AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guess The Actress: మక్కాలో భర్త, కొడుకుతో టాలీవుడ్ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా మరి?

అందం, అభినయం పరంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. హీరోయిన్‌గా జెట్‌ స్పీడ్‌గా దూసుకెళుతోన్న సమయంలో ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసింది. అప్పటికప్పుడు తన సోషల్‌ మీడియా ఖాతాల్లో ఉన్న సినిమా ఫొటోలన్నింటినీ తొలగించి అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆ తర్వాత పూర్తిగా ఇస్లాం మతం పుచ్చుకుని మరోసారి వార్తల్లో నిలిచింది. ఆతర్వాత పెళ్లి చేసుకుని తన నివాసాన్ని పూర్తిగా దుబాయ్‌కు మార్చేసింది.

Guess The Actress: మక్కాలో భర్త, కొడుకుతో టాలీవుడ్ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా మరి?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Oct 03, 2023 | 6:20 AM

Share

పై ఫొటోలో భర్త, కుమారుడితో కలిసి కనిపిస్తోన్నదెవరో గుర్తుపట్టారా? గతంలో ఈమె టాలీవుడ్ హీరోయిన్‌. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌,కన్నడ, మలయాళ భాషా సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అయితే తెలుగు సినిమాలతోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. నాగార్జున, కల్యాణ్‌ రామ్‌, మంచు మనోజ్‌ల సినిమాల్లో ఆడిపాడింది. అందం, అభినయం పరంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. హీరోయిన్‌గా జెట్‌ స్పీడ్‌గా దూసుకెళుతోన్న సమయంలో ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసింది. అప్పటికప్పుడు తన సోషల్‌ మీడియా ఖాతాల్లో ఉన్న సినిమా ఫొటోలన్నింటినీ తొలగించి అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆ తర్వాత పూర్తిగా ఇస్లాం మతం పుచ్చుకుని మరోసారి వార్తల్లో నిలిచింది. ఆతర్వాత పెళ్లి చేసుకుని తన నివాసాన్ని పూర్తిగా దుబాయ్‌కు మార్చేసింది. కొన్ని రోజుల క్రితమే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం కుమారుడితో అమ్మతనాన్ని మనసారా ఆస్వాదిస్తోంది. అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో తళుక్కుమంటోన్న ఈ అందాల తారను గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా? పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు.. కల్యాణ్‌రామ్ కత్తి సినిమా హీరోయిన్‌ సనాఖాన్‌.

ముంబయిలో పుట్టి పెరిగిన సనాఖాన్‌ 2005లో బాలీవుడ్‪‌లో నటిగా కెరీర్ ప్రారంభించింది. హిందీతో పాటు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. తెలుగులో కల్యాణ్‌ రామ్‌ కత్తి, నాగార్జున గగనం, మంచు మనోజ్‌ మిస్టర్‌ నూకయ్య వంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. హిందీలోనూ అక్షయ్‌కుమార్, సల్మాన్‌ఖాన్‌ వంటి స్టార్‌ హీరోల సినిమాల్లో సందడి చేసింది. అయితే స్టార్‌ హీరోయిన్‌గా కెరీర్‌ ఫుల్‌ స్పీడ్‌ ఉంటున్న సమయంలోనే సినిమా ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసింది. ఆ కొన్ని రోజులకే మఫ్టీ అనాస్ సయ్యద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని దుబాయ్‌ వెళ్లిపోయింది. తమ దాంపత్య బంధానికి గుర్తుగా ఈ ఏడాది జులైలో మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా భర్త, కుమారుడితో కలిసి మక్కాను సందర్శించింది సనాఖాన్‌. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకోగా అవి కాస్తా వైరలవుతున్నాయి. అయితే మొదట చాలామంది ఆమెను గుర్తుపట్టలేదు. ఆ తర్వాత ఈమె హీరోయిన్‌ సనాఖానే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

సడెన్ గా సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై..

ఎక్కువగా ఆధ్యాత్మిక యాత్రల్లోనే..

భర్తతో సనాఖాన్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
సర్వీస్ పిస్టల్‌తో కానిస్టేబుల్ కాల్చుకుని మృతి!
సర్వీస్ పిస్టల్‌తో కానిస్టేబుల్ కాల్చుకుని మృతి!
అధిక వడ్డీ అని ఆశపడ్డారు..కట్‌చేస్తే ఏకంగా రూ. 10కోట్లతో జంప్
అధిక వడ్డీ అని ఆశపడ్డారు..కట్‌చేస్తే ఏకంగా రూ. 10కోట్లతో జంప్
జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అసలు కారణం ఇదే..శాశ్వత పరిష్కారం
జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అసలు కారణం ఇదే..శాశ్వత పరిష్కారం
కోర్టుల చుట్టూ తిరిగి అవకాశాలు, ఆస్తులు పోగొట్టుకున్నాడు
కోర్టుల చుట్టూ తిరిగి అవకాశాలు, ఆస్తులు పోగొట్టుకున్నాడు
టీమిండియా ప్లేయర్లపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!
టీమిండియా ప్లేయర్లపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!
నెమలి గురించి అసలు విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
నెమలి గురించి అసలు విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
వయస్సు 26 ఏళ్లు.. రూ.18 వేల జీతంతో రూ.75 లక్షల ఆస్తులు..
వయస్సు 26 ఏళ్లు.. రూ.18 వేల జీతంతో రూ.75 లక్షల ఆస్తులు..
సత్య సాయిబాబా బయోపిక్ చేయలేను.. కారణమేంటో చెప్పిన హీరో విజయ్
సత్య సాయిబాబా బయోపిక్ చేయలేను.. కారణమేంటో చెప్పిన హీరో విజయ్
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
ఆ హీరోయిన్ ను ఫంక్షన్ లో పిలిస్తే పట్టించుకోకుండా వెళ్లిపోయింది..
ఆ హీరోయిన్ ను ఫంక్షన్ లో పిలిస్తే పట్టించుకోకుండా వెళ్లిపోయింది..