AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: ‘అన్నయ్యా.. మీ సేవలు ఎల్లకాలం ఇలాగే కొనసాగాలి’.. చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు పాతికేళ్లు

సినిమా ఇండస్ట్రీలో చిరంజీవిది ప్రత్యేక స్థానం. ఎలాంటి గాడ్‌ఫాదర్‌ లేకుండా మెగాస్టార్‌గా ఎదిగారు. తన నటనతో కోట్లాది మంది అభిమానం చూరగొన్నారు. ఒక వైపు తన సినిమాలతో వినోదాన్ని అందిస్తూనే.. సామాజిక బాధ్యతగా తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్.. అంటూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారాయన. తద్వారా సినిమాల్లోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ మెగాస్టార్‌గా పేరు తెచ్చుకున్నారు.

Chiranjeevi: 'అన్నయ్యా.. మీ సేవలు ఎల్లకాలం ఇలాగే కొనసాగాలి'.. చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు పాతికేళ్లు
Chiranjeevi
Basha Shek
|

Updated on: Oct 03, 2023 | 6:25 AM

Share

సినిమా ఇండస్ట్రీలో చిరంజీవిది ప్రత్యేక స్థానం. ఎలాంటి గాడ్‌ఫాదర్‌ లేకుండా మెగాస్టార్‌గా ఎదిగారు. తన నటనతో కోట్లాది మంది అభిమానం చూరగొన్నారు. ఒక వైపు తన సినిమాలతో వినోదాన్ని అందిస్తూనే.. సామాజిక బాధ్యతగా తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్.. అంటూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారాయన. తద్వారా సినిమాల్లోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ మెగాస్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. కాగా చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ (CCT)ను స్థాపించి సోమవారం (అక్టోబర్‌ 2) నాటికి సరిగ్గా 25 ఏళ్లు గడిచింది. 1998 అక్టోబర్‌ 2న చిరంజీవి ఈ సామాజిక సేవకు శ్రీకారం చుట్టారు. చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌లోని బ్లడ్‌ బ్యాంక్‌తో ఈ పాతికేళ్లలో లక్షలాది మంది ప్రాణాలు నిలిపారు చిరంజీవి. అలాగే ఐ బ్యాంక్‌తో ఎంతో మందికి కంటిచూపు అందించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ పాతికేళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అయ్యారు మెగాస్టార్‌. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ పెట్టారాయన.. అప్పటి సీసీటీ ట్రస్ట్‌తో పాటు తాను రక్తదానం చేస్తున్న ఫొటోలను షేర్‌ చేస్తూ ‘చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ గౌరవప్రదమైన ప్రారంభం. 25 సంవత్సరాల అద్భుతమైన ప్రస్థానాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను. ఈ ట్రస్ట్‌ ద్వారా 10 లక్షలకు పైగా యూనిట్ల రక్తాన్ని సేకరించి నిరుపేదలకు పంపిణీ చేశారు. 10 వేల మందికి పైగా కంటి చూపు మెరుగయ్యేలా చేశారు. కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో వేలాది మంది ప్రాణాలు రక్షించబడటంతోపాటు ఇంకా మరెన్నో సేవలందించారు. మన తోటి వారికి ఈ సేవలు అందించడం ద్వారా మనం పొందే సంతృప్తి ఎంతో అసమానమైనది, అమూల్యమైనది’

‘ చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ మానవతా కార్యక్రమాలను శక్తివంతం చేసి, మా సామూహిక మిషన్‌కు శక్తినిస్తున్న లక్షలాది మంది సోదరసోదరీమణులకు సెల్యూట్ చేస్తున్నాను. ఇది మన గొప్ప దేశానికి మనమంతా చేస్తున్న చిన్న సహకారం మాత్రమే. ఇది మహాత్ముడికి మనమంతా అర్పించే నిజమైన నివాళి’ అని ఎమోషనల్‌ అయ్యారు చిరంజీవి. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చిరంజీవి సామాజిక స్పృహకు అందరూ సెల్యూట్‌ చస్తున్నారు. మీరు రియల్‌ హీరో సార్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. భోళా శంకర్‌ తర్వాత బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరంజీవి. సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందనుందని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని అప్‌ డేట్స్‌ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్