Brahmamudi, October 4th episode: దుగ్గిరాల ఫ్యామిలీలో సందడే సందడి.. మగవాళ్లకు, ఆడవాళ్లకు మధ్య మొదలైన యుద్ధం!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కనకం, కృష్ణమూర్తి వాళ్లందరూ కావ్య ఇంటికి వస్తారు. కావ్యను చూసి మురిసి పోతుంది కనకం. అప్పుడే దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బయటకు వస్తారు. అపర్ణను చూసిన కనకం.. నమస్తే వదిన గారూ అని అంటుంది. అపర్ణ కూడా నమస్తే అంటుంది. కనకం ముఖం వెలిగిపోతుంది.. కూతురు ఇంటికి వచ్చామన్న ఆనందమా.. లేక అప్పు తీరిపోతుందన్న సంతోషమా.. అని రుద్రాణి చురకలు అంటిస్తుంది. ఒక్కచోటే అందరూ కలిశామన్న ఆనందం అమ్మా..

Brahmamudi, October 4th episode: దుగ్గిరాల ఫ్యామిలీలో సందడే సందడి.. మగవాళ్లకు, ఆడవాళ్లకు మధ్య మొదలైన యుద్ధం!
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Oct 04, 2023 | 11:24 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కనకం, కృష్ణమూర్తి వాళ్లందరూ కావ్య ఇంటికి వస్తారు. కావ్యను చూసి మురిసి పోతుంది కనకం. అప్పుడే దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బయటకు వస్తారు. అపర్ణను చూసిన కనకం.. నమస్తే వదిన గారూ అని అంటుంది. అపర్ణ కూడా నమస్తే అంటుంది. కనకం ముఖం వెలిగిపోతుంది.. కూతురు ఇంటికి వచ్చామన్న ఆనందమా.. లేక అప్పు తీరిపోతుందన్న సంతోషమా.. అని రుద్రాణి చురకలు అంటిస్తుంది. ఒక్కచోటే అందరూ కలిశామన్న ఆనందం అమ్మా.. అని కృష్ణమూర్తి అంటాడు. అవును పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా దొరికేసేది సంతోషం ఒక్కటే కదా అని రుద్రాణి అంటుంది. కొంత మంది కోట్లు ఖర్చు పెట్టినా కూడా అది దొరకదు రుద్రాణి గారూ అని కావ్య సెటైర్ వేస్తుంది.

మీ మనవడు మీ ఆదర్శలను ముందుకు తీసుకెళ్తాడు: 

ఆ తర్వాత కృష్ణమూర్తి.. రాజ్ దగ్గరకు వెళ్లి నువ్వు చేసిన సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను బాబూ.. ఈ రోజు ఇక్కడికి రాగలిగామన్నా.. కుటుంబంతో కలిసి పండుగ జరుపుకుంటున్నా దానికి కారణం మీరే అంటూ అంటాడు. అయ్యో అదేంటి అంకుల్ అలా అంటారు. కావ్య అమ్మా నాన్నలు అంటే నాకూ అంత సమానం కదా అని రాజ్ అనగా.. అందరూ సంతోషిస్తారు. ఆ తర్వాత సీతారామయ్య దగ్గరకు వెళ్లి.. రాజ్ అనే వాడు.. రాజరిక వంశంలో పుడితే అవ్వడయ్యా.. ప్రజల కష్టాలను తన కష్టాలు అనుకున్నప్పుడు నిజమైన రాజు అవుతాడు. మీ మనవడు మీ ఆదర్శలను ముందుకు తీసుకెళ్లే అలాంటి రాజే అయ్యాడు అని అంటాడు కృష్ణ మూర్తి.

ఇవి కూడా చదవండి

దుగ్గిరాల ఇంట్లో కళ్యాణ్, అనామిక పెళ్లి రచ్చ: 

ఈలోపు అనామిక వాళ్లు వస్తారు. కావ్య, కళ్యాణ్ లు వెళ్లి వాళ్లను తీసుకొస్తారు. తాతయ్య గారూ అనామిక వాళ్ల పేరెంట్స్.. మీతో ఏదో మాట్లాడాలంట అని కావ్య చెప్తుంది. ఇక అందరూ కూర్చుంటారు.. కానీ ఎవరూ మాట్లాడరు. ఈలోపు కళ్యాణ్, అనామికలు నువ్వు మాట్లాడంటే నువ్వు మాట్లాడు అని పోట్లాడుకుంటారు. మీరిద్దరూ చెప్పాల్సిన అవసరం లేదు.. మాకు మొత్తం విషయం అర్థమైందని కావ్య అంటాడు. ఇక రాజ్ కూడా సెటైర్లు వేస్తాడు. వాళ్లేం చెప్తార్లేండి.. పిల్లలు కదా.. సూటిగా సుత్తి లేకుండా నేను చెప్పేస్తాను. మా అమ్మాయి మీ అబ్బాయి ఒకరినొకరు ఇష్ట పడ్డారు. కాబట్టి పెద్దవాళ్లలా వాళ్లని మనం దీవిస్తే సంతోషంగా లైఫ్ స్టార్ట్ చేస్తారని అనామిక తండ్రి అంటాడు.

