- Telugu News Photo Gallery Cinema photos Ram charan in ayyappa mala jawan record breaking collections
Tollywood News: అయ్యప్ప మాలలో చరణ్.. ఏ మాత్రం తగ్గని జవాన్ దూకుడు
గేమ్ ఛేంజర్ షూటింగ్‌కు బ్రేక్ రావడంతో.. ఈ గ్యాప్‌లో యాడ్ చేస్తున్నారు చరణ్. ఈయన ముంబై ఎయిర్ పోర్టులో ఉన్న వీడియో వైరల్ అవుతుందిప్పుడు. అందులో అయ్యప్ప మాలలో ఉన్నారు చరణ్. అక్టోబర్ 4 ఉదయం ముంబైలోని సిద్ధి వినాయక టెంపుల్‌లో మాల తీసేయనున్నారు రామ్ చరణ్. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన కాలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా మ్యాడ్. అక్టోబర్ 6న సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రంలోని కళ్లాజోడు కాలేజ్ పాప అని సాగే వీడియో సాంగ్ విడుదల చేసారు మేకర్స్.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Oct 05, 2023 | 9:34 AM

Ram Charan: గేమ్ ఛేంజర్ షూటింగ్‌కు బ్రేక్ రావడంతో.. ఈ గ్యాప్‌లో యాడ్ చేస్తున్నారు చరణ్. ఈయన ముంబై ఎయిర్ పోర్టులో ఉన్న వీడియో వైరల్ అవుతుందిప్పుడు. అందులో అయ్యప్ప మాలలో ఉన్నారు చరణ్. అక్టోబర్ 4 ఉదయం ముంబైలోని సిద్ధి వినాయక టెంపుల్‌లో మాల తీసేయనున్నారు రామ్ చరణ్.

MAD: నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన కాలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా మ్యాడ్. అక్టోబర్ 6న సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రంలోని కళ్లాజోడు కాలేజ్ పాప అని సాగే వీడియో సాంగ్ విడుదల చేసారు మేకర్స్. విడుదలకు ఒకరోజు ముందు పెయిడ్ ప్రీమియర్స్ ఏర్పాటు చేస్తున్నారు మేకర్స్.

Chinna: సిద్ధార్థ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘చిత్త’. సెప్టెంబర్ 28న తమిళనాట విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఇదే సినిమాను తెలుగులో చిన్నా పేరుతో విడుదల చేస్తున్నారు. తన సినిమాను తెలుగులో విడుదల చేయాలంటే.. సిద్ధార్థ్ సినిమాను ఎవరు చూస్తారు అంటూ వెక్కిరించారని.. అలా అయితే తెలుగులో సినిమాలే విడుదల చేయనంటూ ఎమోషనల్ అయ్యారు సిద్ధార్థ్. దాదాపు ఏడ్చేసినంత పని చేసారీయన ప్రెస్ మీట్‌లో.

Jawan: విడుదలైన మూడు వారాల తర్వాత కూడా జవాన్ దూకుడు తగ్గడం లేదు. తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా 60 కోట్ల రూపాయల వరకు వసూళ్లను రాబట్టడం జరిగింది. ఇక హిందీలోనూ 540 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా 614 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. నయనతార, దీపికా పదుకునే హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని అట్లీ తెరకెక్కించారు. 2023లో షారుక్ ఖాన్‌కు ఇది రెండో 1000 కోట్ల సినిమా కావడం గమనార్హం.

Mark Antony: విశాల్ హీరోగా ఆధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ‘మార్క్ ఆంటోనీ’ సినిమా తెలుగులో పెద్దగా ఆడలేదు కానీ తమిళంలో మాత్రం ఇరగాడేసింది. విశాల్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ తెచ్చుకోవడమే కాదు.. ఓవరాల్ వసూళ్లలోనూ 100 కోట్ల మార్క్ అందుకుంది. విశాల్ కెరీర్‌లో ఫస్ట్ సెంచరీ ఇది. విడుదలైన మూడు వారాల తర్వాత కూడా ఈ చిత్రం బాగానే ఆడుతుంది. చంద్రముఖి 2 విడుదలైనా కూడా మార్క్ దూకుడు సాగుతుంది.





























