Master Peace OTT: కుమారి శ్రీమతి తర్వాత నిత్య మరో తెలుగు వెబ్‌ సిరీస్‌.. మాస్టర్‌ పీస్‌ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప్రముఖ హీరోయిన్‌ నిత్యా మేనన్‌ ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లు చేస్తూ బిజీబిజీగా ఉంటోంది. గతంలో ఆమె నటించిన 'బ్రీత్.. ఇన్‌ టు ద షాడోస్‌', సీజన్‌ 1’, సీజన్‌2, 'మోడ్రన్‌ లవ్‌' వెబ్‌ సిరీస్‌లకు సూపర్ రెస్పాన్స్‌ వచ్చింది. ఇక ఇటీవలే అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజైన 'కుమారి శ్రీమతి' వెబ్ సిరీస్‌ కూడా ప్రేక్షకులను కూడా అమితంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మరో ఆసక్తికర వెబ్ సిరీస్‌తో సందడి చేసేందుకు సిద్ధమైంది నిత్యా మేనన్‌.

Master Peace OTT: కుమారి శ్రీమతి తర్వాత నిత్య మరో తెలుగు వెబ్‌ సిరీస్‌.. మాస్టర్‌ పీస్‌ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Master Peace Web Series
Follow us
Basha Shek

|

Updated on: Oct 03, 2023 | 6:30 AM

ప్రముఖ హీరోయిన్‌ నిత్యా మేనన్‌ ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లు చేస్తూ బిజీబిజీగా ఉంటోంది. గతంలో ఆమె నటించిన ‘బ్రీత్.. ఇన్‌ టు ద షాడోస్‌’, సీజన్‌ 1’, సీజన్‌2, ‘మోడ్రన్‌ లవ్‌’ వెబ్‌ సిరీస్‌లకు సూపర్ రెస్పాన్స్‌ వచ్చింది. ఇక ఇటీవలే అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజైన ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్‌ కూడా ప్రేక్షకులను కూడా అమితంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మరో ఆసక్తికర వెబ్ సిరీస్‌తో సందడి చేసేందుకు సిద్ధమైంది నిత్యా మేనన్‌. అదే మాస్టర్‌ పీస్‌. క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సిరీస్‌కు శ్రీజిత్‌ దర్శకత్వం వహించారు. నిత్య తో పాటు షరాఫ్‌, రెంజి పనికర్‌, మాలా పార్వతి, అశోకన్‌, శాంతి కృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న మాస్టర్‌ పీస్‌ వెబ్‌ సిరీస్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. అక్టోబర్‌ 25 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించి ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో ఆద్యంతం నవ్వులు పంచేలా మాస్టర్‌ పీస్‌ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో రియా అనే పాత్రలో నిత్య కనిపించనుంది.

తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ మాస్టర్‌ పీస్‌ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ను చేయనున్నట్లు డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్‌ సంస్థ ప్రకటించింది. కాగా పవన్‌ కల్యాణ్‌ భీమ్లా నాయక్‌ తర్వాత తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు నిత్యా మేనన్‌. అయితే ఆహా ఇండియన్‌ ఐడల్ షో జడ్జిగా ఓటీటీ ప్రేక్షకులకు వినోదం అందించింది. ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తోందీ అందాల తార. తిరు సినిమా తర్వాత మరోసారి ధనుష్‌తో కలిసి (D51) నటిస్తోంది నిత్య. దీంతో పాటు కోలాంటి, ఆరమ్‌ తిరుకల్పన వంటి మలయాళ మూవీస్‌తో పాటు ఒక తమిళ సినిమా ఆమె చేతిలో ఉంది.

ఇవి కూడా చదవండి

మాస్టర్ పీస్ వెబ్ సిరీస్ ట్రైలర్..

కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ కు సూపర్ రెస్పాన్స్..

View this post on Instagram

A post shared by Nithya Menen (@nithyamenen)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!