P-20 summit: జీ20 ఫీవర్ తగ్గింది. ఇప్పుడు పీ20 ఫీవర్ మొదలైంది. ఇంతకీ ఏంటీ పీ20?

అక్టోబర్ 13న పి-20 సమావేశాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. పేరుకు పీ-20 అని ఉన్నప్పటికీ ఇందులో 30 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. G-20లోని 20 సభ్య దేశాలతో పాటు, 10 ఇతర దేశాలు (ప్రత్యేక ఆహ్వానిత దేశాలు), అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు P20 సమ్మిట్‌లో పాల్గొంటారు.

P-20 summit: జీ20 ఫీవర్ తగ్గింది. ఇప్పుడు పీ20 ఫీవర్ మొదలైంది. ఇంతకీ ఏంటీ పీ20?
Prime Minister Modi
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 07, 2023 | 12:58 PM

భారతదేశ కీర్తిప్రతిష్టలను మరింత పెంచిన జీ20 శిఖరాగ్ర సమావేశాలు అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘భారత మండపం’ పేరుతో సరికొత్తగా నిర్మించిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఈ సమావేశాలు ఆధునిక భారతదేశ శక్తి, సామర్థ్యాలకు ప్రతీకగా నిలిచాయి. ‘వసుధైవ కుటుంబకం’ ఇతివృత్తంతో సర్వమానవాళి సంక్షేమం, సమానత్వాన్ని సూచిస్తూ భారత్ అనేక కీలక సూచనలు చేసింది. ఈ చర్చ ఇంకా సద్దుమణగక ముందే మరో వారం రోజుల్లో పీ20 సమావేశాలకు భారత్ వేదిక కానుంది. జీ20 అంటే ప్రపంచంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న 19 దేశాలు, 1 యురోపియన్‌ యూనియన్‌తో కూడిన కూటమి అని మనందరికీ తెలుసు. భారత అధ్యక్షత జరిగిన శిఖరాగ్ర సదస్సులో ఆఫ్రికన్ యూనియన్‌కు సభ్యత్వాన్ని కల్పించడం ద్వారా జీ20 ని జీ21గా విస్తరించారు. శిఖరాగ్ర సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్‌లో ప్రపంచం ముందున్న సవాళ్లు, వాటిని ఎదుర్కొనే మార్గాలతో పాటు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. జీ20 సమావేశాల్లో భాగంగా వై20 పేరుతో యువతకు సంబంధించిన అంశాలపై సదస్సు జరిగింది. ఇప్పుడు పీ20 పేరుతో ఆయా దేశాల పార్లమెంటరీ వ్యవస్థలను ఒక వేదికపైకి తీసుకొచ్చి సంబంధిత అంశాలపై చర్చించకోవడం కోసం సిద్ధమవుతోంది.

అక్టోబర్ 13న పీ-20 సమావేశాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. పేరుకు పీ-20 అని ఉన్నప్పటికీ ఇందులో 30 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. G-20లోని 20 సభ్య దేశాలతో పాటు, 10 ఇతర దేశాలు (ప్రత్యేక ఆహ్వానిత దేశాలు), అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు P20 సమ్మిట్‌లో పాల్గొంటారు. తొలిసారిగా భారత్‌లో జరుగుతున్న ఈ పీ-20 కార్యక్రమంలో ఆఫ్రికన్ పార్లమెంట్ అధ్యక్షుడు కూడా పాల్గొననున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశానికి మరో కొత్త అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ సిద్ధమైంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ద్వారకలో ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్‌ను ‘యశోభూమి’ పేరుతో ఈ మధ్యనే ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఆ ‘యశోభూమి’ పీ20 సదస్సుకు వేదికగా మారింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ‘యశోభూమి’ని సందర్శించి, సన్నాహాలను సమీక్షించారు. ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన P-20 శిఖరాగ్ర సమావేశాల్లో ఇది తొమ్మిదవది.

P20 కాన్ఫరెన్స్ థీమ్ కూడా జీ20 థీమ్ మాదిరిగానే ఉన్నప్పటికీ ఇందులో స్వల్ప తేడా ఉంది. ‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు కోసం పార్లమెంటు’ అన్న థీమ్‌తో పీ20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. భారత పార్లమెంటులోని లోక్‌సభ స్పీకర్ ఇచ్చిన సమాచారం ప్రకారం, 26 దేశాల చట్టసభల స్పీకర్‌లు, 10 మంది డిప్యూటీ స్పీకర్‌లు, 01 కమిటీ చైర్మన్‌తో పాటు 50 మంది పార్లమెంటు సభ్యులు, మరో 14 మంది ప్రధాన కార్యదర్శులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.

భారత్-కెనడా దేశాల మధ్య సంబంధాలు కాస్త దెబ్బతిన్నప్పటికీ ఈ సదస్సులో కెనడా పార్లమెంట్ స్పీకర్ కూడా పాల్గొంటున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, ఈ సదస్సు ద్వారా భారతదేశం సంక్లిష్టమైన ప్రపంచ సమస్యలకు ఏకాభిప్రాయ ఆధారిత పరిష్కారాలను చూపెడుతుందని అన్నారు. అలాగే అందరినీ కలుపుకొనిపోతూ, శాంతియుత, సమానత్వం కల్గిన ప్రపంచం దిశగా అడుగులు పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పీ-20 సదస్సు సందర్భంగా నాలుగు అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు ఓం బిర్లా తెలిపారు.

ఆ నాలుగు సెషన్లు ఏంటంటే…

  1.  సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కోసం ఎజెండా 2030: విజయాలను ప్రదర్శించడం, పురోగతిని వేగవంతం చేయడం
  2. సస్టైనబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్: గ్రీన్ ఫ్యూచర్‌కి గేట్‌వే
  3. లింగ సమానత్వం: మహిళా సాధికారత – మహిళల నేతృత్వంలోని అభివృద్ధి
  4. పబ్లిక్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రజల జీవితాలను మార్చడం.

వీటిపై చర్చించడంతో పాటు జీ-20 తరహాలోనే పీ-20 సదస్సులో ఉమ్మడి ప్రకటన కూడా తీసుకురానున్నారు. దీని ద్వారా ప్రపంచ దేశాలన్నింటికీ సమానత్వం, సౌభ్రాతృత్వం, ఐక్యత సందేశాన్ని అందించే ప్రయత్నం చేయనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
చేతికి కట్టుతోనే కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్.. ఫ్యాన్స్ ఫిదా
చేతికి కట్టుతోనే కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్.. ఫ్యాన్స్ ఫిదా
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..
సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..
ముంబైతో పోరుకు లక్నో రెడీ.. రోహిత్‌పైనే చూపులన్నీ..
ముంబైతో పోరుకు లక్నో రెడీ.. రోహిత్‌పైనే చూపులన్నీ..
తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ 2024 ప్రవేశాలు
తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ 2024 ప్రవేశాలు