AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలుసా ?..

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో చిరు బర్త్ డే సెలబ్రెషన్స్ ఘనంగా నిర్వహించారు మెగా అభిమానులు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‏లో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు చిరు. వాల్తేరు వీరయ్య సినిమాతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు చిరు. చాలా కాలం తర్వాత ఈ సినిమాలో ఫుల్ మాస్ లుక్‏లో కనిపించి అలరించారు. ఇక ఇటీవలే భోళా శంకర్ సినిమాతో అడియన్స్ ముందుకు రాగా.. ఈమూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలుసా ?..
Megastar Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Aug 23, 2023 | 7:10 AM

Share

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక అధ్యాయం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనుకుంటున్న ఎంతో మంది నటీనటులకు ఆయనే స్పూర్తి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా చిత్రపరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆగస్ట్ 22న చిరు పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో చిరు బర్త్ డే సెలబ్రెషన్స్ ఘనంగా నిర్వహించారు మెగా అభిమానులు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‏లో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు చిరు. వాల్తేరు వీరయ్య సినిమాతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు చిరు. చాలా కాలం తర్వాత ఈ సినిమాలో ఫుల్ మాస్ లుక్‏లో కనిపించి అలరించారు. ఇక ఇటీవలే భోళా శంకర్ సినిమాతో అడియన్స్ ముందుకు రాగా.. ఈమూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

అయితే ఇప్పుడు నెట్టింట చిరు రెమ్యూనరేషన్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ వరుస సినిమాలతో అదరగొడుతున్న చిరు.. పారితోషికం విషయంలోనూ తగ్గేదేలే అంటున్నారట. ప్రస్తుతం చిరు ఒక్కో సినిమాకు రూ.63 నుంచి 65 కోట్ల వరకు తీసుకుంటున్నారని టాక్. ఇటీవల విడుదలైన భోళా శంకర్ సినిమా కోసం ఆయన దాదాపు రూ. 60 కోట్లు తీసుకున్నారని సమాచారం. అంతకు ముందు ఒక్కో సినిమాకు చిరు రూ.35 నుంచి రూ.50 కోట్ల వరకు తీసుకనేవారని టాక్.

అంతకు ముందు గాడ్ ఫాదర్ సినిమా కోసం రూ.45 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. ఇక ఆ తర్వాత వాల్తేరు వీరయ్య చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో చిరు తన రెమ్యూనరేషన్ సైతం పెంచేశారని టాక్. ఇక భోళా శంకర్ తర్వాత చిరు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో చేయనున్నారు. గతంలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్, సంయుక్త జంటగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ బింబిసార చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహించారు. ఇక తన రెండవ సినిమా ఏకంగా చిరుతో చేయబోతున్నారు.

చిరు నెక్ట్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చిరు బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. పంచభూతాల్ని ప్రతిబింబించే ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ యూవీ క్రియేషన్స్ విడుదల చేసింది.

అలాగే చిరు మరో ప్రాజెక్ట్ ఆయన కూతురు సుష్మిత కొణిదెల నిర్మించనున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్న ఈ సినిమాకు దర్శకుడు ఎవరనేది తెలియాల్సి ఉంది. చిరు బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై