు చెబుతున్నారు. అయితే ఒక్కో వ్యక్తికి రూ. 8,000 (£78) చొప్పున, బిల్లు రూ. 8 లక్షలకు (£8,000) వచ్చిందని, దానిని దంపతులు చెల్లించలేదని రెస్టారెంట్ యజమాని ఎంజో ఫాబ్రిజీ తెలిపారు. బిల్లు కట్టకుండా దంపతులు పారిపోయారని అతడు బోరుమంటున్నాడు.

బిల్లు కట్టకుండా భార్యాభర్తలు పారిపోయారని రెస్టారెంట్‌ యజమాని ఆరోపించారు. దంపతులు 2800 పౌండ్లు డిపాజిట్ చేశారని, అయితే వారు పార్టీ ప్రారంభానికి ముందే ఈ మొత్తాన్ని డిపాజిట్ చేశారని ఆయన చెప్పారు. అయితే బిల్లు కాస్త ఎక్కువగానే ఉంది. అతిథులంతా తిని, తాగిన తర్వాత, బిల్లు తీసుకునేందుకు అక్కడికి వెళ్లినట్లు ఫాబ్రిజీ తెలిపారు. అయితే భార్యాభర్తలతోపాటు అతిథులంతా బిల్లు కట్టకుండా పారిపోవడం చూసి అవాక్కయ్యారు.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన తర్వాత, జంటను అరెస్టు చేయడానికి జర్మన్, ఇటాలియన్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. ప్రయారిటీ ప్రకారం పూర్తి చెల్లింపులు జరిపినట్లు సమాచారం. కాగా ఫాబ్రిజీ తనకు ఇంకా డబ్బులు అందలేదని చెప్పారు. అందుకే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోనని చెప్పాడు. వారికి డబ్బులు వచ్చే వరకు కేసు కొనసాగుతుందన్నాడు. చాలా మందికి చెల్లింపులు చేయాల్సి రావడంతో దివాళా తీసే అవకాశం ఉందని, ఇప్పటి వరకు చేయలేదన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..