Telugu News Health World Lung Day: Know 5 Common Warning Signs of Lung Disease in Telugu
World Lung Day: మీ చాతిలో ఈ విధంగా నొప్పి వస్తుందా? ఏమాత్రం ఆలస్యం చేయకండి..
వ్యక్తి శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఊపిరితిత్తులు ఒకటి. ఊపిరి తిత్తులు శరీరం అంతటికీ ఆక్సీజన్‌ను చేరవేస్తుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటేనే.. మనం ఆరోగ్యంగా ఉంటాం. ఊపిరితిత్తుల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. వ్యక్తికి ఊపిరితిత్తులు అనేవి చాలా కీలకం. వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఊపిరితిత్తుల వ్యాధికి సంబంధించి సంకేతాలను విస్మరించడం వలన తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.
Lungs Health
Follow us
వ్యక్తి శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఊపిరితిత్తులు ఒకటి. ఊపిరి తిత్తులు శరీరం అంతటికీ ఆక్సీజన్‌ను చేరవేస్తుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటేనే.. మనం ఆరోగ్యంగా ఉంటాం. ఊపిరితిత్తుల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. వ్యక్తికి ఊపిరితిత్తులు అనేవి చాలా కీలకం. వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఊపిరితిత్తుల వ్యాధికి సంబంధించి సంకేతాలను విస్మరించడం వలన తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. ఈ ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం సందర్భంగా ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడని ఊపిరితిత్తుల వ్యాధుల సంకేతాల గురించి తెలుసుకుందాం..
నిరంతర దగ్గు: నిరంతర లేదా దీర్ఘకాలిక దగ్గు శ్వాసకోశ వ్యవస్థలో లోపానికి, అనారోగ్యానికి సంకేతంగా పేర్కొనవచ్చు. అప్పుడప్పుడు దగ్గు రావడం సాధారణమైనప్పటికీ.. చాలా వారాల పాటు దగ్గు ఉంటే మాత్రం.. అది అంతర్లీన ఊపిరితిత్తుల సమస్యలను సూచిస్తుంది. దీర్ఘకాలిక బ్రోన్కైటిస్, ఉబ్బసం, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి పరిస్థితుల లక్షణం కావచ్చు. అందుకే నిరంతరం దగ్గు వస్తున్నట్లయితే.. వెంటనే ఆరోగ్య నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యం.
శ్వాస ఆడకపోవడం: ఇంతకు ముందెన్నడూ సమస్య తలెత్తని సాధారణ పనుల్లో కూడా మీకు ఆయాసం అవుతున్నట్లయితే.. అది ఊపిరితిత్తుల అనారోగ్యానికి సంకేతంగా చెప్పొచ్చు. శ్వాస లోపం సమస్య కూడా తలెత్తుతుంది. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), పల్మనరీ ఫైబ్రోసిస్, గుండె సంబంధిత సమస్యల కారణంగా కూడా ఊపిరితిత్తుల వ్యాధుల లక్షణం కావచ్చు. ఇలాంటి సందర్భంలో వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం చాలా అవసరం.
గురక: వైద్యుల ప్రకారం..గురక అనేది ఊపిరి పీల్చుకునేటప్పుడు చేసే అధిక-పీచ్ విజిల్ శబ్ధం. వాయు మార్గాలు ఇరుకైనవి, సంకోచానికి గురైనప్పుడు ఇలా గురక వస్తుంది. గాలి స్వేచ్ఛగా ప్రవహించడం కష్టతరం అవుతుంది. శ్వాసలో గురక సాధారణంగా ఆస్తమా, అలెర్జీలు, సీఓపీడీ కారణంగా వస్తుంది. మీరు శ్వాసలో గురక సమస్యను అనుభవిస్తున్నట్లైతే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
ఛాతి నొప్పి: ఛాతి నొప్పి అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. ఊపిరితిత్తుల సంబంధిత ఛాతీ నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. కత్తిపోటు కంటే ఎక్కువగా ఉంటుంది. లోతైన శ్వాస లేదా దగ్గుతో తీవ్రమవుతుంది. న్యుమోనియా, ప్లూరిసీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ఊపిరితిత్తుల పరిస్థితులు ఛాతీ నొప్పిగా పేర్కొంటారు. తీవ్రమైన ఊపిరితిత్తుల నొప్పి ఉన్నట్లయితే.. వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన మేరకు చికిత్స తీసుకోవాలి.
రక్తం కారడం: హెమోప్టిసిస్, లేదా రక్తంతో దగ్గడం అనేది ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడని తీవ్రమైన లక్షణం. ఇది తీవ్రమైన పరిస్థితిని సూచించకపోయినా, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్షయవ్యాధి, పల్మోనరీ ఎంబోలిజంతో సంబంధం కలిగి ఉంటుంది. కలిగి ఉంటుంది. దగ్గుతున్నప్పుడు రక్తం కారుతున్నట్లయితే.. వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన చికిత్స పొందండి.