Biotin Powder: జుట్టు, చర్మం హెల్దీగా ఉండాలా.. అయితే ఈ ఒక్క పొడిని తీసుకోండి!!

చర్మం క్లియర్ గా ఉండాలని, తెల్లగా, అందంగా కనిపించాలని, జుట్టు రాలకుండా ఒత్తుగా నిగనిగలాడాలని ఎవరికి ఉండదు చెప్పండి. అలా కోరుకునే వారికి ఈ పొడి బాగా హెల్ప్ చేస్తుంది. ఈ ఒక్క పొడిని క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. అదే బయోటిన్ పౌడర్. బయోటిన్ లో విటమిన్ బీ కాంప్లెక్స్, H, అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, వంటివి ఉంటాయి. ఇవి స్కిన్, హెయిర్ ఆరోగ్యంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది. బయోటిన్ స్కిన్ గ్లోని పెంచడానికి, జుట్టు..

Biotin Powder: జుట్టు, చర్మం హెల్దీగా ఉండాలా.. అయితే ఈ ఒక్క పొడిని తీసుకోండి!!
Biotin Powder
Follow us
Chinni Enni

|

Updated on: Sep 25, 2023 | 3:33 PM

చర్మం క్లియర్ గా ఉండాలని, తెల్లగా, అందంగా కనిపించాలని, జుట్టు రాలకుండా ఒత్తుగా నిగనిగలాడాలని ఎవరికి ఉండదు చెప్పండి. అలా కోరుకునే వారికి ఈ పొడి బాగా హెల్ప్ చేస్తుంది. ఈ ఒక్క పొడిని క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. అదే బయోటిన్ పౌడర్. బయోటిన్ లో విటమిన్ బీ కాంప్లెక్స్, H, అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, వంటివి ఉంటాయి. ఇవి స్కిన్, హెయిర్ ఆరోగ్యంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది. బయోటిన్ స్కిన్ గ్లోని పెంచడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించి, పెంచేందుకు సహాయ పడుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. మరి ఈ బయోటిన్ పౌడర్ కు కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బయోటిన్ పౌడర్ కు కావాల్సిన పదార్థాలు:

బాదం – కప్పు, వాల్ నట్స్ – కప్పు, గుమ్మడి గింజలు – కప్పు, జీడి పప్పు – అర కప్పు, అవిసె గింజలు – అర కప్పు, పుచ్చ కాయ గింజలు – అర కప్పు, వేరు శనగ – రెండు స్పూన్లు, చియా సీడ్స్ – రెండు స్పూన్లు, నువ్వులు – ఒక స్పూన్.

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

ఒక పాన్ తీసుకుని మీడియం మంట మీద పైన చెప్పిన నట్స్ ని ఒక్కొక్కటిగా వేస్తూ దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ పూర్తిగా చల్లార నివ్వండి. నెక్ట్స్ ఓ మిక్సీ జార్ లో వీటన్నింటినీ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారైన ఈ పౌడర్ ని ఓ ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసుకుని స్టోరో చేసుకోవాలి. ఈ పౌడర్ ని రోజూ ఒక స్పూన్ తింటే.. శరీరానికి అవసరమైన బయోటిన్ ఈజీగా లభిస్తుంది.

చర్మానికి ప్రయోజనాలు:

ఈ పౌడర్ ను క్రమం తప్పకుండా తినడం వల్ల చర్మం కాంతి వంతంగా తయారు అవుతుంది. చర్మాన్ని సాఫ్ట్ గా తయారు చేస్తుంది. సాధారణంగా కొంత మంది శరీరంపై దద్దుర్లు, పొలుసులు ఉండటం, ఎర్రగా మారడం వంటికి కనిపిస్తాయి. ఇవి బయోటిన్ లోపం కారణంగా ఏర్పడతాయి. ఇలాంటి వారు కూడా ఈ పొడిని తీసుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్ హెచ్.. శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాకుండా నట్స్ వల్ల బాడీలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

జుట్టుకు ప్రయోజనాలు:

రోజూ ఈ పౌడర్ ను తీసుకుంటే జుట్టు రాలడం అనేది ఆగిపోతుంది. జుట్టు బలంగా, దృఢంగా తయారువుతుంది. అలాగే జుట్టు ఒత్తుగా పెరిగేందుకు కూడా ఈ పౌడర్ ఉపయోగ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. బయోటిన్ ఎక్కువగా పాలు, గింజలు, కాయగూరలు, సోయా చిక్కుడు, చేపలు, మాంసం వంటి వాటిల్లో విరివిగా ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..