Siddharth: బెంగుళూరులో ప్రెస్‌మీట్ అడ్డుకోవడంపై సిద్ధార్థ్ రియాక్షన్.. దానివల్ల భారీ నష్టం కలిగిందంటూ..
ప్రస్తుతం కావేరీ జలాల వివాదం నడుస్తున్న కారణంగా ఓ తమిళ నటుడు కర్ణాటకలో సినిమా ప్రదర్శించడం కుదరదని.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. దీంతో సిద్ధార్థ్ ప్రెస్ మీట్ మధ్యలోనే వెళ్లిపోయారు. అయితే సిద్ధార్థ్‌కు జరిగిన అవమానంపై కన్నడ నటీనటులు స్పందించారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, ప్రకాష్ రాజ్ సిద్ధార్థ్ కు క్షమాపణలు తెలిపారు. తాజాగా ఈ విషయంపై హీరో సిద్ధార్థ్ స్పందించారు. తమిళనాడుతో జరుగుతున్న కావేరి నీటి యుద్ధం కారణంగా
ఇటీవల బెంగళూరులో జరిగిన చిత్తా ప్రమోషన్స్‌లో హీరో సిద్ధార్థ్‌కు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. చిత్తా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బెంగుళూరులో ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా కరవే సభ్యులు అడ్డుకున్నారు. ప్రస్తుతం కావేరీ జలాల వివాదం నడుస్తున్న కారణంగా ఓ తమిళ నటుడు కర్ణాటకలో సినిమా ప్రదర్శించడం కుదరదని.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. దీంతో సిద్ధార్థ్ ప్రెస్ మీట్ మధ్యలోనే వెళ్లిపోయారు. అయితే సిద్ధార్థ్‌కు జరిగిన అవమానంపై కన్నడ నటీనటులు స్పందించారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, ప్రకాష్ రాజ్ సిద్ధార్థ్ కు క్షమాపణలు తెలిపారు. తాజాగా ఈ విషయంపై హీరో సిద్ధార్థ్ స్పందించారు. తమిళనాడుతో జరుగుతున్న కావేరి నీటి యుద్ధం కారణంగా తన సినిమా ఈవెంట్‌ను రద్దు చేయడం ‘నిరాశ కలిగించింది’ అని అన్నారు సిద్ధార్థ్. రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి తన సినిమాకు ఎలాంటి సంబంధం లేదని.. సినిమా ప్రదర్శనను అడ్డుకోవడం వల్ల మేకర్స్‌కు భారీ నష్టాన్ని కలిగిందని పేర్కొన్నాడు.
సిద్ధార్థ్ మాట్లాడుతూ.. “నిన్న బెంగళూరులో జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. నేను నిర్మాతగా చిన్నా (చిత్తా) సినిమాను థియేటర్లలో విడుదలకు ముందే చాలా మందికి చూపించాను. చెన్నై, కొచ్చిలో మీడియాకు చాలా మందికి చూపించాను. అలాగే బెంగళూరులో కూడా అలాంటి షోకి ప్లాన్ చేశారు. విడుదలకు ముందే దాదాపు 2,000 మంది విద్యార్థులకు సినిమా చూపించాలని ప్లాన్ చేశాను. ఇప్పటి వరకు ఏ దర్శకనిర్మాతలు ఇలాంటి ప్లాన్ చేయలేదు. ఆ రోజు రాత్రి కన్నడ స్టార్స్ కోసం సినిమాను ప్రదర్శించే ప్లాన్ చేశాం. కానీ బంద్‌కు కారణంగా మేము అన్ని షోలను రద్దు చేశాము. దీంతో భారీ నష్టాన్ని చవిచూశాము. కానీ అంతకు మించిన బాధకరమైన విషయమేంటంటే.. అక్కడ ఉన్న వ్యక్తులతో మంచి చిత్రాన్ని పంచుకోలేకపోవడం నిరాశపరిచింది ”అని ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో సిద్ధార్థ్ అన్నారు.
View this post on Instagram
“ప్రెస్ మీట్ తర్వాత అందరూ సినిమాను చూడవలసి ఉంది. కానీ అక్కడ ఏమి జరిగిందో మీరందరూ చూశారు. చాలా కెమెరాల ముందు ఆ ఘటన జరిగింది. నేను దాని గురించి మాట్లడదలుచుకోలేదు. సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తున్న తరుణంలో దృష్టి మరల్చడానికి ఏమీ మాట్లాడను. నా సినిమాకి, ఇష్యూకి ఎలాంటి సంబంధం లేదు. నా డబ్బు ఖర్చుపెట్టి నేను చేసే సినిమాల్లో నా సామాజిక బాధ్యత కనిపిస్తుందని నేను నమ్ముతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.