AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: నాగ చైతన్య సింప్లిసిటీ.. స్టాఫ్‌మెంబర్‌ కొత్త బైక్‌పై ఆటోగ్రాఫ్‌ ఇచ్చి ఆపై.. వీడియో చూశారా?

అక్కినేని నాగచైతన్య ఈ ఏడాది కస్టడీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. తెలుగుతో పాటు తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అయితే నటన పరంగా నాగచైతన్యకు మంచి మార్కులు పడ్డాయి. కస్టడీ తర్వాత చందు మొండేటి సినిమాలో నటిస్తున్నాడు చైతూ. గతంలో వీరి కాంబి నేషన్‌లో ప్రేమమ్‌, సవ్యసాచి వంటి హిట్‌ సినిమాలు వచ్చాయి. దీంతో హ్యాట్రిక్‌ కాంబోలో వస్తోన్న ఈ మూవీపై అంచనాలు భారీగానే వచ్చాయి.

Naga Chaitanya: నాగ చైతన్య సింప్లిసిటీ.. స్టాఫ్‌మెంబర్‌ కొత్త బైక్‌పై ఆటోగ్రాఫ్‌ ఇచ్చి ఆపై.. వీడియో చూశారా?
Naga Chaitanya
Basha Shek
|

Updated on: Oct 03, 2023 | 6:10 AM

Share

టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య తన సింప్లిసిటీ చాటుకున్నారు. తన స్టాఫ్‌మెంబర్‌లో ఒకరు కొత్త బైక్‌ కొనగా.. అతని కోరిక మేరకు నాగచైతన్య బైక్‌పై ఆటోగ్రాఫ్‌ ఇచ్చారు. అంతేకాదు సరదాగా బైక్‌పై రౌండ్లు కొట్టారు. దీంతో సదరు స్టాఫ్‌ మెంబర్‌ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన అభిమానులు కూడా క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. కాగా చైతూకు బైక్స్‌, కార్లు అంటే చాలా ఇష్టం. ఇప్పటికే తన గ్యారేజీలో చాలా మోడల్స్‌ కార్లు, బైక్స్‌ ఉన్నాయి. కాగా అక్కినేని నాగచైతన్య ఈ ఏడాది కస్టడీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. తెలుగుతో పాటు తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అయితే నటన పరంగా నాగచైతన్యకు మంచి మార్కులు పడ్డాయి. కస్టడీ తర్వాత చందు మొండేటి సినిమాలో నటిస్తున్నాడు చైతూ. గతంలో వీరి కాంబి నేషన్‌లో ప్రేమమ్‌, సవ్యసాచి వంటి హిట్‌ సినిమాలు వచ్చాయి. దీంతో హ్యాట్రిక్‌ కాంబోలో వస్తోన్న ఈ మూవీపై అంచనాలు భారీగానే వచ్చాయి. ఎన్‌ సీ 23 (వర్కింగ్‌ టైటిల్‌) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించనుంది. గతంలో చైతూ- సాయి పల్లవిల కాంబోలో లవ్‌స్టోరీ వంటి సూపర్‌ హిట్‌ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఈ మ్యాజిక్‌ రిపీట్‌ కానుందంటున్నారు ఫ్యాన్స్‌.

గీతాఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు ఎన్‌ సీ 23 సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. లేటెస్ట్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా ఈ సినిమా మత్స్యకారుల జీవితంలోని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసమే నాగచైతన్య, ,చందూ మొండేటి తదితరులు కొన్ని రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారులను కలిశారు. వారి ఆచార వ్యవహారాలు, జీవన విధానాలు, భాష, శైలి గురించి వివరంగా తెలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి

 సిబ్బంది కొత్త  బైక్ పై నాగచైతన్య ఆటో గ్రాఫ్..

సాయి పల్లవితో మరో సినిమా..

View this post on Instagram

A post shared by Geetha Arts (@geethaarts)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..