OMG 2 OTT: ఓటీటీలోకి అక్షయ్‌ వివాదాస్పద మూవీ.. అన్ కట్ వెర్షన్‌తో ‘ఓ మై గాడ్‌ 2’ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించిన తాజా చిత్రం 'ఓ మై గాడ్‌ 2'. గతంలో వచ్చిన సూపర్‌ హిట్‌ సినిమా ఓ మై గాడ్‌ కు ఇది సీక్వెల్. అమిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సోషియో ఫాంటసీ మూవీలో పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్, గోవింద్‌ నామ్‌దేవ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. అక్షయ్‌ శివుడి దూత పాత్రలో మెప్పించగా, ఆయన భక్తుడి పాత్రలో పంకజ్‌ త్రిపాఠి కనిపించారు. ఆగస్ట్‌ 11న థియేటర్లలో విడుదలైన ఓ మై గాడ్‌ 2 సూపర్‌ హిట్‌గా నిలిచింది.

OMG 2 OTT: ఓటీటీలోకి అక్షయ్‌ వివాదాస్పద మూవీ.. అన్ కట్ వెర్షన్‌తో 'ఓ మై గాడ్‌ 2' స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?
Oh My God 2 Movie
Follow us
Basha Shek

|

Updated on: Oct 04, 2023 | 6:25 AM

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించిన తాజా చిత్రం ‘ఓ మై గాడ్‌ 2’. గతంలో వచ్చిన సూపర్‌ హిట్‌ సినిమా ఓ మై గాడ్‌ కు ఇది సీక్వెల్. అమిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సోషియో ఫాంటసీ మూవీలో పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్, గోవింద్‌ నామ్‌దేవ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. అక్షయ్‌ శివుడి దూత పాత్రలో మెప్పించగా, ఆయన భక్తుడి పాత్రలో పంకజ్‌ త్రిపాఠి కనిపించారు. ఆగస్ట్‌ 11న థియేటర్లలో విడుదలైన ఓ మై గాడ్‌ 2 సూపర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఓవరాల్‌గా రూ. 200 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది. అదే సమయంలో కొన్ని వివాదాలను ఎదుర్కొంది. సున్నితమైన లైంగిక విద్యకు సంబంధించిన కథ కావడంతో ఓ మై గాడ్ 2 మూవీకి సెన్సార్ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డానికి బోర్డు కూడా నిరాక‌రించింది. శివుడి పాత్ర‌లో అక్ష‌య్‌కుమార్ క‌నిపించ‌డంపై కొన్ని వ‌ర్గాల వారు అభ్యంత‌రం వ్య‌క్తంచేశారు. అందుకే చివరకు సినిమాలో అక్షయ్‌ పాత్ర పేరును మెసేంజర్‌ ఆఫ్‌ గాడ్‌గా మార్చారు. అలాగే సినిమాలో చాలా సీన్లకు ఎడిటింగ్‌ పడింది. చివరకు సెన్సార్ రివిజ‌న్ క‌మిటి ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చి రిలీజుకు అనుమతించింది. థియేటర్లలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ఓ మైగాడ్‌ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ అక్షయ్‌ కుమార్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. అక్టోబర్‌ 8 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఒక పోస్టర్‌ను షేర్‌ చేసింది.

కాగా ఓ మై గాడ్‌ 2 సినిమాలో అభ్యంతర సన్నివేశాలు ఉన్నాయంటూ సెన్సార్ సభ్యులు చాలా సీన్లను తొలగించారు. 27 కట్స్ తో పాటు 25 మార్పులు సూచించారు. అయితే ఓటీటీలో మాత్రం ఎలాంటి కటింగ్స్‌ లేకుండా ఒరిజెనల్‌ వెర్షన్‌ను రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ప్రేక్షకులకు ఇది బాగా నచ్చుతుంది అని ఓ మై గాడ్‌ టీమ్‌ ప్రకటించింది. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్‌ అయ్యారా? ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

అన్‌ కట్ వెర్షన్‌తో స్ట్రీమింగ్‌..

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

కీలక పాత్రలో ఆకట్టుకున్న యామీ గౌతమ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.