- Telugu News Photo Gallery Cinema photos Ram Charan Visits Mumbai Siddhivinayak Temple Photos Goes Viral
Ram Charan: ‘గణపతి బప్ప మోరియా’..ముంబై సిద్ధి వినాయక ఆలయంలో రామ్‌చరణ్ పూజలు.. అయ్యప్ప దీక్షవిరమణ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు దైవ భక్తి చాలా ఎక్కువ. గ్లోబల్ స్టార్‌గా ఎదిగినా దైవ చింతనతో ఉంటాడు. ముఖ్యంగా శబరిమల అయ్యప్ప భక్తుడైన చరణ్ ఏటా కచ్చితంగాఅయ్యప్ప మాల ధరిస్తాడు. నియమ నిష్టలతో దీక్ష పాటిస్తాడు.
Updated on: Oct 05, 2023 | 6:30 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు దైవ భక్తి చాలా ఎక్కువ. గ్లోబల్ స్టార్‌గా ఎదిగినా దైవ చింతన చాలా ఎక్కువ. ముఖ్యంగా శబరిమల అయ్యప్ప భక్తుడైన చరణ్ ఏటా కచ్చితంగాఅయ్యప్ప మాల ధరిస్తాడు. నియమ నిష్టలతో దీక్ష పాటిస్తాడు.

కాగా క్లింకార జన్మించిన తరువాత రామ్ చరణ్ అయ్యప్ప మాల ధరించాడు. తాజాగా ముంబైలోని ప్రఖ్యాత శ్రీ సిద్ధివినాయకుడిని దర్శించుకుని అయ్యప్ప దీక్షను విరమించారు.

ఈ సందర్భంగా వినాయక ఆలయం దగ్గరకు రామ్ చరణ్ రాగానే అభిమానులు ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఆలయ సందర్శనలో రామ్ చరణ్ వెంట స్థానిక రాజకీయ నాయకులు కూడా ఉన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే..రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' సినిమాలో నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.

గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత చెర్రీ బాలీవుడ్ సినిమాలోనూ నటించే అవకాశం ఉంది. ఇక నిర్మాతగానూ సత్తాచాటుతున్న మెగా పవర్ స్టార్ ప్రస్తుతం నిఖిల్ హీరోగా ఓ హిస్టారికల్ మూవీని నిర్మిస్తున్నాడు.





























