Actress Devayani: టీచర్‌గా మారిన పవన్‌ కల్యాణ్‌ ‘సుస్వాగతం’ హీరోయిన్‌.. ఇప్పుడెలా ఉందో చూశారా?

పవన్‌ కల్యాణ్‌ సుస్వాగతం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత శ్రీకాంత్‌తో మాణిక్యం, జగపతిబాబుతో శ్రీమతి వెళ్లొస్తా, బాలకృష్ణ చెన్నకేశవ రెడ్డి తదితర హిట్‌ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని స్థిరపడిపోయింది. ఇక సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్‌, అరవింద సమేత వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే దేవయాని ప్రస్తుతం నటనకు గుడ్ బై చెప్పేసి టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది

Actress Devayani: టీచర్‌గా మారిన పవన్‌ కల్యాణ్‌ 'సుస్వాగతం' హీరోయిన్‌.. ఇప్పుడెలా ఉందో చూశారా?
Actress Devayani
Follow us
Basha Shek

|

Updated on: Oct 04, 2023 | 6:00 AM

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించిన సుస్వాగతం సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ యూత్‌ ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ అప్పట్లో యూత్‌ను తెగ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో పవన్‌ ప్రేమను తిరస్కరించే సంధ్య పాత్రలో దేవయాని నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ముంబైకు చెందిన దేవయాని మొదటగా బాలీవుడ్‌లో కోయల్‌ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా రిలీజ్‌ కాలేదు. ఆ తర్వాత తమిళం, మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో అజిత్, శరత్‌కుమార్‌ వంటి స్టార్‌ హీరోలతో స్క్రీన్‌ షేర్ చేసుకుంది. ఇక పవన్‌ కల్యాణ్‌ సుస్వాగతం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత శ్రీకాంత్‌తో మాణిక్యం, జగపతిబాబుతో శ్రీమతి వెళ్లొస్తా, బాలకృష్ణ చెన్నకేశవ రెడ్డి తదితర హిట్‌ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని స్థిరపడిపోయింది. ఇక సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్‌, అరవింద సమేత వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే దేవయాని ప్రస్తుతం నటనకు గుడ్ బై చెప్పేసి టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. తమిళనాడులోని స్థానిక అన్నాసాలైలో గల చర్చ్‌ పార్క్‌ కాన్వెంట్‌లో స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుందామె. ఆమె పిల్లలు కూడా ఈ స్కూల్‌లోనే చదువుతున్నారు.

కాగా సినిమాలతో బాగానే సంపాదించిన దేవయాని ఒకానొక సమయంలో పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందంట. దీనికి కారణం ఆమె ప్రేమ వివాహం చేసుకోవడమే. ఇది తల్లిదండ్రులకు నచ్చకపోవడంతో అప్పటి వరకు దేవయాని సంపాదించిన డబ్బు నుంచి ఒక్కరూపాయి కూడా ఆమె తల్లిదండ్రులు ఇవ్వలేదట. దీనితో పెళ్లి తర్వాత బుల్లితెరపై అడుగుపెట్టిందట. దీంతో కొంత గాడిన పడిందట. అయితే కొన్నిరోజుల తర్వాత చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె తన భర్త డైరెక్షన్‌లో కొన్ని సినిమాలు నిర్మించిందట. అయితే దురదృష్టవశాత్తూ ఆ సినిమాలన్నీ నిరాశపర్చాయట. దీంతో ఆమె ఫ్యామిలీ మొత్తం అప్పుల్లో కూరుకుపోయిందట. అయితే కొంతమేర అప్పులు తీర్చిన దేవయాని ప్రస్తుతం టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. తనకు ఉపాధ్యాయరాలిగా పనిచేయాలని చిన్ననాటి నుంచి కోరికని, అందుకే టీచర్ కోర్సు చదివి ఉత్తీర్ణత పొందానంటోందీ అందాల తార. కాగా దేవయానికి ఇనియ, ప్రియాంక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

 నటి దేవయాని లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.