- Telugu News Photo Gallery Cinema photos Do you know these star celebrities who did small work before entering industry vijay Deverakonda to Samantha telugu cinema news
Tollywood: విజయ్ సేతుపతి టూ సమంత.. స్టార్స్ కాకముందు ఈ హీరోహీరోయిన్స్ ఏం చేసేవారో తెలుసా ?..
సినిమా ఇండస్ట్రీలో ఓ స్టార్‌కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కానీ సినీ పరిశ్రమలో చాలా మంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఎంట్రీ ఇచ్చి తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. యశ్, విజయ్ సేతుపతి , విజయ్ దేవరకొండ, సమంత ఇలా చాలా మంది స్టార్స్ కాకముందు ఏం చేసేవారో తెలుసా ?.. అయితే ఇప్పుడు తెలుసుకుందాం. నటీనటులుగా ఎదిగిన తారలు వ్యక్తిగత విషయాలపై ఓ లుక్కెయ్యండి. విజయ్ సేతుపతికి పాన్ ఇండియా స్థాయిలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవల విడుదలైన జవాన్ సినిమాతో తమిళం, హిందీ, తెలుగులో భారీ విజయాన్ని అందుకున్నారు.
Updated on: Sep 30, 2023 | 12:40 PM

సినిమా ఇండస్ట్రీలో ఓ స్టార్‌కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కానీ సినీ పరిశ్రమలో చాలా మంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఎంట్రీ ఇచ్చి తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. యశ్, విజయ్ సేతుపతి , విజయ్ దేవరకొండ, సమంత ఇలా చాలా మంది స్టార్స్ కాకముందు ఏం చేసేవారో తెలుసా ?.. అయితే ఇప్పుడు తెలుసుకుందాం. నటీనటులుగా ఎదిగిన తారలు వ్యక్తిగత విషయాలపై ఓ లుక్కెయ్యండి.

విజయ్ సేతుపతికి పాన్ ఇండియా స్థాయిలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవల విడుదలైన జవాన్ సినిమాతో తమిళం, హిందీ, తెలుగులో భారీ విజయాన్ని అందుకున్నారు. అయితే విజయ్ సినిమాల్లోకి రాకముందు దుబాయ్‌లో అకౌంటెంట్‌గా పనిచేశారు. 10 లక్షల రూపాయల అప్పు తీర్చేందుకు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత స్టార్ ఆర్టిస్టుగా ఎదిగాడు.

మలయాళ స్టార్ నటుడు మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించారు. అయితే నటుడిగా అరంగేట్రం చేయకముందు దుల్కర్ సల్మాన్ దుబాయ్‌లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేశారు.. ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం చేశారు. కానీ ఆ తర్వాత ఉద్యోగం మానేసి సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు.

కేజీఎఫ్ 2' సినిమా ద్వారా యష్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ తర్వాత ఆయన కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు. అయినా యశ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యష్ మొదట్లో తెరవెనుక పనిచేశాడు. అతని తండ్రి బస్ డ్రైవర్. యష్ మొదట బుల్లితెరపై అడుగుపెట్టాడు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఓ వెలుగు వెలిగారు.

సమంత..ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమెకు తెలుగుతోపాటు హిందీలోనూ అభిమానులు ఉన్నారు. గ్రాడ్యూయేషన్ పూర్తిచేసిన సామ్.. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. కథానాయికగా ఎంట్రీ ఇవ్వకముందు పలు యాడ్స్ చేసింది.

విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ బాయ్. అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించారు. అయితే నటుడిగా అడుగుపెట్టకముందు విజయ్ పలు మ్యూజిక్ వీడియోలు చేశారు. నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ఇటీవల విజయ్ దేవరకొండ నటించి ఖుషి సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.




