AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guess The Actress: మేకప్‌ లేకున్నా మెరిసిపోతున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? ఈ బ్యూటీ లాయర్‌ కూడా..

పై ఫొటోలో ముఖానికి మొబైల్‌ అడ్డుపెట్టుకుని పోజులిస్తున్న ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా? మేకప్‌ లేకుండా సింపుల్‌గా కనిపిస్తోన్న ఈమె ప్రముఖ హీరోయిన్‌. తెలుగు, తమిళ సినిమాల్లో మెరిసింది. చూడగానే ఇట్టే ఆకట్టుకునే అందమైన రూపం ఆమెది. చేసింది కొన్ని సినిమాలైన తన క్యూట్‌ యాక్టింగ్‌తో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. సినిమాల సంగతి పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మ క్రిమినాలజీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ లా పట్టా పుచ్చుకుంది

Guess The Actress: మేకప్‌ లేకున్నా మెరిసిపోతున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? ఈ బ్యూటీ లాయర్‌ కూడా..
Tollywood Actress
Basha Shek
|

Updated on: Oct 07, 2023 | 6:30 AM

Share

పై ఫొటోలో ముఖానికి మొబైల్‌ అడ్డుపెట్టుకుని పోజులిస్తున్న ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా? మేకప్‌ లేకుండా సింపుల్‌గా కనిపిస్తోన్న ఈమె ప్రముఖ హీరోయిన్‌. తెలుగు, తమిళ సినిమాల్లో మెరిసింది. చూడగానే ఇట్టే ఆకట్టుకునే అందమైన రూపం ఆమెది. చేసింది కొన్ని సినిమాలైన తన క్యూట్‌ యాక్టింగ్‌తో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. సినిమాల సంగతి పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మ క్రిమినాలజీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ లా పట్టా పుచ్చుకుంది. అప్పుడప్పుడు లాయర్‌ కోట్‌లో కూడా కనిపిస్తుంటుంది. సోషల్‌ మీడియాలోనూ ఈ అందాల తారకు మస్త్ క్రేజ్‌ ఉంది. తన ఫొటోలను ఎప్పటికప్పుడూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తుంటుంది. అలా తాజాగా ఆమె షేర్‌ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇందులో మేకప్‌ లేకున్నా ఎంతో క్యూట్‌గా కనిపించిందీ సొగసరి. మరి ఆమె ఎవరో గుర్తుపట్టరా?లేదా మమ్మల్నే చెప్పేయమంటారా? ఈ బ్యూటీ మరెవరో కాదు నేల టికెట్‌ సినిమాలో రవితేజతో ఆడి పాడిన మాళవిక శర్మ. ముంబైకు చెందిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించింది. ఆతర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

మాస్‌ మహరాజా హీరోగా వచ్చిన నేల టికెట్‌ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మాళవిక శర్మ. ఈ సినిమా నిరాశపర్చినా మాళవిక క్యూట్‌ నటనకు చాలామందిని ఆకట్టుకుంది. ఆతర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పోతినేని తో కలిసి రెడ్ సినిమాలో నటించిందీ ముద్దుగుమ్మ. ఇందులో రామ్‌ ప్రియురాలిగా చక్కని అభినయం ప్రదర్శించింది. అలాగే తమిళ్‌లో కాఫీ విత్‌ కాదల్‌లోనూ మెరిసింది. అయితే ఈ సినిమాల తర్వాత పెద్దగా సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించలేదు మాళవిక. ప్రస్తుతం గోపీచంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న భీమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది. దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సినిమాల సంగతి పక్కన పెడితే మాళవిక లా డిగ్రీని పూర్తి చేసింది. ముంబైలోని రిజ్వీ లా డిగ్రీ కాలేజీ నుంచి క్రిమినాలజీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ లా పట్టా అందుకుంది. అప్పుడప్పుడు బ్లాక్‌ కోట్‌ ధరించిన ఫొటోలను కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తోంది మాళవిక.

ఇవి కూడా చదవండి

మాళవిక శర్మ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి