Accident: తొందరపాటు.. ఎంతటి నష్టాన్ని మిగుల్చుతుందో చూడండి..!
చిన్న నిర్లక్ష్యం జీవితంలో భారీ మూల్యాన్ని చెల్లించే పరిస్థితిని తెస్తుంది. ఒకప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగితే పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. కానీ సీసీ కెమెరాలు అందుబాటులోకి రావడం, ఇంటర్‌నెట్, సోషల్ మీడియా విస్తృతి పెరగడంతో ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఉలిక్కిపడుతున్నారు.
చిన్న నిర్లక్ష్యం జీవితంలో భారీ మూల్యాన్ని చెల్లించే పరిస్థితిని తెస్తుంది. ఒకప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగితే పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. కానీ సీసీ కెమెరాలు అందుబాటులోకి రావడం, ఇంటర్‌నెట్, సోషల్ మీడియా విస్తృతి పెరగడంతో ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఉలిక్కిపడుతున్నారు. వీడియో ప్రకారం ఈ సంఘటన మజీద్‌పుర జంక్షన్ వద్ద జరిగినట్లు తెలుస్తోంది. ఓ కూడలి వద్ద వాహనాలు వేగంగా వెళుతున్నాయి. అదే సమయంలో ఓ స్కూటీపై వస్తున్న వ్యక్తి రోడ్డు దాటాలని ప్రయత్నించాడు. ఆ ఆతృతలో ఎదురుగా ఏ వాహనం వస్తోందన్న విషయాన్ని కూడా గమనించకుండా స్కూటీని వేగంగా డ్రైవ్ చేస్తూ ముందుకెళ్లాడు. ఇంతలో అవతలి వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన ఆల్టో కారు స్కూటీని బలంగా ఢీకొట్టింది. దీంతో స్కూటీపై ఉన్న వ్యక్తి ఒక్కసారిగా రోడ్డుపై కుప్ప కూలిపోయాడు. స్కూటీ ఏమో అవతలి రోడ్డుపైకి ఎగిరిపడింది. ఇదంతా అక్కడున్న సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోతోపాటు.. ముందుగా వెళ్లే హక్కు ను వివరిస్తూ ఓ పోస్ట్ చేశారు. ఏదైనా కూడలి వద్ద ప్రధాన రహదారిలో వెళ్లే వాహనాలకు ముందుగా వెళ్లే అనుమతి ఉంటుంది. ఇతర రోడ్డుల నుండి వచ్చే వాహనాలు ప్రధాన రహదారిలో ఎలాంటి వాహనాలు లేనప్పుడు జాగ్రత్తగా గమనించి వెళ్ళాలి అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియో పాతదే.. కానీ ఇప్పుడు మరోసారి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో మళ్లీ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..