Hyderabad: బంజారా హిల్స్ సీఐ వసూళ్ల బాగోతం.. వెలుగులోకి సంచలన విషయాలు..
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. సీఐ నరేందర్, ఎస్సై నవీన్ రెడ్డి, హోంగార్డు హరిలకు అధికారులు 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో తెలిపారు. ఇవాళ ఉదయం ముగ్గురిని ఏసీబీ కార్యాలయానికి తరలించిన అధికారులు నోటీసులు ఇచ్చి పంపించారు. సుమారు 20 గంటల పాటు వారిని విచారించారు. స్కై లాంజ్ పబ్ ఎండీని బంజారాహిల్స్ సీఐ నరేందర్ బెదిరించి

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. సీఐ నరేందర్, ఎస్సై నవీన్ రెడ్డి, హోంగార్డు హరిలకు అధికారులు 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో తెలిపారు. ఇవాళ ఉదయం ముగ్గురిని ఏసీబీ కార్యాలయానికి తరలించిన అధికారులు నోటీసులు ఇచ్చి పంపించారు. సుమారు 20 గంటల పాటు వారిని విచారించారు. స్కై లాంజ్ పబ్ ఎండీని బంజారాహిల్స్ సీఐ నరేందర్ బెదిరించి, డబ్బులు డిమాండ్ చేశాడని ఆ పబ్ ఓనర్ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో తనిఖీలు చేపట్టారు. స్కైలాంజ్ పబ్ ఓనర్ ని నాలుగున్నర లక్షల మామూలు ఇవ్వాలని డిమాండ్ చేసిన సీఐ నరేందర్.. ఆ తర్వాత కొంత తగ్గి 3 లక్షలకు డీల్ సెట్ చేసుకున్నారు. ఇందులోని 50 వేలు పబ్ ఓనర్ జూన్ లోనే సీఐ నరేందర్ కు చెల్లించాడు. ఆ సమయంలో పబ్ ఓనర్ వీడియో రికార్డ్ చేశాడు.నిన్నటి నుంచి ఈరోజు ఉదయం ఎనిమిది గంటల వరకు సీఐ నరేందర్ ను దాదాపు 20 గంటల పాటు ప్రశ్నించారు.. నిన్న రాత్రి ఏసీబీ అధికారులు పబ్ ఓనర్స్ ను పిలిపించి వారి స్టేట్ మెంట్స్ ను రికార్డ్ చేశారు. ఈ క్రమంలోనే పబ్ ఓనర్స్ నుంచి నెల నెల మామూలు సీఐ డిమాండ్ చేసినట్లుగా గుర్తించారు. సీఐ కి 50 వేలు పబ్ ఓనర్ ఆన్ లైన్ పేమెంట్ చేశారు.
ఈ వ్యవహారంలో ఇన్స్పెక్టర్ కు ఎస్ఐ నవీన్ రెడ్డి, హోంగార్డ్ హరి సహకరించారని అధికారులు గుర్తించారు. హోమ్ గార్డ్ హరి నెలనెలా పదివేలు పర్సనల్ గా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.. ఇక, సీఐ నరేందర్.. పబ్ లలో వసూళ్లతో పాటు ఇంకేమైనా వసూళ్లకు పాల్పడ్డారనే విషయాలను కూడా ఏసీబీ అధికారులు ఆరా తీశారు. నరేందర్ పై గతంలో వచ్చిన ఆరోపణలపై కూడా ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. ఓవైపు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సీఐ నరేందర్ ను విచారిస్తున్న గానే బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించి సిఐ నరేందర్ పై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే నిన్నటి నుంచి దాదాపు 20 గంటల పాటు.. సీఐ నరేందర్, ఎస్సై నవీన్ రెడ్డి, హోంగార్డు శ్రీహరిలను ఏసీబీ అధికారులు విచారించారు. వాట్సాప్ కాల్స్, చాట్స్ ఆధారంగా విచారణ చేశారు..ఈనెల 9న ముగ్గురిని మరోసారి విచారించనున్నారు ఏసీబీ అధికారులు.. ముగ్గురి కాల్ లిస్ట్, వాట్సాప్ చాట్ ముందు ఉంచి ఇన్వెస్టిగేట్ చేయనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..