Manchu Manoj- Mounika: ‘మై డార్లింగ్ వైఫ్.. నీ ఆనందం కోసం ఎందాకైనా వెళ్తా’.. మౌనికకు మనోజ్ బర్త్ డే విషెస్

టాలీవుడ్‌ రాకింగ్‌ స్టార్‌ మంచు మనోజ్‌, భూమా మౌనికా రెడ్డి ఈ ఏడాది మార్చిలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మంచు లక్ష్మి ఇంట వేదికగా జరిగిన ఈ వివాహానికి ఇరుకుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వేద మంత్రాల సాక్షిగా మౌనిక మెడలో మూడు ముళ్లు వేశాడు మనోజ్‌. అలాగే మౌనిక కుమారుడు ధైరవ్‌ నాగిరెడ్డి బాధ్యత కూడా తనదేనంటూ తన గొప్ప మనసును చాటుకున్నాడీ హీరో. కాగా సందర్భమొచ్చినప్పుడల్లా తన భార్యపై ప్రేమను కురిపిస్తున్నాడు మనోజ్‌

Manchu Manoj- Mounika: 'మై డార్లింగ్ వైఫ్.. నీ ఆనందం కోసం ఎందాకైనా వెళ్తా'.. మౌనికకు మనోజ్ బర్త్ డే విషెస్
Manchu Manoj, Bhuma Mounika
Follow us
Basha Shek

|

Updated on: Oct 05, 2023 | 6:25 AM

టాలీవుడ్‌ రాకింగ్‌ స్టార్‌ మంచు మనోజ్‌, భూమా మౌనికా రెడ్డి ఈ ఏడాది మార్చిలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మంచు లక్ష్మి ఇంట వేదికగా జరిగిన ఈ వివాహానికి ఇరుకుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వేద మంత్రాల సాక్షిగా మౌనిక మెడలో మూడు ముళ్లు వేశాడు మనోజ్‌. అలాగే మౌనిక కుమారుడు ధైరవ్‌ నాగిరెడ్డి బాధ్యత కూడా తనదేనంటూ తన గొప్ప మనసును చాటుకున్నాడీ హీరో. కాగా సందర్భమొచ్చినప్పుడల్లా తన భార్యపై ప్రేమను కురిపిస్తున్నాడు మనోజ్‌. తాజాగా మౌనిక పుట్టిన రోజు (అక్టోబర్‌ 4) సందర్భంగా మరోసారి తన సతీమణిపై ప్రేమను చాటుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా తన సతీమణికి బర్త్‌ డే విషెస్‌ చెప్పిన ఒక ఎమోషనల్‌ నోట్‌ను పంచుకున్నాడు. ‘ వెరీ హ్యాపీ బర్త్‌ డే మున్నిలు.. ఈ రోజు నీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా నాకు నీ మీద ఉన్న ప్రేమను, ఇష్టాన్నివ్యక్తపరచాలనుకుంటున్నాను. నా జీవితంలో ప్రేమ వెలుగులు పంచింది నువ్వే. మనల్ని దగ్గరిగా చేసిన ఈ కాలానికి నేనెప్పుడూ రుణ పడి ఉంటాను. మా జీవితాల్లో వెలకట్టలేనంత ఆనందాన్ని తీసుకొచ్చావు. నవ్వుల్ని పంచావు. నీ నిస్వార్థమైన ప్రేమ, నా పట్ల నువ్వు చూపించే కేరింగ్‌ను మాటల్లో వర్ణించలేవు’

‘ధైరవ్‌.. నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం. నీ మనసెంత మంచిదంటే.. నీ చుట్టూ ఉన్నవాళ్లందరి ముఖాల్లోనూ చిరునవ్వును తీసుకొస్తావు. నీ చుట్టూ ఉన్నవారందరికీ ప్రేమాభిమానాలను పంచుతావు. నాకున్న కోరికల్లా ఒక్కటే.. ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలంతే. నీకంతా మంచే జరగాలి మై లవ్‌.. నీపై ఎప్పటికీ ఈ ప్రేమ ఇలాగే ఉంటుందని మాటిస్తున్నాను. నీ సంతోషమే నాక్కావాల్సింది. అందు కోసం నేనేదైనా చేస్తాను. ఎంతవరకైనా వెళ్తాను. హ్యాపీ బర్త్‌డే మై డార్లింగ్‌ వైఫ్‌. నీ మనసు కోరుకున్నదంతా నీకు దక్కాలని మనసారా కోరుకుంటున్నాను. ధైరవ్‌, జోయాతో పాటు నా తరపునుంచి కూడా మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని తన భార్యపై తనకున్న ప్రేమకు అక్షర రూప మిచ్చారు మనోజ్‌. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘చూడముచ్చటైన జంట’అంటూ మౌనికకు బర్త్‌ డే విషెస్‌ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Manoj Manchu (@manojkmanchu)

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తో  మనోజ్ దంపతులు

View this post on Instagram

A post shared by Manoj Manchu (@manojkmanchu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు