Rathika, Bigg Boss 7: ‘వాడుకోని ఆడుకోవాలనుకుంది.. తనే వాడిపోయింది’.. రతిక ఎలిమినేషన్‌కు కారణాలివే
'బిగ్ బాస్ హౌజ్‌లో అందరినీ వాడుకోని ఆడుకోవాలనుకుంది.. కానీ ఆఖరికి తనే వాడిపోయింది, బాహుబలి సినిమాలో కట్టప్పనే క్రాస్ చేసింది'.. ఇది బిగ్‌బాస్ నుంచి నాలుగో వారం ఎలిమినేట్ అయిన రతికా రోజ్ గురించి బిగ్‌బాస్ బజ్ హోస్ట్ గలాటా గీతూ చెప్పిన మాటలు. ఇందులో నిజం కూడా లేకపోలేదు. ఎందుకంటే బిగ్‌బాస్ ఏడో సీజన్ ప్రారంభంలో అందరి దృష్టి రతికా రోజ్‌పైనే నిలిచింది.
‘బిగ్ బాస్ హౌజ్‌లో అందరినీ వాడుకోని ఆడుకోవాలనుకుంది.. కానీ ఆఖరికి తనే వాడిపోయింది, బాహుబలి సినిమాలో కట్టప్పనే క్రాస్ చేసింది’.. ఇది బిగ్‌బాస్ నుంచి నాలుగో వారం ఎలిమినేట్ అయిన రతికా రోజ్ గురించి బిగ్‌బాస్ బజ్ హోస్ట్ గలాటా గీతూ చెప్పిన మాటలు. ఇందులో నిజం కూడా లేకపోలేదు. ఎందుకంటే బిగ్‌బాస్ ఏడో సీజన్ ప్రారంభంలో అందరి దృష్టి రతికా రోజ్‌పైనే నిలిచింది. ఈసారి టైటిల్ ఆమెదే అని చాలామంది భావించారు. ‘బిగ్‌బాస్ ముద్దుబిడ్డ’ అని ట్యాగ్‌లు కూడా ఇచ్చేశారు. గ్లామర్ పరంగా బాగానే కంటెంట్ ఇచ్చింది కూడా. అయితే షో సాగే కొద్దీ రతికపై చాలామందికి విరక్తి వచ్చేసింది. ఆమె ఆట ఆడే బదులు.. మనుషుల ఎమోషన్స్‌తో ఆడుకుంటోంది అన్న కామెంట్లు వినిపించాయి. అయినా తన ఆటతీరు మార్చుకోలేదీ హాట్ బ్యూటీ. తన దారి తనదే అన్నట్లు వ్యవహరించింది. ముఖ్యంగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్‌పై ప్రేమను ఒలకబోసి వాళ్లకే వెన్నుపోటు పొడవడం జనాలకు అసలు నచ్చలేదు. ఇక గేమ్స్ కానీ టాస్కుల్లో కానీ చిన్న చిన్న విషయాలకు కూడా పెద్దగా రాద్ధాంతం చేసి సాగదీసింది. మొత్తంగా బిగ్‌బాస్ లో తన జర్నీ చూస్తే.. వెన్నుపోట్లు.. లవ్ ట్రాక్‌లు తప్పితే ఏమీ లేదన్న భావన వచ్చింది. ఇదే సమయంలో నాలుగో పవరాస్త్ర కోసం పెట్టిన టాస్కుల్లోనూ రతిక పెద్దగా ప్రభావం చూపలేదు. ఇది ఆమెకు పెద్ద మైనస్‌గా మారింది.
అందుకే నాలుగో వారం ముందు నుంచి రతికనే ఎలిమినేట్ అవుతుందన్న వార్తలు వచ్చాయి. రతిక ప్రవర్తన తన ఓటింగ్‌పై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించింది. నాలుగో వారం ఓటింగ్‌లో ఆమె ఆఖరి స్థానంలో నిలిచింది. దీంతో ఆదివారం నాటి ఎపిసోడ్‌లో చాలామంది కోరుకున్నట్టుగానే రతిక రోజ్ ఎలిమినేట్ అయ్యింది. ఇక హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యానని తెలిశాక కన్నీళ్లు పెట్టుకుందీ హాట్ బ్యూటీ. నాగార్జున స్టేజ్ మీదకు పిలిచి ‘ఏం రతికా అప్ సెట్ అయ్యావా? అని అడిగితే ‘అవును సార్ అని కన్నీళ్లు పెట్టుకుంది రతిక. ఇదొక పాఠం.. హౌజ్ నుంచి బయటకు వెళ్లిన తరువాత నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకో.. నువ్వు ఇంకా చాలా యంగ్’ అంటూ బిగ్‌బాస్‌లో తన జర్నీని ఓ వీడియో చూపించారు నాగ్. అందులో అటు పల్లవి ప్రశాంత్.. ఇటు ప్రిన్స్ యావర్‌తో ఆమె నడిపిన ప్రేమ కలాపాలను మరోసారి తన కళ్లు ముందు ఉంచారు. వాటిని చూస్తూ ‘నేను ఎలిమినేట్ అవ్వడం కలగా ఉంది’అని కన్నీళ్లు పెట్టుకుంటూ హౌజ్‌ను వీడింది రతిక. అయితే బయటకు వెళ్తూ అందరి హౌస్ మేట్స్ గురించి మాట్లాడినా పల్లవి ప్రశాంత్ గురించి ఒక్క మాట చెప్పకపోవడం కొసమెరుపు.
ఎలిమినేషన్ పై రతిక ఏమన్నారంటే?
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.