కళ్యాణ్ ఇష్టమే నా ఇష్టం:

ఇంట్లో పెద్దవాళ్లం మేము అయినా.. కళ్యాణ్ తల్లిదండ్రులుగా ధాన్యలక్ష్మి, ప్రకాష్ వాళ్లకే చెప్పే అధికారం ఉంటుంది. కాబట్టి వాళ్లకు ఇష్టమో లేదో కనుక్కోవడం మా బాధ్యత. ధాన్యలక్ష్మి మీకు ఇష్టమేనా అని ఇందిరా దేవి అడుగుతుంది. మా ఇంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా మా అత్తమామలే తీసుకుంటారెండి. ఆ తర్వాత మా అక్కా, బావా తీసుకుంటారు. కాబట్టి వాళ్లేమంటారో అదే మా ఇష్టం అని ధాన్య లక్ష్మి అంటుంది. అలా అంటారేంటి ధాన్య లక్ష్మి రాజ్ ఎంతో కళ్యాణ్ కూడా అంతే.. కానీ కళ్యాణ్ కన్న తల్లిదండ్రులు మీరే కాబట్టి కళ్యాణ్ విషయంలో మీరే నిర్ణయం తీసుకోవాలని అపర్ణ అంటుంది. అలా అయితే కళ్యాణ్ ఇష్టమే నా ఇష్టం అని ధాన్య లక్ష్మి అంటుంది. మీ ఇద్దరి ఇష్టమే నా ఇష్టం ధాన్యం అని ప్రకాష్ అంటాడు.

అనామిక మాటతో దుగ్గిరాల ఇంట్లో మొదలైన రచ్చ:

మీ ఫ్యామిలీ గురించి చాలా గొప్పగా విన్నాం. ఇప్పుడు కళ్లారా చూస్తున్నామని అనామిక తండ్రి అంటాడు. ఈ లోపు రుద్రాణి పుల్లలు పెడుతుంది. కావ్య పేరెంట్స్ ని తక్కువ చేసి మాట్లాడుతుంది. అప్పుడే సుభాష్, రాజ్ లు మాట్లాడుతూ కావ్య తల్లిదండ్రుల గురించి చెప్తూ వాళ్లను పొగుడుతారు. ముఖానికి రంగు వేసుకుని పైకి ఒకలా, లోపల ఒకలా నటించరు అంటూ చెప్తారు. ఏమంటారు నాన్న గారూ అని సుభాష్ అడగ్గా.. సరే అని చెప్తాడు సీతారామయ్యా. ఇక పూజ మొదలు పెడదాం అంటూ ఇందిరా దేవి అనగా.. నేను రెడీ అమ్మా.. అపర్ణ అన్ని సిద్ధం చేసిందా లేదా అని అంటాడు. మేము ఉదయాన్నే లేచి అన్నీ సిద్ధం చేశాం. అదేంటి అంకుల్ పూజకు ఏర్పాట్లన్నీ కష్టపడి ఆడవాళ్లు చేయాలి. కానీ చివర్లో వచ్చి మీరు పూజ చేస్తారా.. ఇది చాలా అన్యాయం అని అనామిక అంటుంది. అనామిక అలా అనగానే అందరూ షాక్ అవుతారు. మన హక్కుల కోసం మనం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు అని అనగా.. రాజ్ షాక్ అవుతాడు. అనామిక మాటలకు ఇక కావ్య, అపర్ణ, ధాన్య లక్ష్మి, స్వప్న అందరూ పట్టు బడతారు. ఇప్పుడే అసలైన యుద్ధం మొదలవుతుంది.

రాజ్ రాసిన చీటీ కోసం కావ్య ప్రయత్నాలు:

ఇక మేము ఎక్కువ అంటే మేము ఎక్కువ అంటూ ఆడవాళ్లూ.. మగవాళ్లు అందరూ పోటీ పడతారు. అప్పుడే సీతా రామయ్య.. పోటీ పెట్టాలని చెప్తాడు. అందులో ఎవరు గెలుస్తారో వాళ్లే పూజ చేస్తారు అంటూ చెప్తాడు. సరే అని ఇంట్లో అందరూ ఒప్పుకుంటారు. ఇక అందరూ అప్పుడే బయటకు వెళ్తారు. ఇక కావ్య సైలెంట్ పక్కకు తప్పుకుంటుంది. చీటీలు దగ్గి రాజ్ రాసిన లెటర్ తీయబోతుంది. అప్పుడే అక్కడు కనకం వచ్చి షాక్ ఇస్తుంది. నువ్వు చేసింది ఏంటి తప్పు అలా తీయకూడదు అని అంటుంది కనకం. లేదమ్మా నా మొగుడు రాసింది నేను చూడటానికి అధికారం ఉందని కావ్య వాదించగా.. కుదరదు పదా అని తీసు కెళ్తుంది.

ఇక ఇప్పుడే అసలైన పోటీ మొదలవుతుంది. ఒక తాడును క్లాత్ కట్టి ఎవరు లాగుతారో వాళ్లే.. పూజ చేస్తారు అంటూ చెప్తాడు సీతారామయ్య. ఇక అందరూ అటూ ఇటూ లాగుతూ ఉంటారు. ఇక మగవాళ్ల టీమ్ గట్టిగా తాడు లాగక.. తాడుతో పాటు కావ్య కూడా రాజ్ పై పడుతుంది. అయినా లేడీస్ అందరూ ఈ గెలుపును మేము ఒప్పుకోం అంటూ మళ్లీ గొడవ చేస్తారు. దీంతో సీతా రామయ్య మళ్లీ ఇంకో గేమ్ పెడతాడు. ఇప్పుడు ఏ జంట గెలుస్తారో వాళ్లే పూజ చేస్తారు అంటాడు. దీనికి అందరూ ఓకే చెప్తారు. దీంతో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!