Bigg Boss 7 Telugu: ఓటింగ్‌లో శివాజీనే టాప్.. పాపం.. ఆ హీరోహీరోయిన్లకు గట్టిగా దెబ్బ పడిందిగా.. డేంజర్లో ఆ బ్యూటీ..
నేనెందుకు అనర్హుడి అంటూ హోస్ట్ నాగార్జునను నిలబెట్టి అడిగేశాడు. దీంతో ఒక్కొక్క కంటెస్టెంట్ దగ్గరి నుంచి సరైన సమాధానం అడగ్గా.. అంత తెల్ల ముఖాలు వేశారు. దీంతో సీరియల్ బ్యాచ్ దెబ్బకు శివాజీకి అన్యాయం అయితే జరిగింది. అయితే కంటెస్టెంట్స్ అంతా కలిసి అతడి పవరాస్త్ర వెళ్లిపోయేలా చేసినా.. అడియన్స్ మాత్రం ఓటింగ్‌లో టాప్ లో నిలబెట్టారు. ఇప్పటివరకు నమోదైన పోలింగ్‌లో శివాజీ నెంబర్ వన్ స్థానంలోకి దూసుకోచ్చాడు. ఇక డైలాగ్స్ తప్ప గేమ్ ఆడని అమర్ దీప్‌ను నాలుగో స్థానంలో నిలబెట్టేశారు.
గతవారం సీరియల్ బ్యాచ్ వ్యూహానికి బలయ్యాడు శివాజీ. అంతా కలసి అతని పవరాస్త్ర వెళ్లిపోయేలా చేశారు. దీంతో మరుసటి రోజు అసలు తప్పేంటో అడియన్స్ ముందుకు తీసుకువచ్చాడు. నేనెందుకు అనర్హుడి అంటూ హోస్ట్ నాగార్జునను నిలబెట్టి అడిగేశాడు. దీంతో ఒక్కొక్క కంటెస్టెంట్ దగ్గరి నుంచి సరైన సమాధానం అడగ్గా.. అంత తెల్ల ముఖాలు వేశారు. దీంతో సీరియల్ బ్యాచ్ దెబ్బకు శివాజీకి అన్యాయం అయితే జరిగింది. అయితే కంటెస్టెంట్స్ అంతా కలిసి అతడి పవరాస్త్ర వెళ్లిపోయేలా చేసినా.. అడియన్స్ మాత్రం ఓటింగ్‌లో టాప్ లో నిలబెట్టారు. ఇప్పటివరకు నమోదైన పోలింగ్‌లో శివాజీ నెంబర్ వన్ స్థానంలోకి దూసుకోచ్చాడు. ఇక డైలాగ్స్ తప్ప గేమ్ ఆడని అమర్ దీప్‌ను నాలుగో స్థానంలో నిలబెట్టేశారు.
ఐదోవారం టేస్టీ తేజ నేరుగా నామినేట్ కాగా.. ఆ తర్వాత శివాజీ, అమర్ దీప్, ప్రియాంక, శుభ శ్రీ, ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజా నామినేట్ అయ్యారు. వీరికి సోమవారం నుంచే ఓటింగ్ పోల్ జరిగింది. అయితే ప్రస్తుతం ఓటింగ్ లో శివాజీ మాత్రం ఇరగదీస్తున్నాడు. అడియన్స్ పల్స్ తెలుసుకున్న శివాజీ పాయింట్ టూ పాయింట్ మాట్లాడుతూ సీరియల్ బ్యాచ్ ఆట కట్టిస్తున్నాడు. ఇక ఫేవరిజం చూపిస్తున్నాడంటూ పవరాస్త్ర పోయేలా చేసిన సీరియల్ బ్యాచ్ అసలు గట్టు రట్టు చేశాడు శివాజీ. దీంతో అతడికి ఇప్పటివరకు 33.46శాతం ఓటింగ్ వచ్చినట్లుగా తెలుస్తోంది.
View this post on Instagram
ఇక ఆ తర్వాత ప్రిన్స్ యావర్ 17.48 % తో రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే 13.19 %తో శుభ శ్రీ రాయగురు మూడో స్థానంలో ఉంది. ఇక విన్నర్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి డైలాగ్స్ తప్ప గేమ్ ఆడని సీరియల్ హీరో అమర్ దీప్ ఓటింగ్ మాత్రం రోజు రోజుకు తగ్గిపోతుంది. మొన్నటి వరకు మూడో స్థానంలో నెట్టుకొచ్చిన ఈ హీరో.. ఇప్పుడు ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయాడు. ఇప్పుడు అమర్ దీప్ కు 10.95 ఓటింగ్ నమోదయ్యింది. ఈవారం ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 9.44 శాతంతో ఐదో స్థానంలో టేస్టీ తేజ ఉండగా.. స్వల్ప తేడాతో గౌతమ్ కృష్ణ ఆరో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు డాక్టర్ బాబుకు 9.37% ఓటింగ్ వచ్చింది. ఇక చివరగా.. 6.11%తో జానకి కలగనలేదు సీరియల్ బ్యూటీ ప్రియాంక జైన్ ఏడవ స్థానంలో ఉంది. అంటే ప్రస్తుతం ప్రియాంకనే డేంజర్ జోన్ లో ఉంది. ఇక ఈ మూడు రోజుల ఓటింగ్ మారితే టేస్టీ తేజ లేదా ప్రియాంక వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావడం ఖాయంగా తెలుస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.