AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: రైతు బిడ్డ విన్నర్‌ అయితే సంతోషిస్తానన్న అఖిల్‌.. ట్రోలర్స్‌కు గట్టిగా ఇచ్చిపడేశాడుగా..

మొదటి నుంచి పల్లవి ప్రశాంత్‌కు సపోర్టుగా నిలుస్తున్నాడు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 రన్నరప్‌ అఖిల్ సార్థక్‌. పల్లవి ప్రశాంత్‌ను ట్రోల్‌ చేసే వారికి తనదైన శైలిలో కౌంటర్లు వేస్తున్నాడు. ఇటీవల నాలుగో పవరాస్త్ర గెలిచినందుకు రైతు బిడ్డపై ప్రశంసల వర్షం కురిపించిన అఖిల్‌ తాజాగా మరోసారి ప్రశాంత్‌పై ఆసక్తికర కామెంట్లు చేశాడు. తను బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ విజేతగా నిలిస్తే చాలా సంతోషిస్తానన్నాడు.

Bigg Boss 7 Telugu: రైతు బిడ్డ విన్నర్‌ అయితే సంతోషిస్తానన్న అఖిల్‌.. ట్రోలర్స్‌కు గట్టిగా ఇచ్చిపడేశాడుగా..
Pallavi Prashanth, Akhil Sarthak
Basha Shek
|

Updated on: Oct 04, 2023 | 6:30 AM

Share

బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఐదో వారంలోకి అడుగుపెట్టిన ఈ రియాలిటి షో నుంచి నలుగురు కంటెస్టెంట్స్‌ ఎలిమినేట్‌ అయ్యారు. కిరణ్‌ రాథోడ్‌, షకీలా, దామిని భట్ల, రతికా రోజ్‌ మొత్తం నలుగురు హౌజ్‌ నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం హౌజ్‌లో పదిమంది కంటెస్టెంట్స్‌ మాత్రమే మిగిలారు. ఇదిలా ఉంటే రైతు బిడ్డగా బిగ్‌బాస్‌ హౌజ్‌లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్‌ తనదైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. సోషల్‌ మీడియాలోనూ అతనికి బాగా ఫాలోయింగ్‌ ఉంది. తాజాగా హౌజ్‌లో నాలుగో పవరాస్త్రను కూడా సొంతం చేసుకుని రెండు వారాల పాటు ఇమ్యూనిటీని సొంతం చేసుకున్నాడు. అంటే రెండు వారాల పాటు ఎవరూ అతనిని నామినేట్‌ చేసే అవకాశం లేదు. కాగా మొదటి నుంచి పల్లవి ప్రశాంత్‌కు సపోర్టుగా నిలుస్తున్నాడు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 రన్నరప్‌ అఖిల్ సార్థక్‌. పల్లవి ప్రశాంత్‌ను ట్రోల్‌ చేసే వారికి తనదైన శైలిలో కౌంటర్లు వేస్తున్నాడు. ఇటీవల నాలుగో పవరాస్త్ర గెలిచినందుకు రైతు బిడ్డపై ప్రశంసల వర్షం కురిపించిన అఖిల్‌ తాజాగా మరోసారి ప్రశాంత్‌పై ఆసక్తికర కామెంట్లు చేశాడు. తను బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ విజేతగా నిలిస్తే చాలా సంతోషిస్తానన్నాడు. అదే సమయంలో తనను ట్రోల్‌ చేస్తున్నవారికి గట్టిగా ఇచ్చి పడేశాడు

‘నన్ను ట్రోల్‌ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్. మీరు నాకు ఉచితంగా పబ్లిసిటీ ఇస్తున్నారు. నాపై నెగెటివ్ కామెంట్లు చేసే వాళ్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇవన్నీ నేను ఇప్పటికే వినాన్నను. వీటిని అస్సలు పట్టించుకోను కూడా. పల్లవి ప్రశాంత్‌ విన్నర్‌గా నిలిచినా, రన్నరప్‌తో సరిపెట్టుకున్నా నేను చాలా సంతోషిస్తా. అయితే సీజన్‌-4 ప్రోమోలు తీసుకొచ్చి కొంతమంది కంటెస్టెంట్స్ పీఆర్స్ స్టంట్స్ చేస్తున్నారు. దయచేసి కొత్తగా ఆలోచించండి. డిఫరెంట్‌గా ట్రోలింగ్‌ చేస్తే బాగుటుంది. నన్ను రెండుసార్లు రన్నరప్‌ అంటున్నారు. అరేయ్‌.. మీకు దమ్ముంటే హౌజ్‌లోకి వెళ్లి మీ ట్యాలెంట్‌ను ప్రూవ్‌ చేసుకోండి. పల్లవి ప్రశాంత్‌ హౌజ్‌లో క్లియర్‌గా గేమ్‌ ఆడుతున్నాడు. మీ పబ్లిసిటీ మీరు చేసుకోండి. వాటితో నాకెలాంటి ఫరక్‌ పడదు. అలాగే సీజన్‌-4 గుర్తు చేసినందుకు మీ అందరికీ మరోసారి థ్యాంక్స్’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు అఖిల్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా. అఖిల్‌, రైతుబిడ్డకు సపోర్టుగా పలువురు కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

రైతు బిడ్డకు అండగా అఖిల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే