AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinnamon Benefits: ఈజీగా వెయిట్ లాస్ అవ్వాలంటే.. దాల్చిన చెక్క పొడి చిటికెడు తీసుకుంటే సరిపోతుంది!

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ కారణంగా ఎవరికీ సమయం ఉండటం లేదు. దీంతో వ్యాయామాలు చేయలేక పోవడం, ఇంట్లో చేసిన మంచి ఆహారాన్ని తీసుకోలేక పోతున్నారు. ఈ కారణంగా అనేక సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా బయట ఫుడ్ తినడం వల్ల తమకు తెలియకుండానే బరువు పెరుగుతున్నారు. బరువు ఈజీగానే పెరుగుతారు కానీ.. తగ్గాలంటే చాలా కష్ట పడాల్సి వస్తుంది. ఈ కాలంలో బరువు తగ్గాలంటే అంత ఈజీ అయిన పని కాదు. దీని కోసం వ్యాయామాలు, డైట్..

Cinnamon Benefits: ఈజీగా వెయిట్ లాస్ అవ్వాలంటే.. దాల్చిన చెక్క పొడి చిటికెడు తీసుకుంటే సరిపోతుంది!
Cinnamon
Chinni Enni
|

Updated on: Sep 24, 2023 | 9:49 AM

Share

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ కారణంగా ఎవరికీ సమయం ఉండటం లేదు. దీంతో వ్యాయామాలు చేయలేక పోవడం, ఇంట్లో చేసిన మంచి ఆహారాన్ని తీసుకోలేక పోతున్నారు. ఈ కారణంగా అనేక సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా బయట ఫుడ్ తినడం వల్ల తమకు తెలియకుండానే బరువు పెరుగుతున్నారు. బరువు ఈజీగానే పెరుగుతారు కానీ.. తగ్గాలంటే చాలా కష్ట పడాల్సి వస్తుంది. ఈ కాలంలో బరువు తగ్గాలంటే అంత ఈజీ అయిన పని కాదు. దీని కోసం వ్యాయామాలు, డైట్ ఫుడ్ ని తీసుకోవాలి. వెంటనే బరువు తగ్గినా.. అది దీర్ఘకాలింగా ప్రభావం చూపిస్తుంది. మెల్లగా వెయిట్ లాస్ అవ్వాలి. అలా అయితేనే ఆరోగ్యానికి కూడా మంచిది. ఇక ఈజీగా వెయిల్ లాస్ అవ్వాలనుకునే వారికి మన కిచెన్ దొరికే ఐటెమ్ దాల్చిన చెక్క. ఇది బరువు తగ్గాలనుకునే వారికి బాగా ఉపయోగ పడుతుందని నిపుణులు . దాల్చిక చెక్కతో ఎలా బరువు తగ్గొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకలిని అదుపులో ఉంచుతుంది:

దాల్చిన చెక్కలో క్రోమియం అనే పదార్థం ఉంటుంది. ఇది ఆకలిని అదుపులో ఉంచడమే కాకుండా.. బాడీలోని గ్లూకోజ్ స్థాయిల్ని ప్రభావితం చేస్తుంది. దీంతో బరువు తగ్గించేందుకు హెల్ప్ అవుతుంది. అలాగే శరీరంలోని చెడు కొవ్వుల్ని కరిగించి.. మంచి కొవ్వులను పెంచే గుణం దాల్చిన చెక్కలో ఉంది.

ఇవి కూడా చదవండి

యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు:

దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి పొట్టలోని చెడు బ్యాక్టీరియను తొలగిస్తుంది. ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ శుభ్రంగా ఉండి.. తీసుకున్న ఆహారం నిల్వ ఉండకుండా.. త్వరగా జీర్ణం అవుతుంది. దీంతో బరువు తగ్గేందుకు ఛాన్స్ ఉంది.

ఇన్సులిన్ ని ప్రభావితం చేస్తుంది:

రక్తంలో షుగర్ లెవల్స్ ను పెరగకుండా చూడంలో దాల్చిన చెక్క బాగా వర్క్ చేస్తుంది. దాల్చిన చెక్క వల్ల బాడీలో ఇన్సులిన్ ప్రభావం పెరుగుతంది. దీంతో చక్కెర స్థాయిలు పెరిగితే అదుపులో ఉంటాయి. ఫలితంగా శరీరంలో కొవ్వులు పేరుకుపోకుండా ఉంటాయి.

జీవ క్రియను వేగవంతం చేస్తుంది:

దాల్చిన చెక్క తిన్న ఆహారాన్ని తేలిగ్గా అరిగేలా చేస్తుంది. దీంతో బాడీలో కొవ్వు అనేది పేరుకుపోకుండా ఉంటుంది. ఫలితంగా బరువు పెరగకుండా ఉంటారు.

బరువు తగ్గాలనుకునే వారు ఇలా చేయండి:

ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసుకుని.. రోజూ తాగితే బరువు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నీటిలో కలుపుకుని తాగలేని వారు.. పండ్ల రసాలు, స్మూతీస్ లలో కూడా కలుపుకుని తాగవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్