AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: ఆశావాహులతో AICC ఆఫీస్ కిటకిట.. ఇవాళ మరోసారి స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం

తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల పంచాయితీ కొనసాగుతోంది. ఒకవైపు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తుంటే.. తమకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ అశావహులు ఏఐసీసీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో పొటెత్తుతున్నారు. అంతేకాకుండా అధిష్టానం పెద్దల ఇళ్ల వద్ద టికెట్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. పెద్దలను కలిసి పైరవీలు చేస్తే తప్పా..

Telangana Congress: ఆశావాహులతో AICC ఆఫీస్ కిటకిట.. ఇవాళ మరోసారి స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం
Telangana Congress
Shaik Madar Saheb
|

Updated on: Oct 09, 2023 | 8:07 PM

Share

తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల పంచాయితీ కొనసాగుతోంది. ఒకవైపు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తుంటే.. తమకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ అశావహులు ఏఐసీసీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో పొటెత్తుతున్నారు. అంతేకాకుండా అధిష్టానం పెద్దల ఇళ్ల వద్ద టికెట్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. పెద్దలను కలిసి పైరవీలు చేస్తే తప్పా.. టికెట్లు ఖరారు కావన్న భావనతో కొందరు నేతలు.. ఢిల్లీ పెద్దలను కలిసి ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఏఐసీసీ కార్యాలయం దగ్గర జగ్గా రెడ్డి, కుసుమ కుమార్ వంటి సీనియర్ నేతలు కనిపించగా.. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కె. మురళీధరన్ నివాసం వద్ద ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఆశావహులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆయన్ను కలిసి వెళ్లారు. మురళీధరన్‌ను కలిసినవారిలో సునీత రావు, శివసేన రెడ్డి, అద్దంకి దయాకర్, మాధవి రెడ్డి, రాధిక, ప్రమోద్ కుమార్, మైలారం సులోచన సహా పలువురు ఉన్నారు.

మధ్యప్రదేశ్ అభ్యర్థులను ఖరారు చేయడం కోసం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయింది. భేటీకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ వంటి పెద్దలంతా హాజరయ్యారు. దీంతో వారికి తమ మోర వినిపించేందుకు ఏఐసీసీ కార్యాలయం వద్దకు ఆశావహులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలో ఏఐసీసీ కార్యాలయం అశావాహులతో జాతరను తలపించింది. ఇదిలాఉంటే.. ఇదే సమయంలో ఏఐసీసీ ఆఫీస్‌ దగ్గర ఆసక్తికర సన్నివేశం జరిగింది. టికెట్ల కోసం గ్రామస్థాయి నేతలు కూడా క్యూకట్టారు. చేవెళ్ల టికెట్ ఆశిస్తున్న మైలారం సులోచన – జగ్గారెడ్డి చిట్‌చాట్ చేశారు. గ్రామవార్డు మెంబర్‌గా, ఎంపీటీసీగా గెలిచాను.. టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు. ఆమె డిమాండ్‌ను ఆసక్తికరంగా విన్న జగ్గారెడ్డి.. చివరిగా ఆల్‌ది బెస్ట్ చెప్పి పంపారు. మరోవైపు తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు తనకు గోషామహల్ సీట్ వద్దు.. అంబర్‌పేట ముద్దు అని ప్రపోజల్స్ పెట్టినట్లు తెలుస్తుంది. సిటీలో కుదరకపోతే మహబూబ్‌నగర్ జిల్లాలో ఎక్కడ ఇచ్చినా పోటీ చేస్తానని ఆమె మురళీధరన్‌తో చెప్పినట్టు తెలిసింది.

మురళీధరన్‌తో ఎంపీ కోమటిరెడ్డి భేటీ

మరోవైపు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్‌తో సమావేశమయ్యారు. యూత్ కాంగ్రెస్ నేతలకు కనీసం 5 సీట్లైనా ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఈ నెల 15లోగా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలవుతుందన్నారు కోమటిరెడ్డి. ఇవాళ మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఇవాళ్టి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో 90 శాతం కసరత్తు పూర్తి చేసి జాబితాను సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించాలనే ప్లాన్ చేస్తుంది కాంగ్రెస్. ఈనెల 11 లేదా 12న కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకటించడానికి ముందే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయాలని స్క్రీనింగ్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం.. అయితే, ఇవాళ్టి స్క్రీనింగ్ కమిటీ సమావేశం తర్వాత.. కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 నుంచి 70 సీట్లను ఖరారు చేస్తుందని పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..