Switzerland Of India: 4 రాష్ట్రాలను తాకే ఏకైక జిల్లా ఏదంటే..? ‘స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా’ అని పేరు..
సోన్‌భద్ర ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నప్పటికీ దాని సరిహద్దులు మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లను తాకుతాయి. సోన్‌భద్ర మైనింగ్ గనుల పరంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి కైమూర్ కొండలలో బాక్సైట్, సున్నపురాయి, బొగ్గు, బంగారం కూడా లభిస్తుంది. 1989కి ముందు సోన్‌భద్ర యూపీలోని మీర్జాపూర్ జిల్లాలో ఉండేది. అయితే 1998లో దీనిని వేరు చేసి సోన్‌భద్ర అనే పేరు పెట్టారు.
సోన్‌భద్ర ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నప్పటికీ దాని సరిహద్దులు మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లను తాకుతాయి. సోన్‌భద్ర మైనింగ్ గనుల పరంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి కైమూర్ కొండలలో బాక్సైట్, సున్నపురాయి, బొగ్గు, బంగారం కూడా లభిస్తుంది. 1989కి ముందు సోన్‌భద్ర యూపీలోని మీర్జాపూర్ జిల్లాలో ఉండేది. అయితే 1998లో దీనిని వేరు చేసి సోన్‌భద్ర అనే పేరు పెట్టారు. ఇక్కడ సోన్ నది ప్రవహిస్తుంది. ఈ నది కారణంగా ఈ ప్రాంతానికి సోన్‌భద్ర అనే పేరు వచ్చింది. ఈ జిల్లాలో కన్హర్, పంగన్‌లతో పాటు రిహాండ్ నది కూడా ప్రవహిస్తుంది. సోన్‌భద్ర జిల్లా వింధ్య , కైమూర్ కొండల మధ్య ఉంది. ఇక్కడి అందమైన దృశ్యాలు ఇట్టే ఆకట్టుకుంటాయి. పండిట్ నెహ్రూ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ జిల్లాలోని ప్రకృతి అందాలను చూసి, ఈ ప్రాంతానికి ‘స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా’ అనే పేరు పెట్టారు. సోన్‌భద్రలో అడుగడుగునా పచ్చదనం, అందమైన పర్వతాలు కనిపిస్తాయి. ఇక్కడి నదుల ప్రవాహం కనువిందు చేస్తుంది. ఇక్కడ పలు పవర్ ప్లాంట్లు ఉన్నకారణంగా ఈ ప్రాంతాన్ని పవర్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..