Organ Donation: తాను ఆరిపోతూ మరొకరికి వెలుగు.. ప్రముఖ నటుడి ర్యాష్ డ్రైవింగ్‌లో మృతి చెందిన మహిళ నేత్రదానం
కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు నాగభూషణ్ ప్రయాణిస్తున్న కారు శనివారం (సెప్టెంబర్ 30) రాత్రి ప్రమాదానికి గురై ఒక మహిళ మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. సెప్టెంబర్ 30న రాత్రి 9-30 గంటల సమయంలో ఉత్తరహళ్లిలోని వసంత్‌పూర్ ప్రధాన రహదారిపై కృష్ణ, ప్రేమ అనే దంపతులను నాగభూషణం కారు ఢీకొట్టింది. వారిలో ప్రేమ (48) మృతి చెందింది
కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు నాగభూషణ్ ప్రయాణిస్తున్న కారు శనివారం (సెప్టెంబర్ 30) రాత్రి ప్రమాదానికి గురై ఒక మహిళ మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. సెప్టెంబర్ 30న రాత్రి 9-30 గంటల సమయంలో ఉత్తరహళ్లిలోని వసంత్‌పూర్ ప్రధాన రహదారిపై కృష్ణ, ప్రేమ అనే దంపతులను నాగభూషణం కారు ఢీకొట్టింది. వారిలో ప్రేమ (48) మృతి చెందింది. కారు డ్రైవర్ మితిమీరిన వేగం, అజాగ్రత్త కారణంగానే వాహనం నడుపుతున్నాడని, కారు డ్రైవర్ సినీ నటుడు నాగభూషణ్ రణ్ ను అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ పై విడుదల చేశామని డీసీపీ శివపక్రాష్ దేవరాజ్ తెలిపారు. తదుపరి విచారణ కోసం మళ్లీ పిలిస్తామన్నారు. కాగా ప్రమాద సమయంలో కారు అతివేగంతో నడుపుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రాత్రి ఆల్క హాల్ టెస్టింగ్ మీటర్‌లో నాగభూషణం మద్యం సేవించలేదన్న విషయం తేలిందని తెలిపారు. మరిన్ని పరీక్షల కోసం నాగభూషణం రక్త నమూనాను పరీక్షల నిమిత్తం పంపించారు. ఈ రోడ్డు ప్రమాదానికి ప్రస్తుతం కుమారస్వామి లేఅవుట్ ట్రాఫిక్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 279, 337, 304 ఎ, ఐపీసీ 279 నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్, ఫుట్‌పాత్‌పై డ్రైవింగ్, ఐపీసీ సెక్షన్ 337- ప్రాణాలకు హాని కలిగించడం, ఐపిసి సెక్షన్ 304 ఎ కింద నాగభూషణ్‌పై కేసు నమోదు చేశారు. నాగభూషణ్‌ను తాత్కాలిక బెయిల్‌పై విడుదల చేసిన పోలీసులు మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.
విషాదంలోనూ మానవత్వం..
కాగా ఈ ప్రమాదంలో మృతిచెందిన ప్రేమ కుటుంబ సభ్యులు విషాదంలోనూ మానవత్వం ప్రదర్శించారు. ప్రేమ తన కళ్లను దానం చేసి మరో కరి జీవితంలో వెలుగు నింపింది. కెంపేగౌడ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు ప్రేమ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. వారు బెంగళూరులోని గాయత్రీనగర్‌లోని ప్రేమ మైదున జయరామ్ నివాసానికి తీసుకెళ్లారు. మరోవైపు ఈ ప్రమాదంపై ప్రేమ, కృష్ణల కుమారుడు పార్థ కె. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ‘ఈ ప్రమాదానికి కారణం ఓ నటుడేనని చెబుతున్నారు. మాకు అది అక్కర్లేదు. మాకు న్యాయం కావాలి. మేం తప్పు చేస్తే మమ్మల్ని జైల్లో పెడతారు కదా? ఆ వ్యక్తిని కూడా జైలులో పెట్టండి. సెలబ్రిటీలకు వేర్వేరు నియమాలు ఉన్నాయా? ఒకరిని చంపినందుకు ఈ నటుడిని జైలులో పెట్టాలి. మాకు పరిహారం అవసరం లేదు. మేము డబ్బు కోసం ఇక్కడ లేం. కష్టపడి పెరిగిన మాకు ఎలా పని చేయాలో తెలుసు’ అని కన్నీరుమున్నీరయ్యాడు పార్థ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.