Nithiin: తెలంగాణ పాలిటిక్స్‌లో సినీ గ్లామర్.. ఆ పార్టీ ఎన్నికల ప్రచారానికి హీరో నితిన్
త్వరలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రానుందనే ప్రచారం జోరందుకోవడంతో వ్యూహరచనకు తెలంగాణ కాంగ్రెస్ పదును పెడుతోంది. ఎన్నికల్లో గెలిచేందుకు సినీ గ్లామర్‌ను కూడా నమ్ముకోవాలని ఆలోచన కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. ఈ క్రమంలో యువ హీరో నితిన్‌ను ప్రచారంలోకి దింపేందుకు ప్లానింగ్ జరుగుతోంది. నితిన్ మేనమామ నగేశ్ రెడ్డి నిజామాబాద్ రూరల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రానుందనే ప్రచారం జోరందుకోవడంతో వ్యూహరచనకు తెలంగాణ కాంగ్రెస్ పదును పెడుతోంది. ఎన్నికల్లో గెలిచేందుకు సినీ గ్లామర్‌ను కూడా నమ్ముకోవాలని ఆలోచన కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. ఈ క్రమంలో యువ హీరో నితిన్‌ను ప్రచారంలోకి దింపేందుకు ప్లానింగ్ జరుగుతోంది. నితిన్ మేనమామ నగేశ్ రెడ్డి నిజామాబాద్ రూరల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు గనక టికెట్ కన్ఫామ్ అయితే నితిన్ ద్వారా ప్రచారం చేయించాలనే ఆలోచన తెలంగాణ కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. దీనికి సంబందించి హైకమాండ్‌తో టీకాంగ్రెస్ పెద్దలు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. గతేడాది నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం పూర్తి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన సినిమా. అందులో కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డి పాత్రలో రాణించారు. ఎన్నికల నిర్వహించే కలెక్టర్‌గా పవర్‌ఫుల్ పంచ్ డైలాగులు వల్లించారు. నితిన్ మేనమామ నగేశ్ రెడ్డి ప్రస్తుతం టీపీసీసీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా ఆయన పదేళ్లు పనిచేశారు. డీఎస్ మనిషి అని నగేష్‌రెడ్డికి పేరుంది. డీఎస్ పార్టీ మారినా ఆయన మాత్రం కాంగ్రెస్‌లోనే ఉన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోకి మోపాల్ మండలానికి చెందిన వారు నితిన్. ఆయన దగ్గర బంధువులు చాలా మంది సినీ రంగంలో ఉన్నారు. కొందరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

