Gold Smulling: అమ్మ బాబోయ్! అంత బంగారం ఎలా తీసుకొచ్చారంటే..! వీడియో వైరల్..
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా గోల్డ్ పట్టుబడింది. దుబాయ్, బెహరీన్ దేశాల నుండి వేరు వేరుగా వచ్చిన ప్యాసింజర్స్ నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ పట్టుబడిన గోల్డ్ ఎంత? దాని విలువెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! బంగారం తరలిస్తున్న తీరును చూసి అధికారులే షాక్ అయ్యారు.ఎయిర్‌పోర్టులు గోల్డ్ స్మగ్లింగ్‌కు అడ్డాలుగా మారుతున్నాయి. బంగారం అక్రమ రవాణాకు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు స్మగ్లర్స్.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా గోల్డ్ పట్టుబడింది. దుబాయ్, బెహరీన్ దేశాల నుండి వేరు వేరుగా వచ్చిన ప్యాసింజర్స్ నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ పట్టుబడిన గోల్డ్ ఎంత? దాని విలువెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! బంగారం తరలిస్తున్న తీరును చూసి అధికారులే షాక్ అయ్యారు. ఎయిర్‌పోర్టులు గోల్డ్ స్మగ్లింగ్‌కు అడ్డాలుగా మారుతున్నాయి. బంగారం అక్రమ రవాణాకు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు స్మగ్లర్స్. అయితే, కస్టమ్స్ అధికారుల ముందు గోల్డ్ స్మగ్లర్ల ఆటలు సాగడం లేదు. మీరు ఏ రూట్లో వచ్చినా.. మేం పట్టుకుంటామ్ అంటూ మళ్లీ నిరూపించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ప్రయాణికుల నుంచి భారీగా గోల్డ్ ను స్వాధీనం చేసుకుంది కస్టమ్స్ టీమ్. సుమారు 4 కిలోల గోల్డ్‌ను సీజ్ చేశారు. పట్టుబడిన బంగారం విలువ రెండున్నర కోట్ల రూపాయలకు పైగా ఉంటుందన్నారు కస్టమ్స్ అధికారులు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్టోబర్ 5న కొందరు ప్రయాణికులు అనుమానస్పదంగా కనిపించారు. దీంతో వారిని అధికారులు తనిఖీ చేశారు. వారి నుండి నాలుగు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంత బంగారం తరలిస్తున్న తీరును చూసి అధికారులు షాక్ అయ్యారు. బట్టల మడతల్లో బంగారాన్ని పెట్టి ఒకరు తరలిస్తే.. కూర్చునే సీటు వెనకాల చాకచక్యంగా గోల్డ్‌ను తరలిస్తూ పట్టుబడ్డారు కేటుగాళ్లు. దీంతో పాటుగా మరో 16 లక్షల రూపాయిల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గోల్డ్ స్మగ్లింగ్, విదేశీ కరెన్సీ రవాణా చేస్తోన్న ఆరుగురు విదేశీ మహిళలను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..