AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rathika, Bigg Boss 7: నాలుగు వారాలకే రతిక ఔట్‌.. అయినా గట్టిగా రెమ్యునరేషన్‌.. ఎన్ని లక్షలు తీసుకుందో తెలుసా?

అనుకున్నట్లే బిగ్‌బాస్‌ నాలుగో వారం నుంచి హాట్‌ బ్యూటీ రతికా రోజ్‌ బయటకు వచ్చింది. నాలుగో వారం నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో చివరికి టేస్టీ తేజా, రతికలు మాత్రమే మిగిలారు. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ఆమె ఎలిమినేట్‌ అయినట్లు హోస్ట్‌ నాగార్జున ప్రకటించాడు. ఒకనొక దశలో టైటిల్‌ ఫేవరెట్‌గా భావించిన రతిక అనూహ్యంగా హౌజ్‌ నుంచి బయటకు వచ్చింది.

Rathika, Bigg Boss 7: నాలుగు వారాలకే రతిక ఔట్‌.. అయినా గట్టిగా రెమ్యునరేషన్‌.. ఎన్ని లక్షలు తీసుకుందో తెలుసా?
Rathika Rose
Basha Shek
|

Updated on: Oct 02, 2023 | 6:25 AM

Share

అనుకున్నట్లే బిగ్‌బాస్‌ నాలుగో వారం నుంచి హాట్‌ బ్యూటీ రతికా రోజ్‌ బయటకు వచ్చింది. నాలుగో వారం నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో చివరికి టేస్టీ తేజా, రతికలు మాత్రమే మిగిలారు. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ఆమె ఎలిమినేట్‌ అయినట్లు హోస్ట్‌ నాగార్జున ప్రకటించాడు. ఒకనొక దశలో టైటిల్‌ ఫేవరెట్‌గా భావించిన రతిక అనూహ్యంగా హౌజ్‌ నుంచి బయటకు వచ్చింది. ఇదంతా ఆమె చేతులరా చేసుకున్నదే. తన ప్రవర్తనకు తోడు ఓట్లు తక్కువ రావడంతో నాలుగో వారంలోనే హౌజ్‌ నుంచి బయటకు వచ్చింది రతిక. కాగా నాగ్‌ ఎలిమినేట్‌ అని ప్రకటించగానే రతిక ఎమోషనల్‌ అయ్యింది. ‘నేను ఎలిమినేట్ అవ్వడం కలగా ఉంది’ అని కన్నీళ్లు పెట్టుకుంది. దీన్నిబట్టి హౌజ్‌లో ఉండాలని ఆమె ఎంత గట్టిగా అనుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. కాగా నాలుగో వారంలోనే బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన రతిక రెమ్యునరేషన్‌ మాత్రం గట్టిగానే తీసుకుందట. రోజుకు 28 వేలు, ప్రతివారం 2 లక్షల రూపాయల చొప్పున మొత్తం నాలుగు వారాలకు కలిపి రూ. 8 లక్షల పారితోషకం అందుకుందట. మరికొన్ని రోజులు హౌజ్‌లో ఉండి ఉంటే రతిక మరింత మొత్తం తీసుకునేదేమో. అయినా ఇంత త్వరగా ఎలిమినేట్‌ అయినప్పటికీ గట్టిగానే రెమ్యునరేషన్‌ అందుకున్నట్లు తెలుస్తోంది.

కాగా బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి అడుగుపెట్టారు. అందులో రతికా రోజ్‌ ఆరంభంలోనే అందరి చూపును తన వైపునకు తిప్పుకునేలా చేసింది. తన గ్లామర్‌తోనూ కట్టిపడేసింది. పల్లవి ప్రశాంత్‌తో ప్రేమగా మాట్లాడుతూ జనాల మనసు చూరగొంది. అయితే అదంతా ఆటలో భాగమేనని త్వరగానే అర్ధమైపోయింది. రైతుబిడ్డకు వెన్నుపోటు పొడిచి ప్రిన్స్‌ యావర్‌తో ప్రేమగా నటించింది. చివరకు అతనితో కూడా గొడవపడింది. వీరి విషయంలోనూ కాదు.. ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తూ తోటి కంటెస్టెంట్స్‌కే చిరాకు తెప్పించింది. ఈ కారణంగానే నాలుగో వారం ఆరంభం నుంచే రతికనే ఎలిమినేట్‌ అవుతుందన్న వార్తలు వచ్చాయి. ఓటింగ్‌ కూడా తక్కువ రావడంతో హౌజ్‌ నుంచి ఈ హాట్‌ బ్యూటీ బయటకు రాక తప్పలేదు.

ఇవి కూడా చదవండి

పటాస్ టు బిగ్ బాస్.. రతిక జర్నీ..

బిగ్ బాస్ హౌజ్ లో రతికా రోజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు