Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అందమైన లొకేషన్‏లో అందాల తార.. సైక్లింగ్ చేస్తూ సేద తీరుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ?..

తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ బ్యూటీ. అయితే సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. బీటౌన్ నుంచి ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఎవరో గుర్తుపట్టారా ?.. ఓవైపు వ్యక్తిగత సమస్యలతో మానసిక సంఘర్షణ.. ఆరోగ్యం కోసం నిత్యం పోరాడుతున్న ఈ హీరోయిన్ ఇప్పుడు సినిమాలకు బ్రేక్ తీసుకుని ప్రశాంతమైన లైఫ్ గడుపుతుంది.

Tollywood: అందమైన లొకేషన్‏లో అందాల తార.. సైక్లింగ్ చేస్తూ సేద తీరుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ?..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 30, 2023 | 12:44 PM

అందమైన లొకేషన్‏లో ఉన్న ఈ అందాల తారకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆమె సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అలరిస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ బ్యూటీ. అయితే సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. బీటౌన్ నుంచి ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఎవరో గుర్తుపట్టారా ?.. ఓవైపు వ్యక్తిగత సమస్యలతో మానసిక సంఘర్షణ.. ఆరోగ్యం కోసం నిత్యం పోరాడుతున్న ఈ హీరోయిన్ ఇప్పుడు సినిమాలకు బ్రేక్ తీసుకుని ప్రశాంతమైన లైఫ్ గడుపుతుంది. విదేశాల్లోని అందమైన ప్రదేశాల్లో ఎంజాయ్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నిత్యం సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఎవరో గుర్తుపట్టే ఉంటారు కదూ. తనే హీరోయిన్ సమంత.

ఇటీవలే ఖుషి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది సామ్.. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించారు. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ సరసన నటించిన సిటాడెల్ చిత్రం త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఈ రెండు సినిమాల అనంతరం సామ్ మూవీస్ కు బ్రేక్ తీసుకుంది. ఇందుకు కారణం లేకపోలేదు. చాలా రోజులుగా సమంత మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలు ఈ వ్యాధికి ఇంట్లోనే చికిత్స తీసుకుంది. కాస్త కోలుకున్న తర్వాత కొన్ని చిత్రాల్లో నటించింది. అయితే ఈ సమస్య మరింతగా ఇబ్బంది పెడుతుండడంతో చికిత్స కోసం అమెరికా వెళ్లినట్లుగా తెలుస్తోంది. దాదాపు ఏడాది కాలం అక్కడే సామ్ చికిత్స తీసుకోనుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత సామ్ తిరిగి సినిమాలపై ఫోకస్ చేయనుంది. అయితే ఇప్పటికే సామ్ బాలీవుడ్ లో బిగ్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ నడుస్తోంది. సల్మాన్ ఖాన్ జోడిగా సామ్ కనిపించనుందని తెలుస్తోంది. అయితే ఈ రూమర్స్ పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక తాజాగా సామ్ తన ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియోస్, ఫోటోస్ వైరలవుతున్నాయి. అందులో సామ్ సైక్లింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు