Waltair Veerayya: టీవీలోకి మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’.. ఏ ఛానెల్‌లో ఎప్పుడు టెలికాస్ట్ కానుందంటే?
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన మెగా మల్టీస్టారర్ 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై ఈ మెగా మాస్ ఎంటర్‌టైనర్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సుమారు రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కొన్ని చోట్ల 200 రోజులు కూడా ఆడింది. ఆ మధ్యన 200 డేస్ సెలబ్రేషన్స్‌ను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ సినిమాలో చిరంజీవి వింటేజ్ లుక్, డ్యాన్స్, పెర్ఫామెన్స్‌కు అభిమానులతో సగటు సినీ ప్రేక్షకులందరూ ఫిదా అయ్యారు

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన మెగా మల్టీస్టారర్ ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై ఈ మెగా మాస్ ఎంటర్‌టైనర్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సుమారు రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కొన్ని చోట్ల 200 రోజులు కూడా ఆడింది. ఆ మధ్యన 200 డేస్ సెలబ్రేషన్స్‌ను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ సినిమాలో చిరంజీవి వింటేజ్ లుక్, డ్యాన్స్, పెర్ఫామెన్స్‌కు అభిమానులతో సగటు సినీ ప్రేక్షకులందరూ ఫిదా అయ్యారు. ఇక మాస్ మహారాజా స్పెషల్ అప్పియరెన్స్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొట్టింది. నెట్‌ఫ్లిక్స్‌లో భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇలా థియేటర్లు, ఓటీటీలో బ్లాక్ బస్టర్ బొమ్మగా నిలిచిన వాల్తేరు వీరయ్య ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది. దసరా పండగను పురస్కరించుకుని ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీలో ఈ మెగా మల్టీస్టారర్ ప్రసారం కానుంది. అయితే ఇంకా డేట్ అండ్ టైమ్ ను ప్రకటించలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన అప్ డేట్ కూడా రానుంది. కే.ఎస్.రవీంద్ర (బాబీ) తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. అలాగే క్యాథరీన్ థెరిస్సా ఓ కీలక పాత్రలో కనిపించింది.
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా వాల్తేరు వీరయ్య సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేయడం విశేషం. ప్రకాష్ రాజ్, బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, నాసర్, సత్యరాజ్, సుబ్బరాజు, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, ప్రదీప్ రావత్, శకలక శంకర్, మనోబాల, ఝాన్సీ, రఘుబాబు, చమ్మక్ చంద్ర.. తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని , వై రవిశంకర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన స్వారలు చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. థియేటర్లు, ఓటీటీల్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన వాల్తేరు వీరయ్య బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.
వాల్తేరు వీరయ్య మేకింగ్ వీడియో..
View this post on Instagram
పూనకాలు లోడింగ్…
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.