Ajwain Seeds Benefits: వాముతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా.. రాత్రి ఈ నీటిని తాగితే అమేజింగ్ బెనిఫిట్స్!!

వాము గురించి అందరికీ తెలుసు.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వామును వంటల్లో విరివిగా ఉపయోగిస్తూంటారు. ముఖ్యంగా వామును తిన్న ఆహారం అరగడానికి యూజ్ చేస్తారు. బజ్జీలు, పకోడీలు వంటివి శనగ పిండితో తయారు చేస్తారు. ఇలాంటి ఆహారాలు త్వరగా అరగవు కాబట్టి.. వీటిల్లో వామును ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే వామును కేవలం తిన్న ఆహారాలు అరిగించుకోవడం కోసమే కాదు.. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా రాత్రి పడుకునే..

Ajwain Seeds Benefits: వాముతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా.. రాత్రి ఈ నీటిని తాగితే అమేజింగ్ బెనిఫిట్స్!!
Ajwain Seeds
Follow us
Chinni Enni

|

Updated on: Sep 25, 2023 | 3:29 PM

వాము గురించి అందరికీ తెలుసు.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వామును వంటల్లో విరివిగా ఉపయోగిస్తూంటారు. ముఖ్యంగా వామును తిన్న ఆహారం అరగడానికి యూజ్ చేస్తారు. బజ్జీలు, పకోడీలు వంటివి శనగ పిండితో తయారు చేస్తారు. ఇలాంటి ఆహారాలు త్వరగా అరగవు కాబట్టి.. వీటిల్లో వామును ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే వామును కేవలం తిన్న ఆహారాలు అరిగించుకోవడం కోసమే కాదు.. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు వాముని తీసుకుంటే చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. మరి వామును ఎలా తీసుకోవాలి? ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నెలసరి సమయాల్లో నొప్పిని తగ్గిస్తుంది:

చాలా మంది మహిళలకు నెలసరి సమయాల్లో పొత్తి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. అలాగే పొత్తి కడుపు కూడా ఉబ్బుతుంది. వికారంగా అనిపిస్తుంది. ఇలాంటప్పుడు వాము నీటిని తాగడం వల్ల పీరియడ్స్ టైమ్ లో వచ్చే నొప్పి, తిమ్మిర్లు తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గొచ్చు:

బరువు తగ్గించుకోవడానికి కూడా వామును ఉపయోగించుకోవచ్చు. రెండు గ్లాసుల నీటిలో ఒక స్పూన్ వామును వేసి.. ఒక గ్లాస్ అయ్యేంత వరకూ మరిగించుకోవాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగడమే. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఫలితం కనిపిస్తుంది. అలాగే వాము పొడిని కూడా ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో కలుపుకుని తాగవచ్చు.

పంటి నొప్పి – నోటి దుర్వాసన ఉండవు:

వాము పంటి నొప్పి తగ్గించుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఒక స్పూన్ వాము పొడి, ఆఫ్ స్పూన్ ఆలీవ్ ఆయిల్, గోరు వెచ్చటి నీటితో కలిపి తాగితే పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే నోటి నుంచి దుర్వాసన కూడా రాదు. దీనితో పాటు నోరు కూడా క్లీన్ గా ఉంటుంది.

అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు:

రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో వాము పొడిని కలుపుకుని తాగితే జీర్ణ సమస్యలు, అజీర్తి, గ్యాస్, మల బద్ధకం, చెడు కొలెస్ట్రాల్ తగ్గడం వంటి సమస్యలకు చెక్ పడుతుంది. అవసరమైతే వాము పొడి కలిపిన నీటిలో బెల్లం పొడిని లేదా తేనె కూడా కలుపుకుని తాగవచ్చు.

బీపీ కంట్రోల్ లో ఉంటుంది:

ప్రస్తుతం ఇప్పుడు ప్రతి ఒక్కరికీ బీపీ అనేది కామన్ గా ఉంటుంది. బీపీతో బాధ పడేవారు వాము కలిపిన నీటిని తాగితే మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గుండెకు కాల్షియం ప్రవేశించకుండా వాము నిరోధిస్తుంది.

ఊపిరితిత్తులకు మంచిది:

వానా కాలం, చలి కాలాల్లో చాలా మంది జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. జలుబుతో బాధ పడేవారు వామును ఒక వస్త్రంలో కట్టి వాసన పీల్చుతూ ఉంటే రిలీఫ్ గా ఉంటుంది. ఊపిరితిత్తులు కూడా క్లియర్ గా ఉంటాయి. వాములో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దగ్గు, ఆస్తమా వంటి సమస్యలను తగ్గిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.