- Telugu News Photo Gallery Cinema photos Parineeti Chopra Raghav Chadha Ranveer Singh, Deepika Padukone Virat Kohli Anushka Shetty And Other Celebrities Who Spend Crores For Marriage
Parineeti Chopra Marriage: ఈ స్టార్ సెలబ్రిటీల పెళ్లి ఖర్చు చూస్తే కళ్లు తేలేస్తారు.. వామ్మో అన్ని కోట్లా?
బాలీవుడ్ సెలబ్రిటీలకు పెళ్లి అనేది ప్రతిష్టాత్మకమైన అంశం. కోట్లాది రూపాయలు వెచ్చించి పెళ్లి వేడుకలను చేసుకుంటారు. కొంతమందైతే భారతీయ మీడియాకు చిక్కకుండా విదేశాలకు వెళ్లి పెళ్లి చేసుకుంటారు. ఇక చాలా మంది సెలబ్రిటీలు కూడా తమ పెళ్లికి రాజస్థాన్‌ను వేదికగా ఎంచుకుంటారు. తాజాగా బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాల వివాహం రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.
Updated on: Oct 05, 2023 | 7:59 AM

బాలీవుడ్ సెలబ్రిటీలకు పెళ్లి అనేది ప్రతిష్టాత్మకమైన అంశం. కోట్లాది రూపాయలు వెచ్చించి పెళ్లి వేడుకలను చేసుకుంటారు. కొంతమందైతే భారతీయ మీడియాకు చిక్కకుండా విదేశాలకు వెళ్లి పెళ్లి చేసుకుంటారు. ఇక చాలా మంది సెలబ్రిటీలు కూడా తమ పెళ్లికి రాజస్థాన్‌ను వేదికగా ఎంచుకుంటారు. తాజాగా బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాల వివాహం రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.

పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా ఇటీవల రాజస్థాన్‌లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం లీలా ప్యాలెస్ హోటల్‌లో జరిగింది. ఈ పెళ్లికి సుమారు రూ. 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. పరిణీతి పెళ్లికి ప్రియాంక చోప్రా కూడా రావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో రాలేకపోయింది.

బాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం 2018లో జరిగింది. వారు విల్లా డెల్ బాల్బియానెల్లోలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత బెంగుళూరు, ముంబైలలో రిసెప్షన్లు జరిగాయి. ఇందుకోసం మొత్తం 75 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు సమాచారం.

నటి అనుష్క శర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి వంద కోట్ల రూపాయలు వెచ్చించినట్లు సమాచారం. ఈ దంపతులకు వామిక అనే కుమార్తె ఉంది. ఇప్పుడు అనుష్క శర్మ మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు సమాచారం.

ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ రాజస్థాన్‌లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం క్రైస్తవ, హిందూ మత సంప్రదాయాల ప్రకారం జరిగింది. ఈ పెళ్లికి కూడా కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి.

బాలీవుడ్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వివాహాల్లో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి కూడా ఒకటి. వీరి వివాహ వేడుకల కోసం రూ. 100 కోట్లు ఖర్చు పెట్టారని టాక్ వినిపించింది.

కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి కూడా కోట్ల రూపాయలు వెచ్చించారని సమాచారం. ఇక అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్ సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి పెళ్లయి చాలా ఏళ్లయింది. ఈ పెళ్లికి 6-9 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఐశ్వర్యరాయ్ బచ్చన్‌కి ఆరాధ్య అనే కూతురు ఉంది.




