పెళ్లి దావత్ కాదు.. అన్నదానం.. అది కూడా 32 రకాల స్వీట్స్‌తో
మడత కాజాలు, పాలకోవాలు, కచ్చికాయలు, గులాబ్ జామ్‌లు, పూతరేకులు, మైసూర్‌పాక్‌లు ఒకటేమిటి నోరూరించే 32 రకాల స్వీట్స్‌తో అన్నసంతర్పణ చేశారు కోనసీమజిల్లా వాసులు. అవును, వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిసినా నోరూరించే వంటకాలు, రకరకాల స్వీట్స్‌తో ఇంకా చాలా చోట్ల నిమజ్జనోత్సవాల్లో భాగంగా అన్నసంతర్పణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం నల్లచెరువు గ్రామంలో వినూత్నంగా సంతర్పణ భోజనాలు పెట్టారు గ్రామస్తులు.
మడత కాజాలు, పాలకోవాలు, కచ్చికాయలు, గులాబ్ జామ్‌లు, పూతరేకులు, మైసూర్‌పాక్‌లు ఒకటేమిటి నోరూరించే 32 రకాల స్వీట్స్‌తో అన్నసంతర్పణ చేశారు కోనసీమజిల్లా వాసులు. అవును, వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిసినా నోరూరించే వంటకాలు, రకరకాల స్వీట్స్‌తో ఇంకా చాలా చోట్ల నిమజ్జనోత్సవాల్లో భాగంగా అన్నసంతర్పణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం నల్లచెరువు గ్రామంలో వినూత్నంగా సంతర్పణ భోజనాలు పెట్టారు గ్రామస్తులు. ఏకంగా 32 రకాల స్వీట్లు, పులిహోర, బిర్యానీ, దద్దోజనం, గారెలు, వడలు, జంతికలు రకరకాల వంటకాలతో వివాహ భోజనానికి మించి ఏర్పాటు చేశారు. నోరూరించే కోనసీమ పాపులర్ స్వీట్స్ తో అరిటాకు మొత్తం నింపేశారు. దాదాపు 1500 మంది ఈ విందులో పాల్గొని కడుపారా భుజించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో చూసిన వారంతా ఔరా అంటూ నోరెళ్లబెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కుర్రాడి కొత్త ఉద్యోగం.. సోషల్ మీడియాలో సంబరం
నీళ్లు తాగినా అలెర్జీ.. తాకినా అలెర్జీ.. ఇదో అరుదైన వ్యాధి
దేవుళ్లకు ఐటీ షాక్.. పన్ను కట్టాలంటూ ఆలయాలకు నోటీసులు
అంతరిక్షంలో చెత్తకు రూ.1.24 కోట్ల జరిమానా..
వైట్‌హౌస్‌లో చెలరేగిపోతున్న బైడెన్ శునకం.. కొరికిపారేస్తుందిగా..