Samantha: ఫైనల్లీ నన్ను ఒకరు అర్థం చేసుకున్నారు.. ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత..

సమంత నటించిన చిత్రం ఖుషి..సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఇందులో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించగా.. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది.అలాగే ఖుషి చిత్రంలోని సాంగ్స్ శ్రోతలను మెప్పించాయి. ఈ సినిమాలో విజయ్, సామ్ కెమిస్ట్రీ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోనున్నట్లు ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

Samantha: ఫైనల్లీ నన్ను ఒకరు అర్థం చేసుకున్నారు.. ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 23, 2023 | 11:03 AM

ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన హీరోయిన్ సమంత..న్యూయార్క్ నగరంలో సందడి చేస్తుంది. మయోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్లిన సామ్.. ఇటీవలే అక్కడ ఇండిపెండెన్స్ డే సెలబ్రెషన్లలో పాల్గొంది. అలాగే బ్లాక్ శారీలో న్యూయార్క్ వీధుల్లో ఫోటోషూట్స్ నిర్వహిస్తూ ఎంజాయ్ చేస్తుంది. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‏గా ఉంటూ అక్కడ తాను గడుపుతున్న ప్రతి మూమెంట్ పాలోవర్లతో పంచుకుంటుంది సామ్. ఇప్పటివరకు అనేక ఫోటోస్, వీడియోస్ షేర్ చేసిన సామ్.. తాజాగా న్యూయార్క్ మార్నింగ్స్ అంటూ కొన్ని ఫోటోలను పంచుకున్నారు. అక్కడ సామ్ కొన్ని పిక్స్ షేర్ చేస్తూ.. ఇలాంటి ఉదయాలు.. నాకు సంతోషాన్ని కలిగించే ప్రదేశాలు అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం సామ్ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి. అందులో సామ్ బ్లూకలర్ డెనిమ్ జాకెట్ లో మరింత స్టైలీష్ గా కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే.. కొద్ది రోజులుగా లవ్, రిలేషన్ షిప్ అంటూ కొన్ని కోట్స్ షేర్ చేస్తుంది సామ్. తాజాగా మరోసారి ఆసక్తికర పోస్ట్ తన్ ఇన్ స్టా స్టోరీలో పంచుకున్నారు. అందులో ఆమె ఎట్టకేలకు నన్ను ఒకరు అర్థం చేసుకున్నారు అంటూ చేతిలో జంబో కప్పు కాఫీ పట్టుకుని నవ్వుతూ కెమెరాకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. “చివరగా నన్ను అర్థం చేసుకున్న వ్యక్తి #jumbosizedcoffee” అంటూ రాసుకొచ్చింది సామ్.

Samantha Latest Photo

Samantha Latest Photo

సమంత నటించిన చిత్రం ఖుషి..సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఇందులో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించగా.. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది.అలాగే ఖుషి చిత్రంలోని సాంగ్స్ శ్రోతలను మెప్పించాయి. ఈ సినిమాలో విజయ్, సామ్ కెమిస్ట్రీ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోనున్నట్లు ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

ఈ సినిమానే కాకుండా.. సామ్ సిటాడెల్ చిత్రంలోనూ నటించింది. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈమూవీ తర్వలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఈ రెండు చిత్రాలను కంప్లీట్ చేసిన సామ్.. ఇప్పుడు మయోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్లింది. ఇందుకు ఆమె దాదాపు సంవత్సరకాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వనుంది.ఇప్పటికే తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా తిరిగి ఇచ్చేసిందట. మయాసైటిస్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి సినిమాలపై సామ్ ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