Telangana: స్కూల్ విద్యార్థులకు అలర్ట్.. దసరా సెలవుల్లో మార్పు.. వివరాలివే..

దసరా సెలవుల విషయంలో కీలక అప్‌డేట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దసరా సెలవును ప్రభుత్వం అక్టోబర్ 23వ తేదికి మార్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారిక ప్రకటన విడుదల చేశారు. అంతేకాదు.. 24వ తేదీని కూడా సెలవుదినంగానే ప్రకటించారు. ఈ విషయాన్ని అధికారిక ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాదికి సంబంధించి సెలవుల విషయంలో..

Telangana: స్కూల్ విద్యార్థులకు అలర్ట్.. దసరా సెలవుల్లో మార్పు.. వివరాలివే..
Holidays
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Oct 07, 2023 | 9:30 PM

హైదరాబాద్, అక్టోబర్ 7: దసరా సెలవుల విషయంలో కీలక అప్‌డేట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దసరా సెలవును ప్రభుత్వం అక్టోబర్ 23వ తేదికి మార్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారిక ప్రకటన విడుదల చేశారు. అంతేకాదు.. 24వ తేదీని కూడా సెలవుదినంగానే ప్రకటించారు. ఈ విషయాన్ని అధికారిక ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాదికి సంబంధించి సెలవుల విషయంలో.. అక్టోబర్ 24వ తేదీని ‘దసరా సెలవు’గా పేర్కొంది. ఆ మరుసటి రోజు అంటే 25ని కూడా సెలవు దినంగా ప్రకటించింది. అయితే, ఇప్పుడు ఈ సెలవును ఒక రోజు ముందుకు మారుస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. అక్టోబర్ 23న దసరా సెలవుగా ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక బలమైన కారణమే ఉంది. వాస్తవానికి ఈ ఏడాది దసరా పండుగ విషయంలో శాస్త్రీయ పరంగా కొంత సందిగ్ధం నెలకొంది. దాంతో.. దసరా ఏ రోజున అనే కన్‌ఫ్యూజన్ ఉంది. కొన్ని చోట్ల అక్టోబర్ 23వ తేదీన అని చెబుతుంటే.. మరికొన్ని చోట్ల 24వ తేదీన అంటూ ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలోనే.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 23వ తేదీనే దసరా పండుగ అని ప్రకటించింది. ఆ మేరకు సెలవు ముందు రోజుకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..