Bigg Boss 7 Telugu: టాస్క్‏తో బిగ్‏బాస్‏కే షాకిచ్చిన కంటెస్టెంట్స్.. హౌస్‏లో దొంగలుగా మారి..

ఇప్పుడు కెప్టెన్సీ కోసం ఆట ఆడాలంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్‏లో స్మైలీ టీత్ టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంచాలకులుగా యావర్, శోభాను నియమించాడు. అయితే వారిద్దరూ గేమ్ ఆడుతూనే సంచాలకులుగా వ్యవహరించాల్సి ఉంటుంది. దీంతో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో పెద్ద రచ్చే జరిగింది. విజేతలను ఎంపిక చేయడంలో తడబడ్డాడు యావర్. అందరూ మిస్టేక్స్ చేయడంతో ఎవరికి న్యాయం చేయాలో తెలియక అయోమయ పరిస్థితిలోకి వెళ్లిపోయాడు. చివరకు గౌతమ్, సుబ్బు ఫస్ట్ అని అనౌన్స్ చేయడంతో పెద్ద యుద్ధమే జరిగింది.

Bigg Boss 7 Telugu: టాస్క్‏తో బిగ్‏బాస్‏కే షాకిచ్చిన కంటెస్టెంట్స్.. హౌస్‏లో దొంగలుగా మారి..
Bigg Boss 7 Telugu
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 04, 2023 | 4:50 PM

ఉల్టా పుల్టా సీజన్ 7లో కంటెస్టెంట్స్‏కు చుక్కలు చూపిస్తున్నాడు బిగ్‏బాస్. మొన్నటి వరకు పవరాస్త్ర కోసం టాస్కులు, ఛాలెంజ్ లు విసిరి… చివరకు నిన్న వాటిని తిరిగి లాగేసుకున్నాడు. ఇప్పుడు కెప్టెన్సీ కోసం ఆట ఆడాలంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్‏లో స్మైలీ టీత్ టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంచాలకులుగా యావర్, శోభాను నియమించాడు. అయితే వారిద్దరూ గేమ్ ఆడుతూనే సంచాలకులుగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పాడు బిగ్‏బాస్. దీంతో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో పెద్ద రచ్చే జరిగింది. విజేతలను ఎంపిక చేయడంలో తడబడ్డాడు యావర్. అందరూ మిస్టేక్స్ చేయడంతో ఎవరికి న్యాయం చేయాలో తెలియక అయోమయ పరిస్థితిలోకి వెళ్లిపోయాడు. చివరకు గౌతమ్, సుబ్బు ఫస్ట్ అని అనౌన్స్ చేయడంతో పెద్ద యుద్ధమే జరిగింది.

ముఖ్యంగా యావర్ నిర్ణయంపై ఇంటి సభ్యులు సీరియస్ అయ్యారు. ఫేవరిజం చూపిస్తున్నాడంటూ అరిస్తూ గోల చేశారు. ఇక తాజాగా విడుదలైన మరో ప్రోమోలో బిగ్‏బాస్ ఇచ్చిన టాస్క్ ను మార్చేశారు కంటెస్టెంట్స్. తాజాగా విడుదలైన ప్రోమోలో.. “నా స్నేహితుడు కొంతకాలంగా కొన్ని వస్తువులు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదు. ఇందుకు గానూ మీకు ఇస్తున్న టాస్క్.. దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర” అంటూ టాస్క్ అనౌన్స్ చేశారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

ఈ టాస్కులో భాగంగా బిగ్‏బాస్ స్నేహితుడు యాక్టివిటీ ఏరియాలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అతడిని లేపకుండా చాలా జాగ్రత్తగా వస్తువులను దొంగిలించాల్సి ఉంటుంది అని చెప్పారు. ఇక కంటెస్టెంట్స్ కొన్ని వస్తువులను దొంగిలించిన తర్వాత.. గార్డెన్ ఏరియాలో నిల్చోన్న కంటెస్టెంట్స్ లో తేజ దగ్గరి నుంచి ఓ వస్తువు లాక్కుంది శోభా. దీంతో ఆమె వద్ద నుంచి దొంగిలించిన వస్తువు తీసుకోవడానికి యావర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో శోభా, యావర్, ప్రియాంకా కింద పడి పోట్లాడుతుండగా.. మధ్యలో కల్పించుకున్న బిగ్‏బాస్.. మీరు చేస్తున్న పని వెంటనే ఆపి..జంటలుగా నిల్చో వాలని సూచించాడు.

ఆ తర్వాత టాస్క్ అసలు స్వరూపాన్ని మార్చే స్వేచ్ఛ మీకు ఏమాత్రం లేదని.. కానీ అదేం పట్టించుకోకుండా మీకు నచ్చిన వస్తువులను పట్టుకొచ్చారు. కాబట్టి అడగనివి ఎన్ని దొంగిలించారనే విషయంపై నిర్ణయించడం జరుగుతుందని చెప్పారు బిగ్‏బాస్. అయితే ఈ టాస్కులో ఎవరు ఏ వస్తువులు దొంగిలించారనేది తెలియాలంటే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.