Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: గ్రేటర్ వాసులకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీరు బంద్..

హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజు-2లో గున్ గల్ నుంచి సాహెబ్ నగర్ వరకు ఉన్న 2200 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపు లైనుకు రాగన్నగూడ వద్ద భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీని అరికట్టడానికి మరమ్మతు పనులు చేపడుతున్నారు.

Hyderabad: గ్రేటర్ వాసులకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీరు బంద్..
Water Tap
Follow us
Vidyasagar Gunti

| Edited By: Shiva Prajapati

Updated on: Oct 08, 2023 | 7:22 AM

హైదరాబాద్, అక్టోబర్ 7: హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజు-2లో గున్ గల్ నుంచి సాహెబ్ నగర్ వరకు ఉన్న 2200 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపు లైనుకు రాగన్నగూడ వద్ద భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీని అరికట్టడానికి మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఈ కారణంగా 11-10-2023, బుధవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అంటే.. 12.10.2023, గురువారం ఉదయం 6 గంటల వరకు ఈ పనులు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఈ 24 గంటలు జలమండలి పలు డివిజన్ల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుంది. ఈ విషయాన్ని గమనించి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరమ్మతు పనులు పూర్తయిన తరువాత.. నీటి సరఫరాను పునరుద్ధరించడం జరుగుతుంది. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి.. నీటిని ముందుగానే నిల్వ చేసుకుంటే ఇబ్బందులకు గురి కాకుండా ఉంటారు. ఈ మేరకు హైదరాబాద్ జలమండలి ఒక ప్రకటన విడుదల చేసింది.

హైదరాబాద్‌లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాలివే..

  1. ఓ అండ్ ఎం డివిజన్-1: ఎన్పీఏ, మిరాలం.
  2. ఓ అండ్ ఎం డివిజన్-2: బాలాపూర్, మైసారం, బార్కాస్.
  3. ఓ అండ్ ఎం డివిజన్-5: మేకలమండి, భోలక్ పూర్.
  4. ఓ అండ్ ఎం డివిజన్-7: తార్నాక, లాలాపేట్, బౌద్ధనగర్, మారేడ్ పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎంఈఎస్, కంటోన్మెంట్, ప్రకాశ్ నగర్, పాటిగడ్డ.
  5. ఓ అండ్ ఎం డివిజన్-9: హస్మత్ పేట్, ఫిరోజ్ గూడ, గౌతమ్ నగర్.
  6. ఓ అండ్ ఎం డివిజన్-10 (ఏ), (బి): వైశాలి నగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటో నగర్, అల్కపురి కాలనీ.
  7. ఓ అండ్ ఎం డివిజన్-13: మహీంద్ర హిల్స్.
  8. ఓ అండ్ ఎం డివిజన్-14: ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కానగర్, బీరప్పగడ్డ.
  9. ఓ అండ్ ఎం డివిజన్-16: బుద్వేల్, శాస్త్రిపురం.
  10. ఓ అండ్ ఎం డివిజన్-19: బోడుప్పల్.
  11. ఓ అండ్ ఎం డివిజన్-20: మీర్ పేట్, బడంగ్ పేట్, శంషాబాద్, మన్నెగూడ.

పైన పేర్కొన్న నీటి సరఫరాలో అంతరాయం కలిగే ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని హైదరాబాద్ జలమండలి అధికారులు సూచించారు. అలాగే ముందుగానే నీటిని నిల్వ ఉంచుకోవాలని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..