AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Antony: చిరంజీవి సినిమా పేరుతో విజయ్ ఆంటోని.. బాధ నుంచి తేరుకుని సెట్స్‏లోకి హీరో..

తెలుగులోనూ విజయ్ ఆంటోనీకి అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన బిచ్చగాడు సినిమాకు సౌత్ ఇండస్ట్రీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో విజయ్ నటనకు అడియన్స్ హృదయాలను తాకింది. ఈ సినిమాతోనే పాపులారిటీని సంపాదించుకున్న విజయ్.. ఆ తర్వాత పలు చిత్రాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఫాలోయింగ్ పెంచుకున్నారు. కొద్దిరోజుల క్రితం బిచ్చగాడు 2 సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు రాగా.. సిస్టర్ సెంటిమెంట్‏తో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.

Vijay Antony: చిరంజీవి సినిమా పేరుతో విజయ్ ఆంటోని.. బాధ నుంచి తేరుకుని సెట్స్‏లోకి హీరో..
Vijay Antony
Rajitha Chanti
|

Updated on: Sep 30, 2023 | 10:36 AM

Share

తమిళ్ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోనీ. కేవలం కథానాయికుడిగానే కాకుండా.. సింగర్‏గా, దర్శకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్‎గా ప్రేక్షకులను అలరించారు. ఇటు తెలుగులోనూ విజయ్ ఆంటోనీకి అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన బిచ్చగాడు సినిమాకు సౌత్ ఇండస్ట్రీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో విజయ్ నటనకు అడియన్స్ హృదయాలను తాకింది. ఈ సినిమాతోనే పాపులారిటీని సంపాదించుకున్న విజయ్.. ఆ తర్వాత పలు చిత్రాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఫాలోయింగ్ పెంచుకున్నారు. కొద్దిరోజుల క్రితం బిచ్చగాడు 2 సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు రాగా.. సిస్టర్ సెంటిమెంట్‏తో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత అతను నటించిన హత్య సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న విజయ్ ఆంటోనీ జీవితంలో ఇటీవల పెను విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆయన పెద్ద కూతురు మీరా ఆంటోనీ సెప్టెంబర్ 19న ఆత్మహత్య చేసుకుంది. మానసిక ఒత్తిడి భరించలేక మీరా.. తన గదిలో ఉరివేసుకుని బలవన్మరాణానికి పాల్పడింది. కూతురి అకాల మరణంతో విజయ్ ఆంటోనీ తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. తన కూతురితోపాటు తాను కూడా చనిపోయానంటూ ట్వీట్ చేశారు.కూతురి లేదన్న బాధను దిగమింగుకుని శుక్రవారం చిన్న కూతురు లారా ఆంటోనీతో కలిసి రత్తం సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నారు విజయ్. ఈ క్రమంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడిప్పుడే బాధ నుంచి కోలుకుంటున్న విజయ్ ఆంటోనీ.. తిరిగి సినిమాలపై దృష్టి పెట్టారు.

ఇవి కూడా చదవండి

తాజాగా ఆయన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. దర్శకుడు ధన తెరకెక్కిస్తోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి హిట్లర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నట్లు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేశారు. నిన్న విడుదలైన పోస్టర్ లో విజయ్ ఆంటోనీ మీసాలు, గడ్డం ట్రిమ్ చేసుకుని రఫ్ లుక్ లో కనిపించారు. ఆయన బ్యాగ్ గ్రౌండ్ లో ఓ చిన్న గ్రామం తగలబడుతుండగా.. జనాలంతా పరుగులు తీస్తున్నారు. మరోవైపు వర్షం పడుతుంది. ఇందులో రియా సుమన్ కథానాయికగా నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రూ.7,500 తగ్గిన బంగారం ధర.. తాజాగా హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!
రూ.7,500 తగ్గిన బంగారం ధర.. తాజాగా హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!
బ్యాంక్ లోన్ కావాలా? ఇకపై సిబిల్ ఒక్కటి సరిపోదు.. ఇవి మ్యాండేటరీ
బ్యాంక్ లోన్ కావాలా? ఇకపై సిబిల్ ఒక్కటి సరిపోదు.. ఇవి మ్యాండేటరీ
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్